Loading...

నిత్యము మిమ్మల్ని బలపరచే దేవుని బాహుబలము!

Shilpa Dhinakaran
13 Jun
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుని బాహుబలము బలపరచాలని మీ పట్ల ఆయన కోరుచున్నాడు. ప్రజలు పనులలో అభాస్యము చేయడం మీరు చూశారా? వారు సాధారణంగా శరీర బలాన్ని పొందడానికి అభ్యాసము చేస్తున్నారు. వారు పొందుకున్న బలం వారు సాధారణంగా వారి చేతి కండరాలను చూపిస్తారు. అవును, చేతులు దాని యొక్క బలమును సూచిస్తుంది. మీకు బలం ఉంటేనే మీరు పనులను చేయగలరు మరియు మీరు అనుదినము పనులను సులభంగా చేయుటకు బలమును కలిగియుంటారు. వెయిట్ లిఫ్టింగ్ (బరువును ఎత్తడం) మోయుచున్న వ్యక్తులు చేతుల ద్వారా భారీ బరువులు ఎత్తుకొన వచ్చును. మీకు దేవుని బలం ఉంటే? మీరు సాహస కార్యము చేస్తారని బైబిల్ ఇలా చెబుతోంది, " యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును '' (కీర్తనలు 118:16) అన్న వచనము ప్రకారము దేవుని దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. దేవుని హస్తం మనకు ఎప్పుడూ విజయాన్ని చేకూరుస్తుంది. దేవుని దక్షిణ హస్తము ఇది విజయానికి సంకేతం. ఇది అద్భుతమైనది, మీ పట్ల సాహస కార్యములను జరిగిస్తుంది. మరియు మంచి కార్యములను మాత్రమే చేస్తుంది. ' ఆయన ఈ లోకాన్నంతటిని తన హస్తములలోనికి స్వాధీనము చేసుకొనియున్నాడు ' అన్న పాటను మీరు విన్నారా? అది వాస్తవంగా దేవుని శక్తి యొక్క మాత్రమే.

85 సంవత్సరాల వయసున్న మా అమ్మమ్మ స్వయంగా నడవగలదు. అయినప్పటికీ, ఎవరైనా ఆమె పక్కన నడిచినప్పుడు ఆమె తనకు భద్రత మరియు నమ్మకము కలిగియుండుట మాత్రమే కాదు, ఆమె మరొకరి చేయిని పట్టుకొని నడుస్తున్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె ఎవరి చేతినైన పట్టుకున్నప్పుడు పడిపోతాననే భయము విడిచి, ధైర్యంగా ఉంటుంది. ఈవిధంగానే, మన చేతులు మరొకరికి బలమునిచ్చుటకు సహాయపడగలవు. ఆలాగుననే, చిన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల చేతులలో ఉన్నంతవరకు వారు సురక్షితంగా ఉన్నట్లుగా భావిస్తారు. మీరు పిల్లలను మరొకరి చేతికి అప్పగించిన మరుక్షణం వారు ఏడ్చుటకు ప్రారంభిస్తారు. ఎందుకంటే, వారు తల్లిదండ్రుల స్పర్శకు మరియు ఇతరుల స్పర్శకు తేడాను గుర్తిస్తారు. వారిని తల్లిదండ్రుల ఎత్తుకున్నప్పుడు వారి చేతులు వారికి ఆదరణను మరియు నమ్మకాన్ని కలిగిస్తాయి మరియు తద్వారా వారికి ఆనందము కలుగుతుంది. తల్లిదండ్రుల చేతులలో పిల్లలు ఉన్నప్పుడు వారు తమను తామే మరచి ఆనందిస్తారు. పిల్లలను తల్లిదండ్రుల చేతులలోనికి తీసుకోవడం వలన వారికి భద్రతను మరియు శ్రద్ధను తల్లిదండ్రులే కల్పిస్తారు. ఆలాగుననే, మన పరలోకపు తండ్రి కూడా ఈలోకమంతటిని, ముఖ్యంగా మనలో ప్రతి ఒక్కరిని తన చేతులలోనికి తీసుకొని, మనకు భద్రతను ఇచ్చుట మాత్రమే కాకుండా, మనలను ఆయనే మోస్తాడు.
అవును, నా ప్రియులారా, నేడు మన దేవుడు తన చేతి మీద మిమ్మల్ని భరించుట మాత్రమే కాకుండా మరియు ఆయన చేతి బలంతో మిమ్మలి బలపరస్తానని ఈ రోజు దేవుడు మీకు వాగ్దానం చేయుచున్నాడు. మీకు ఇంతకన్నా ఇతర బలము అవసరమా! మీలో దేవుని బలము శక్తివంతముగా పని చేస్తుంది. అందుకే పౌలు, " నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను '' (ఫిలిప్పీయులకు 4:13) అని చెప్పినట్లుగానే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ ధైర్యంగా చెప్పవచ్చును. పై చెప్పబడిన వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీ బలహీనతలలో దేవుని దయ మీకు చాలినంతగా ఉంటుంది మరియు ఎటువంటి కష్టమైన పరిస్థితులలో కూడ దేవుని బలం మిమ్మల్ని సంపూర్ణులనుగా చేస్తుంది. అందుకే బైబిల్‌లో దేవుడు ఏమంటున్నాడో చూడండి, " చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కి యున్నాను నీ ప్రాకారములు నిత్యము నా యెదుట నున్నవి '' (యెషయా 49:16) అన్న వచనము ప్రకారం ఆయన మిమ్మల్ని తన యరచేతిలో ఉంచుకొనియున్నాడు. అంతమాత్రమే కాదు, మన ప్రాకారములు నిత్యము ఆయన యెదుట ఉన్నవి. కనుకనే, ఆయన ఒక క్షణం మిమ్మల్ని విడువకుండా, ఆయన తన చూపును మీ మీద నుండి తొలగించకుండా, ఎల్లవేళల మీపై తన దృష్టిని నిలిపియున్నాడు. ఈనాటికిని, మనం నశించిపోకుండా ఉండడానికి కారణం అదే. మన చేతిని పట్టుకుని మనకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. అందుకే వాక్యము మనకు ఇలాగున సెలవిచ్చుచున్నది, " దిగులుపడకుము, నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును '' (యెషయా 41:10) అన్న వచనము ప్రకారము ఆయన దక్షిణ హస్తము ఎల్లప్పుడు మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఆయన బలము మీద ఆధారపడుతూ, ఆయనకు సేవ చేయుటకు సిద్ధముగా ఉన్నారా? ఆలాగైతే, దేవుని ద్వారా తప్పకుండా, మీరు గొప్ప కార్యాలను సాధిస్తారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని బలమును పొందుకొనవలెననగా, మీ పూర్ణహృదయముతో ఆయనను వెదకినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీకు సంపూర్ణ బలమును అనుగ్రహించి, తన దక్షిణ హస్తము నిత్యము మీకు తోడుగా ఉండునట్లు చేసి, మీ పట్ల సాహస కార్యములను జరిగిస్తాడు.
Prayer:
సర్వోన్నతుడా, సర్వకృపలకు ఆధారభూతుడవైన మా తండ్రీ,

ఈ లోకములో మేము సమృద్ధికరమైన జీవితమును జీవించుటకు మా బలము సరిపోదు. మమ్మల్ని బలపరచు నీ యందే మేము సమస్తము చేయగలమని విశ్వసించుచున్నాము. ప్రభువా, మమ్మల్ని నీ చేతులలోనికి తీసుకొన్నందుకై మరియు నీ యరచేతిలో చెక్కుకున్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రతి క్షణం నీ దృష్టిని మాపై ఉంచి, మమ్మల్ని సంరక్షిస్తున్నందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, మేము నీ సేవ చేయుటకు నీ బలముపై ఆధారపడుటకు మాకు సహాయము చేయుము. మా యొక్క క్లిష్టమైన పరిస్థితులలోను మరియు అవసరతలలోను నీ దక్షిణ హస్తముతో మాకు సహాయము చేయుము. దేవా, నీ కుడి చేయి ఎడతెగక మాకు తోడై యుండునట్లు కృపను దయచేయుము. నీ దక్షిణ హస్తము మా పట్ల సాహస కార్యములు జరిగించునట్లు మాకు కృపను దయచేయుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000