Loading...
Evangeline Paul Dhinakaran

నేను నా మహిమను వెల్లడిపరచెదను!

Sis. Evangeline Paul Dhinakaran
07 Aug
నా ప్రియులారా, నేడు ప్రభువు మీలో తన మహిమను బయలుపరచాలని మరియు ఈ సందేశము చదువుచున్న మిమ్మును ఆశీర్వదించాలని మీ పట్ల కోరుచున్నాడు. అందుకే నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును చూచి, ‘‘ నీవు నా సేవకుడవు, ఇశ్రాయేలూ, నీలో నేను మహిమపరచబడుదును ’’(యెషయా 49:3) అనే లేఖనం ప్రకారం నేడు ఆయన మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఇది ఎంత ప్రేమపూర్వకమైన వాగ్దానం కదా! నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును ఈ భూమి తీసుకొని వచ్చిన దేవుడు ఆయనే. జగత్తు పునాదికి ముందే ప్రభువు మిమ్మును ఎరుగును. అయితే, ప్రభువు మిమ్మును విడిచిపెట్టాడు? అని మీరు అంటున్నారా? ప్రభువు మిమ్మును ఆశీర్వదించడం మరచిపోయాడని అనుకుంటున్నారా? ప్రియ స్నేహితులారా, నిరుత్సాహపడకండి!

కారణము, మన దేవుడు మరచువాడు కాదని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. చూడండి, ‘‘ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను ’’ (యెషయా 49:15) అని ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీతో చెప్పుచున్నాడు. ఈ లోకములోని ప్రజలు మిమ్మల్ని క్రిందికి త్రోసివేయగలరు. బహుశా! మీరు స్త్రీలు కావడం వలన ప్రతి విషయంలోనూ మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ, తోకగా తలంచుచుండవచ్చును. ఒకవేళ, సమాజం మిమ్మల్ని చిన్నచూపు చూస్తుండవచ్చును. ఇల్లు మరియు కార్యాలయంలో తక్కువగా మిమ్మల్ని అంచనా వేయవచ్చును. కనుకనే, ‘ ప్రభువు నన్ను విడిచిపెట్టాడు, అందరూ నన్ను విడిచిపెట్టారు ’ అని మీరు విలపిస్తున్నారా? ప్రియమైనవారలారా, సంతోషించండి మరియు ఆనందించండి. నేడు ప్రభువు మిమ్మును చూచి, ‘‘ నా బిడ్డ, నీవు నా సొత్తు,  నీ ద్వారా నేను మహిమపరచబడతాను ’’ అని సెలవిచ్చుచున్నాడు. అవును, ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీ పక్షాన నిలుచున్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే, మనకు వ్యతిరేకంగా ఎవరు ఉండగలరు? అని బైబిల్ చెబుతుంది. ‘‘ ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? ’’ (రోమీయులకు 8:31) అని చెప్పబడినది. నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును ఈ లోకానికి పుట్టించిన ప్రభువు మిమ్మును తప్పకుండా మహిమపరుస్తాడు.
నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న జీవితాన్ని గురించి, ‘ కంటి పాపవలె మోయుచున్న ప్రేమ  (కన్న్‌మనీపోల్ సుమకుమ్ నేసం)’ అను తమ తమిళం పుస్తకంను వ్రాసినప్పుడు, దేవుడు నా పట్ల ఎంతగానో తన ప్రేమను వెల్లడిపరచాడు. ఆయన నా జీవితాన్ని ఎంతగా జాగ్రత్త వహించాడో నేను దానిని గ్రహించాను. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ ప్రభువు వలన మాత్రమే. అలాగే, నా ప్రియులారా, ప్రభువు తన శాశ్వతమైన కృపతో మిమ్మల్ని ఆదరిస్తాడు మరియు మీలో మరియు మీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరుస్తాడు. దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
ప్రేమామయుడవైన మా పరలోకమందున్న తండ్రీ,

ప్రభువైన యేసు, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, తల్లి గర్భములోనే మేము రూపింపబడకమునుపే నీవు మమ్మును ఏర్పరచుకున్నందుకై నీకు వందనాలు. దేవా, నీవు ఎల్లప్పుడు మమ్మును మరచిపోకుండా నీవు జ్ఞాపకములో ఉంచుకున్నందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈరోజు మమ్మును జ్ఞాపకము చేసుకొని, ఆశీర్వదించుము. ప్రభువా, నీ ద్వారా సమస్తము సాధ్యమవుతాయని మేము నమ్ముచున్నాము. దేవా, మా జీవితంలో అద్భుతాలు జరుగునట్లు చేయుము. ప్రభువా, దయచేసి మా జీవితంలోనికి వచ్చి మమ్మును అభివృద్ధిపరచుము. దేవా, మాకు విరోధముగా లేచు వారు సిగ్గుపడునట్లు చేసి, మమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించుము. తండ్రీ, నీవు మా కొరకు పోరాడి మాకు విజయం అనుగ్రహిస్తావని మేము నమ్ముతున్నాము. ప్రభువా, మేము చేయు ప్రతి కార్యములోను, పనిలోను మరియు కుటుంబంలోను విజయవంతం కావడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, ఇక నుండి మా జీవితంలో మార్పు చూచునట్లు చేయుము. అదియుగాక, నీ మహిమ మాపై ఉండునట్లు చేయుము. మా ద్వారా నీ మహిమను బయలుపరచుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000