Loading...
Paul Dhinakaran

చెప్పశక్యముకాని ఆనందం!

Dr. Paul Dhinakaran
13 Sep
నా ప్రియ స్నేహితులారా, దేవుని ఆనందమే మీ బలం అని ఆయన మీకు గుర్తు చేయాలనుకుంటున్నాడు. అవును, నేటి దేవుని వాక్యం కూడ దానినే మీకు తెలియజేయుచున్నది. బైబిల్ నుండి, నెహెమ్యా 8:10 వ వచనము ఎన్నుకొనబడినది. " యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. '' కాబట్టి, నెహెమ్యా ఇలా తెలియజేశాడు, " మరియు అతడు వారితో నిట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయ నగా, ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. '' ఈ రోజు మన ప్రభువుకు పరిశుద్ధమైనది. కాబట్టి, దుఃఖించవద్దు, ఎందుకంటే, " యెహోవా ఆనందమే మీ బలం. '' ఈ వచనం ఎప్పుడు వ్రాయబడిందో మీకు తెలుసా? ప్రజలు తమ చెడు మార్గాలను గురించి పశ్చాత్తాపపడి, దేవుని వైపు తిరిగి చూసినప్పుడు నెహెమ్యా దీనిని పేర్కొన్నాడు.

అతను ఇలా అన్నాడు, ' మీరు మీ పాపముల నిమిత్తము దేవుని యెదుట పశ్చాత్తాపపడి దుఃఖించారు. దేవుడు మీ కన్నీళ్లను చూశాడు. ఆయన మీ పశ్చాత్తాపమును చూశాడు. కనుకనే, మీరు దేవుని ఆనందాన్ని పొందుకొనండి అని చెప్పాడు. ' కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఇక ఏడవకూడదు. ఆలాగున జనులందరిని ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి.' ' నా దేవుడు నా పాపాలను క్షమించాడు ' అని ఆనందించవలసిన సమయం ఇది. మీరు ఇకపై దోషిగా ఉండవలసిన అవసరం లేదు. బైబిల్ చెబుతుంది, ' మీరు నిజంగా పశ్చాత్తాపపడి, మీ దుర్మార్గపు మార్గాల నుండి తొలగిపోయినప్పుడు, ప్రభువు క్షమించడంలో నమ్మకంగా ఉంటాడు. ' అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి ఒకసారి నేడు ఈ సందేశము చదువుచున్న మీరు పశ్చాత్తాపపడినట్లయితే, యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని ప్రతి పాపము నుండి శుద్ధి చేసినదని నమ్మండి మరియు ఆనందించండి. అవును, ఆనందించండి. ఆనందంతో గంతులు వేయండి.
నాటకాల్లో నటిస్తున్న ఒక వ్యక్తి ఉండేవాడు. దేవుడు లేడని అతను నిర్ధారణకు వచ్చాడు. కాబట్టి అతడే తన నాటకాలకు రచనలు వ్రాయడం ప్రారంభించాడు. అతను తన నాటకాలను నిర్వహించిన నేపథ్యం మీకు తెలుసా? " దేవుడు లేడు '' అని అది చెబుతుంది. కానీ, అప్పుడు అతను దీన పరిస్థితిలో పడిపోయెను. అంతమాత్రమే కాదు, అతడు తన శాంతిని కోల్పోయాడు మరియు అతను శాంతి కోసం వెదకుచుండెను. ఒకరోజు అతను ఒక చర్చి నిండుగా గొప్ప జనసమూహమును చూశాడు. చర్చి లోపల ఎవరో బోధించడం అతను చూశాడు మరియు ఆ చర్చి అంతయు ప్రజలతో నిండిపోయినది. అందుచేత, అతను ఆ గొప్ప జనసమూహము మధ్యలో నుండి వెళ్లి, బోధకుడు ఏమి బోధించుచున్నాడో కిటికీలో నుండి చూశాడు. అతను యేసు గురించి విన్నందుకు చాలా ఆనందించాడు, ఈ వ్యక్తి బోధిస్తూ, నేను దేవుని వాగ్దానమును పొందబోతున్నాను మరియు నేను యేసును ఎక్కువగా విమర్శించగలను అని తలంచాడు. అయితే, అదే సమయంలో, బోధకుడు తనకు తెలియకుండానే అతని వైపు చూసి, " యువకుడా, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాడు. '' అప్పుడు దేవుని ఆనందం అతని హృదయాన్ని నింపుతుందని అతను భావించిన క్షణం మరియు అతని కోపం అంతా అతనిని విడిచిపెట్టి పోయినది. అతను నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. యేసు ప్రభువు యొక్క జీవానందం తన హృదయంలో నింపబడినది. వెంటనే ఆ వ్యక్తి, ' నేను నిన్ను నూతన వ్యక్తిగా చేశాను అని చెప్పాడు. ' కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు యేసును అంగీకరించినప్పుడు, ఆయన మిమ్మల్ని తన విలువైన రక్తంతో కడిగి పరిశుద్ధపరచి నూతన వ్యక్తిగా చేసి, ఆయన ఆనందంతో నింపి, మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
పరిశుద్ధుడవైన మా ప్రేమగల తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, ఇప్పుడు నీకు మా హృదయాన్ని సమర్పించుకొనుచున్నాము. దేవా, మా హృదయంలోనికి వచ్చి నీ ఆనందంతో మమ్మల్ని నింపుము. యేసయ్యా, నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి, హిమము వలె మమ్మల్ని తెల్లగా మార్చుము. దేవా, నీవు పవిత్రమైన రక్తముతో మమ్మల్ని కడిగి నూతన వ్యక్తిగా మమ్మల్ని మార్చి, నీ నామ మహిమ కొరకు మమ్మల్ని వాడుకొనుము. ప్రభువా, మా జీవితములో ఉన్న దుఃఖాన్ని తొలగించి, నీ ఆనందముతో నింపుము. మా పాపములను మరియు మా దోషములను క్షమించి, మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చుము. బలహీనులమైన మమ్మల్ని నీ బలమును పొందుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000