Loading...
Dr. Paul Dhinakaran

చెప్పనశక్యముకాని గొప్ప వరము!

Dr. Paul Dhinakaran
01 Dec
నా ప్రియమైన స్నేహితులారా, ఈ నూతన మాసములో ప్రవేశించిన మీతో మాట్లాడుటకు ఎంతో ఆనందించుచున్నాను. మీకందరికి ఈ నూతన మాసములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈ రోజు వాగ్దానం యెషయా 9:6 నుండి ఎన్నుకోబడినది, " ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను...'' ఇంకను బైబిలు ఇలా చెబుతోంది, " కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే యౌవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములవంటివారు '' (కీర్తన 127:3,4) అన్న వచనముల ప్రకారము ప్రభువు మిమ్మల్ని దైవిక స్వభావంతో ఆశీర్వదిస్తాడు. దేవుడు మీకు అనుగ్రహించుచున్న ఆశీర్వాదం ఈ నూతన మాసములో ఇదియే.

నా ప్రియులారా,ఈ వచనములో, ' మనకు శిశువు పుట్టెను ' అని వ్రాయబడింది. ' మనకు ఒక బిడ్డ ఇవ్వబడింది' అని కూడా మనము చదవుచున్నాము. ఆయన శిశువుగా పుట్టినందున, మనము కూడ ఆయనవలె మారాలి. అందుకే లేఖనములో, " మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను '' (మత్తయి 18:3) అన్న వచనము ప్రకారము యేసు ఈ మాటలు చెప్పుచున్నాడు, కాబట్టి, మనకు ఒక శిశువు పుట్టాలంటే, మనం మార్పునొంది చిన్నబిడ్డల వలె మారాలి. మీరు దేవుని బిడ్డలుగా మార్పునొందాలంటే, మీరు పరిశుద్ధంగా జీవించాలి. అవును, " మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, '' (1 కొరింథీయులకు 6:19) అని లేఖనము సెలవిచ్చుచున్నది. బైబిల్‌లో, " తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను '' (యోహాను 1:12) అన్న వచనము ప్రకారము మీరు ఎప్పుడైతే, దేవుని అంగీకరిస్తారో, అప్పుడు మీరు దేవుని పిల్లలవుతారు.
నా ప్రియులారా, ఈ రోజు, ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని బిడ్డగా ఎలా అవుతారు? అని చూచినట్లయితే, యేసు మీ హృదయంలో జన్మించినప్పుడు మీరు దేవుని పిల్లలుగా మార్చబడెదరు. యేసు క్రీస్తు ఒక శిశువుగా మన కొరకు ఒక వరముగా ఇవ్వబడ్డాడు. కాబట్టి, ఆయన మీ హృదయంలో ఒక శిశువుగా జన్మించాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేయుచున్నది. నేడు ఈ సందేశము చదువుచున్న మీ హృదయంలో ఆయనను అంగీకరించడానికి మీ పాపాలకు పశ్చాత్తాప పడుచున్నట్లుగా ఒక చిన్న బిడ్డగా మీరు మారవలెను. అందువలన, మనము చిన్నబిడ్డలుగా, యేసు మచ్చలేని, పవిత్రమైన బిడ్డగా, ఆయన మనతో కలిసి జీవించినప్పుడు మనము పవిత్రమైనవారలముగా జీవిస్తాము. " అటువలె ప్రభువుతో కలిసికొనువాడు ఆయనతో ఏకాత్మయై యున్నాడు '' (1 కొరింథీయులకు 6:17) అన్న వచనము ప్రకారము కాబట్టి, ఈ రోజు మీరు చిన్నబిడ్డలుగా యెహోవా ఎదుట మిమ్మల్ని మీరే సమర్పించుకున్నట్లయితే, ఆయన కూడా ఒక చిన్నబిడ్డలాగా మీ యొద్దకు వస్తాడు. మీరు మరియు ఆయన ప్రభువుతో కలిసి ఏకాత్మయై యుంటారు. మీరు ప్రభువును ఏది అడిగినా, అది పొందుకుంటారు. ఎందుకంటే, మీరు యేసుతో ఒకటిగా మార్చబడెదరు. మీరు ఆయనను మీ హృదయంలోకి అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు మీ కోసం ఒక కుమారుడిగా ఇవ్వబడ్డాడు. ఆయన మీకు ఒక బహుమతిగా ఇవ్వబడుటయే కాకుండా మరియు మీకు యేసుక్రీస్తులో అధికారమును కలిగియుంటారు. తద్వారా, ఈ లోకములో ఏదీయు మిమ్మల్ని తాకదు. కాబట్టి, ధైర్యముగా ఉండండి. దేవుడు ఈ నూతన మాసమంతయు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

దేవా, నీవు మమ్మల్ని నీ బిడ్డలుగా ఎన్నుకున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నీ కుమారుని మా కొరకు ఒక శిశువుగా ఈ లోకానికి పంపించినందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. యేసయ్యా, నీవు మాలో వచ్చి జన్మించుటకై మమ్మల్ని మేము నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. మేము నేడు మా పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి, చిన్న బిడ్డవలె మార్పు పొంది నీలో జీవించే గొప్ప ధన్యతను మాకు దయచేయుము. యేసయ్యా, నీవు మమ్మల్ని నీ స్వరూపములోనికి మార్చుమని వేడుకొనుచున్నాము.ఈ రోజు వాగ్దానం ప్రకారం మమ్మల్ని ఆశీర్వదించి, మా హృదయంలో జన్మించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000