Loading...
Stella dhinakaran

మనలను రక్షించే దేవుని యొక్క గొప్ప కృప వాత్సల్యము!

Sis. Stella Dhinakaran
15 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుని కృపచేత రక్షించాలని మీ పట్ల కోరుచున్నాడు. ఈనాడు, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు మిమ్మును మరచిపోయారని బాధపడుచున్నారా? కలవరపడకండి, మన దేవుడు కరుణామయుడు, దయానీయుడు, ఆయన కృప చొప్పున మిమ్మును జ్ఞాపకము చేసుకొంటాడు. మిమ్మును ఎవరు మరచినను, దేవుడు మరువడు. ఆయన కృప ద్వారా మిమ్మును తన యొద్దకు చేర్చుకొంటాడు. ఈ క్రింద చెప్పబడిన వాక్యము దేవునితో మాట్లాడే ఒక చిన్న ప్రార్ధన. దేవుడు మన కుటుంబాల మధ్యలో ఉంటూ, ఆయన సన్నిధితోను మరియు శాంతితోను నింపాలని మనమందరం కోరుకుంటున్నాము. కానీ, కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క అవినీతి మార్గాల వలన ఆ కుటుంబములో అలజడులను రేపుతుంది. తద్వారా, భూమి పునాదులలో నుండి భూకంపం వచ్చినట్లుగానే మనము కుప్ప కూలిపోతాము. కాబట్టి, చింతించకండి. మీ కుటుంబ సభ్యుల పట్ల మీరు చూపే శ్రద్ధ మరియు ఆందోళనను విడిచి, ప్రతి వ్యక్తి కోసం తన విలువైన రక్తాన్ని చిందించిన ప్రభువైన యేసు, తన ప్రేమ బంధములతో వారిని తన వైపునకు ఆకర్షించుకొనుచున్నాడు. వారు దేవుని ప్రేమ నుండి లేదా మీ ప్రార్థనల నుండి తప్పించుకోలేరు. కాబట్టి, మీ కుటుంబ సభ్యుల రక్షణ కొరకు దేవుని యందు విశ్వాసముంచండి. " అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటి వారును రక్షణ పొందుదురని చెప్పెను '' (అపొస్తలుల కార్యములు 16:31) అన్న వచనము ప్రకారము నిశ్చయంగా రక్షణ అను అగ్ని ప్రాకారముల వంటి దేవుని కృప మీ కుటుంబంలోని ప్రజలందరి యెడల విస్తరింపచేయగల సమర్థుడు.

ఒక యౌవనస్థురాలు, స్వేచ్చ జీవితాన్ని గడిపింది. సుఖభోగాలు లోకాశలు అనుసరించి తన ఇష్టమొచ్చినట్లుగా జీవించింది. దైవసేవకుల, సంఘకాపరుల లేదా తన కుటుంబ సభ్యులలోని ఎవరి సలహాలను కానీ, విచారణ కాని లెక్క చేయక జీవించేది. కాలం గడిచిన కొద్ది, పాపపు నిచ్చెన మెట్లను ఎక్కి పాప జీవిత శిఖరానికి చేరుకుంది. పాపపు సముద్రంలో ఈదులాడుతున్న ఈ యువతికి ఊహించని విధంగా ఒక ఉజ్జీవ ఆత్మీయ కూటములో పాల్గొనే అవకాశం కలిగినది. ప్రారంభంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఆమెకు విభిన్నంగా వుండెను. కానీ, తర్వాత దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షంగా ఆమెతో మాట్లాడి ఆమె హృదయాన్ని కదిలించి వేసినది. అవును! దేవుని వాక్యము సజీవమైనది మరియు శక్తివంతమైనదై యున్నదని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది, " ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది '' (హెబ్రీయులకు 4:12) అన్న వాక్యము ప్రకారము ఆమె ఎంత ఎక్కువ వినుచున్నదో అంతగా ఆమె హృదయం కదిలించబడుచుండెను. అంతమాత్రమే కాదు, కళ్ల వెంట కన్నీళ్లు కారగా ఆమె ఎంతగానో ఏడ్చినది. ఇది దేవుని యొక్క కృప! ఎక్కడ పాపము విస్తరించునో అక్కడ దేవుని కృప అధికమగునని వాక్యము మనకు సెలవిచ్చుచున్నది, " పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను '' (రోమా 5:21) అను ఈ వాక్యము ఆమె జీవితములో నిజమైనది. ఆమె తన పాత పాపపు జీవితాన్ని విసిరివేసి, దేవునిలో జీవించుటకు ఆయన మహిమ సన్నిధిలో గడుపుటకు ప్రారంభించినది. ఆమె దేవుని చేతుల నుండి నూతన హృదయమును మరియు నూతన ఆత్మను, నూతన శరీరమును, నూతన జీవమును పొందుకున్నది. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విశ్వాసమును గుర్తు చేసుకొనుటకు మార్పులేని దేవుని ప్రేమను అనుసరించవలెను. అప్పుడు మీ ప్రియులగు వారి పాపాలకు లేదా వ్యసనాలకు ఆకర్షింపబడరు. దేవుని వెలుగు వారి యొక్క చీకటి మీద విజయాన్ని పొందుతుంది. " యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము '' (కీర్తనలు 106:4,5) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు త్వరలో విజయాన్ని చూస్తారు. ఎందుకంటే, బైబిలు ఇలా చెబుతోంది, " అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము '' (రోమీయులకు 8:37) అన్న వచనము ప్రకారము మీరు నివసించే స్థలము, మీ నివాసం శాంతి మరియు సంతోషకరమైన ప్రదేశంగా మారుతుంది! కావుననే మీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, అనుదినము దేవుని వాక్యము వినుటకు మీ ఆత్మీయ నేత్రాలు తెరువుమని ప్రార్థించండి, మీరు ఎటువంటి స్థితిలో వున్నను దేవుని యందు నమ్మకము కలిగియున్నప్పుడు, నిశ్చయముగా మన కృప గల దేవుడు మీ పాపాలను కడిగివేసి ఆయన పరిపూర్ణతలో కృప వెంబడి కృపను మీపై కుమ్మరించి, మిమ్మల్ని తన కృపచేత విస్తరింపజేస్తాడు.
Prayer:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ,

నీ ప్రేమా, కరుణ మరియు కృపను గురించి తెలుసుకొనుటకు మాకిచ్చిన గొప్ప తరుణమును బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. నీ వాక్యము ద్వారా మేము గొప్ప అనుభూతిని పొందుకున్నాము. ఈ రోజు మొదలుకొని నీ దివ్య కృపను మాకిచ్చి నిందారహితముగాను, మేము ఈ భూమి మీద నీతివంతమైన జీవితమును గడుపుటకు మాకు సహాయం చేయుము. మా పాపలన్నిటిని నీ సన్నిధిలో ఒప్పుకొంటున్నాము, దయతో నీ పరిశుద్ధత ద్వారా మా పాపములను కడిగి మమ్మును పరిశుద్ధపరచుము. నీ మహా కృప ద్వారా మా శ్రమలన్నిటిని జయించుటకును తద్వారా మాకు జయ జీవితము నిచ్చి ఆశీర్వదించి, మమ్మును నీ బిడ్డలనుగా స్వీకరించుము. కృప వెంబడి కృపను మేము పొందునట్లును, తద్వారా నీవనుగ్రహించు నిత్యజీవమునకు వారసులగునట్లుగా మాకు సహాయము చేయుము, మేము అనుభవించున్న మా శ్రమలన్నిటిని తొలగించి, నీ దయను మరియు కృపను మాపై కుమ్మరించుమని కృపామయుడవైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000