Loading...
Evangeline Paul Dhinakaran

మీరు బ్రదుకునట్లు మీలోనికి జీవాత్మను పంపించే దేవుడు!

Sis. Evangeline Paul Dhinakaran
20 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు బ్రతుకునట్లుగా మీలోనికి మన దేవుడు తన యొక్క జీవాత్మను అనుగ్రహించుచున్నాడు. ఎందుకంటే, మిమ్మల్ని ప్రేమిస్తున్న మరియు మీ కోసం శ్రద్ధ వహించే దేవుడు మీ పక్షమున ఉన్నాడు కనుకనే, మీరు దేనికిని భయపడకండి. ఆకాశమును మరియు భూమిని మరియు వాటిలో ఉన్న సమస్త విశ్వమును సృష్టించిన ఆయనకు అసాధ్యమైనదేదీయు లేదు. కాబట్టి, సృష్టికర్తయైన దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు బండ నుండి మధురమైన నీటిని రప్పించాడు మరియు పరలోకము నుండి మన్నాను వర్షం వలె కురిపించాడు. అందువల్లన,ఈ రోజు మీ పరిస్థితిలో అద్భుతమైన  మహాబివృద్ధిని కనుగొనడానికి దేవుని అత్యంతమైన శక్తిని వెదకండి. మనుష్యులమైన మనకు దేవుడే జీవమును, ఆత్మను అనుగ్రహించుటకు శక్తిమంతుడై యున్నాడు.
 
సహోదరులు సెల్వరాజ్ అను సహోదరుడు, ‘ యేసు పిలుచుచున్నాడు ’ పరిచర్యలో సందేశములను అనుసరించి, వివిధ శిక్షణ తరగతులను నిర్వహించుచు, ఎంతో సహకరించేవారు ఆయన జీవితములో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సాక్ష్యమును ఆయన ఎల్లప్పుడు చెప్తుండేవారు. ‘‘ సహోదరులు సెల్వరాజ్‌గారు పుట్టిన వెంటనే వైద్యులు ఆయన మరణించాడని తెలియజేసి, దేహమును మార్చురీకు పంపించమని చెప్పారంటా. అయితే, ఆయన తల్లి ఎంతో భక్తిపరురాలు. ‘‘ బిడ్డ చనిపోయింది ’’ అని విని, ఆమె ఎంతో దుఃఖముతో ఆ ఆసుపత్రి యొక్క ప్రధాన డాక్టర్ వద్దకు వెళ్లి, ఏ విధంగానైనా తన బిడ్డను బ్రతికించమని ఏడ్చారంట. ఆ వైద్యుడు కూడ ఆమె కన్నీటిని చూసి, ఆమెను ఓదార్చుటకు మరణించినదని చెప్పబడిన ఆ బిడ్డను ముక్కులో ఊది, అటు ఇటు కదిలించి చూశారంట. అప్పుడు ఎవ్వరు నమ్మలేని ఒక అద్భుతం జరిగింది. చలనం లేకుండా ఉన్న ఆ బిడ్డలో జీవం కలిగింది. అది దేవుడు చేసిన అద్భుతము అని చెప్పి ఆ తల్లి దేవుని స్తుతించింది.  ఆ తరువాత, ఆయన పెరిగి 60 సంవత్సరములు వరకు పరిచర్య చేసి, 1994వ సంవత్సరములో ప్రభువునందు నిద్రించారు. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, ఒక వైద్యుడు చనిపోయిన శిశువును తన జీవ శ్వాసను ఊది, తిరిగి ఆ బిడ్డను బ్రతికించగలిగితే, ఈనాడు దేవుడు మీ ఆరోగ్యం, ఆలోచనలు, సంబంధం, ఆర్థికానికి తిరిగి పునరుజ్జీవింజేయగల సమర్థుడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో నిర్జీవమైన సమస్యలేవైనను సరే, దేవుని చేతులలోనికి మిమ్మల్ని మీరు సమర్పించుకొనండి. అప్పుడు ఆయన ఏమి చేస్తాడో చూడండి. ఎండిన ఎముకలతో సర్వశక్తిగల ప్రభువు ఇలా అంటాడు, ‘‘ ఈ యెముకలకు చూచి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు బ్రదుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను; చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను; మీలో జీవాత్మనుంచగా మీరు బ్రదుకుదురు; అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు ’’ (యెహెజ్కేలు 37: 5,6) అని సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుడు సెలవిచ్చినట్లుగానే, ఈ రోజు, దేవుడు తన జీవాన్ని మీ మృతమైన పరిస్థితిలోనికి మరియు శరీరములోనికి ఊది, భూదిగంతముల నుండి అద్భుతాలను జరిగిస్తాడు. మీరు నూతన మనస్సు, నూతన శరీరం మరియు నూతన జీవితముతో నూతన పరచబడతారు. బైబిలు ఇలా చెబుతోంది, ‘‘ నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు’’ (కీర్తనలు 104:30). అవును, దేవుని ఆత్మ మిమ్మల్ని నింపినప్పుడు, మీరు నూతనంగాను మరియు సేదదీర్చబడుదురు.
 
నా ప్రియులారా, దేవుడే మనుష్యులకు జీవమును శ్వాసను అనుగ్రహించువాడై యున్నాడు. దానితో పాటు సమస్తమును ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు. మనము నాశనమై పోకుండా శాశ్వతముగా ఆయనతో సంతోషముగాను, సజీవముగాను జీవించవలెనని సర్వశక్తిమంతుడైన మన పరమ తండ్రి తన ఆద్వితీయ కుమారుని మనకు వరముగాను రుూవునుగాను అనుగ్రహించాడు. పాపము చేయకుండునట్లు మనలను నియంత్రించు శక్తి ద్వారా ఆయన మనలను జీవముతో కాపాడుచున్నాడు. జీవమును అనుగ్రహించు పరిశుద్ధాత్మను ప్రభువైన యేసు మనలోనికి పంపించుచున్నాడు. కాబట్టి, మీ మరణకరమైన వ్యాధులచేత, డాక్టర్లచేత చేయి విడువబడిన స్థితిలో ఉన్నారా? భయపడకండి, దేవుడు మీరు బ్రతుకునట్లుగా, తన యొక్క జీవాన్ని మీలోనికి ఊది మిమ్మల్ని సజీవంగా బ్రతికించి పరవశింపజేస్తాడు.
Prayer:
సజీవముగల సర్వశక్తిమంతుడవైన మా పరలోకపు తండ్రీ,
 
ప్రియమైన ప్రభువా, మేము నిరీక్షణ అను అంచున నిలబడి ఉన్నాము. ఈ సమస్యల నుండి బయటకు రావడానికి మార్గం మాకు కనిపించలేదు. నీవు ఎండిన యెముకలను బ్రతికింపజేసే అద్భుతమైన దేవుడవని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీకు అసాధ్యమైనదేదీయు లేదు. దేవా, మేము నీ నామమును ఉచ్చరించిన తోడనే, మా మొఱ్ఱను విని, మేము బ్రతుకునట్లుగా మా మృతమైన  శరీరమును, ఎముకలను, పరిస్థితులను, చెదరిపోయిన సంబంధాలను మరియు చనిపోయిన అవయవాలలో నీ జీవాన్ని మాలోనికి  పంపించుము. మేము అన్ని విషయాలలోను మరల బ్రతుకునట్లుగా, మా జీవితాలను నీ ఆధీనములోనికి తీసుకొనుము. మృతమైన మాలోను మరియు మాకున్న సమస్తాన్ని నీ జీవాత్మ ద్వారా నూతన సృష్టిగా మార్చి, పునరుజ్జీవింపజేయుమని యేసుక్రీస్తు జీవమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000