Loading...

మిమ్మల్ని ప్రేమించే దేవుని మాటను గైకొనండి!

Sis. Evangeline Paul Dhinakaran
02 Dec
నా ప్రియులారా, నేడు మన తండ్రియైన దేవుడు మనలను ప్రేమించు చున్నాడు. మనము ఆయన మాటలను గైకొన్నప్పుడు ఆయన మనలను ప్రేమించును. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీ యొద్దకు దేవుడు వచ్చి నివాసము చేయాలనియు మరియు మీరు దేవుని ప్రేమించుచు, ఆయన వాక్యానికి ఘనతను ఇవ్వాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు. బైబిల్‌లో చూచినట్లయితే, ‘‘ కాబట్టి ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, నీ మేలు కొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? ’’ (ద్వితీయోపదేశకాండము 10:12,13) అన్న వచనముల ప్రకారము మీరు ఆయన మాటకు విధేయత చూపి లోబడి ఉండాలని ఆయన మీ పట్ల ఆశించుచున్నాడు. అయితే, ఒక వ్యక్తి ఎప్పుడు ప్రభువునకు భయపడి, ఆయనకు లోబడి ఉంటాడు? ప్రేమగలిగిన హృదయం నుండి మాత్రమే విధేయత ప్రవహిస్తుంది. మనం బైబిల్‌లో చదివినట్లయితే, ‘‘ యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము ’’ (యోహాను 14:23) అన్న వచనము ప్రకారము ప్రియులారా, మీ ప్రస్తుత పరిస్థితులు మరియు శ్రమలు దేవుని ప్రేమ నుండి మీ కళ్ళను కప్పివేసినట్లయితే, ప్రస్తుతం మీలో ఉన్న మంచి విషయాలన్నిటిని ఒక పట్టిక వేసుకొనుటకు సమయమును వెచ్చించండి. మీరు దీన్ని చేస్తున్నప్పుడు, మీరు పొడవైన పట్టికలో ఆశ్చర్యపోవునట్లుగా, మీ హృదయం ఆయనపై ప్రేమతో గంతులు వేస్తుంది. మీకు కావలసిన మాటలను బయలుపరుస్తాడు. దేవుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. ఆయన మీరు నడువవలసిన తన యొక్క మార్గములను మీకు బోధిస్తాడు.     
 
నా తండ్రి సహోదరులు డి.జి.యస్ దినకరన్ గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయన తన చివరి క్షణాలలో మాలో ప్రతి ఒక్కరిని పిలిచి మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆయన నా కుమారుడు శామ్యేల్‌ను తన దగ్గరికి పిలిచి, మృధువుగా, ‘ శ్యామ్, నీవు బైబిల్‌ను చదివి, ప్రతిరోజు ప్రార్థించాలి. అది ఎంతో ప్రాముఖ్యమైనది, అంతే! అది చాలు ’ అని దానిని మూడుసార్లు మరల మరల చెప్పారు. ఆయన ఆ మాటలు మళ్లీ చెప్పుట ద్వారా దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యత తెలియపరచబడినది. నా కొడుకు శామ్యేల్ ప్రతిరోజు దేవునిపట్ల మరియు తన తాత పట్ల ఉన్న ప్రేమను బట్టి ఆయన చెప్పినది చేసేవాడు. ఆలాగుననే, యేసు మార్త మరియు మరియ ఇంటికి వెళ్ళినప్పుడు, ‘‘ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను ’’ (లూకా 10:42). ఆ ఒక విషయం ఏమిటి? అది దేవుని ప్రేమ ద్వారా ఆయన సన్నిధిలో కూర్చుని ఉండేది! మరియ ఆయన పాదాల వద్ద కూర్చుని, ఆయన చెప్పినదంతా వినెను. ఆమె అలాగున చేసినందున, ఒక అవసరం వచ్చినప్పుడు, యేసు వారి సోదరుడైన లాజరును మరణం నుండి సజీవముగా లేపాడు.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఇలాగున చెప్పవచ్చును, నా కుటుంబంలో ఉన్నవారిని కోల్పోయాను. మా కుటుంబమంతయు నిర్జీవమైనదిగా ఉన్నది, ఇకమీదట నాకు ఆశీర్వాదాలు ఉండవు. నా కుటుంబములో దుఃఖమే మిగిలిపోయినదని వేదనపడుచున్నారా? పరిస్థితులను చూసి మీరు భయపడవద్దు. ఉత్సహించండి. నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మీరు ఆయన మాటకు లోబడుచు, ఆయన స్వరాన్ని వింటూ, దాని ప్రకారము అనుసరిస్తున్నప్పుడు, ఎండిన భూములన్నియు సమృద్ధిగా పంట నిచ్చుట మీరు చూస్తారు. తెలివిలేనివారు తెలివైనవారుగా మార్చబడెదరు. బలహీనులు బలంగా మారతారు. పేదలు ధనవంతులు అవుతారు! మీ జీవితంలో దేవుని మహిమ బయలుపరచబడుట మీరు చూస్తారు. యేసు లాజరు ఉన్న సమాధి వద్దకు వెళ్ళినప్పుడు, ‘ నీ సహోదరుడు మరల లేచునని మార్తాతో చెప్పెను. ’ ఈ రోజు, దేవుడు మీతో కూడ అదే చెప్పుచున్నాడు. అద్భుతాలను నమ్మండి మరియు రుచిచూడండి! దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉన్నప్పుడు, ఆయన తన బిడ్డల జీవితాలలో అద్భుత మరియు మహత్కార్యములను జరిగించుటను మనము చూడగలము. ఆయన తన యొక్క పరిపూర్ణమైన ప్రేమతో మనలను నింపి, ఆయనతో మనము సహవాసము కలిగి యుండుటకు సహాయము చేసి మనలను పరవశింపజేస్తాడు.
Prayer:
ప్రేమా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ,
 
మా జీవితములో క్లిష్టమైన పరిస్థితుల ద్వారా మృతమైన మా జీవితాన్ని నీ యెదుటకు తీసుకొని వస్తున్నాము. మాలో ఉన్న మృతమైన కార్యములను ఇప్పుడే మా నుండి తొలగించుము. మేము ఎదుర్కొనుచున్న అవమానమును, సిగ్గును మా నుండి తొలగించుము. మా మూర్ఖత్వం నుండి బయటపడటానికి మాకు నీ జ్ఞానం మరియు బలం ఎంతో అవసరం. మేము దేవుని వాక్యాని చదువుచు, దానిని అనుసరించుటకు మాకు కృపను దయచేయుము. మాకున్న ప్రేమ అనుదినము వృద్ధిపొందునట్లు చేయుము. ప్రభువా, నీవు మా యొద్దకు వచ్చి, నివాసము చేయుటకై ఈనాటి నుండి మేము నీ మాటను గైకొని, నిన్ను ప్రేమించే గొప్ప ధన్యతను మాకు దయచేయుము. నిర్జీవమైన మా క్రియలను నీవు ఈనాటి నుండి సజీవంగా మార్చుమని సమస్త, స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000