Loading...
Stella dhinakaran

పరిపూర్ణమైన వ్యక్తిగా ఎలా ఉండాలి!

Sis. Stella Dhinakaran
11 Aug

నా అమూల్యమైన స్నేహితులారా, మన ప్రభువును మరియు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నేను మీకు వందనములు తెలియజేయుచున్నాను. ఈ రోజు మీ ఆశీర్వాదం కోసం మనము వాగ్దానముగా, కీర్తనలు 37:40వ వచనమును గురించి ధ్యానించబోతు న్నాము. ఆ వచనము ఇలాగున చెబుతుంది, " యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును వారు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. '' ఇది ఎంతటి అద్భుతమైన వాగ్దానం! దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు? " నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు '' (కీర్తనలు 37:37)లో పేర్కొన్నట్లుగా, పరిపూర్ణమైన (అంటే, నిందలేని) మరియు యథార్థతగా ఉండే వ్యక్తి. అలాగే, " యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము '' (కీర్తనలు 37:39)లో నీతిమంతులకు రక్షణ యెహోవా వలన కలుగును; కష్టకాలంలో ఆయనే వారికి ఆశ్రయముగా ఉంటాడని వాక్యము స్పష్టంగా సెలవిచ్చుచున్నది. కాబట్టి, నా ప్రియ స్నేహితులారా, మనం మొదట దేవుని ముందు పరిపూర్ణులుగా మరియు నిర్దోషులుగా జీవించాలి. అందుకే బైబిల్‌లో, " నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై యుండవలెను '' (ద్వితీయోపదేశకాండము 18:13) అన్న వచనము ప్రకారం నేడు ఈ సందేశము చదువుచున్న మీ దేవుడైన యెహోవా ఎదుట మీరు యథార్థపరులుగా ఉండాలి అని చెబుతుంది. కాబట్టి, ఆలాగున ఉండుటకు మిమ్మును మీరు నేడు ఆయత్తపరచుకోండి. మీ హృదయాలను దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, మీ సహాయానికి ఆయన ఆశ్రయముగా ఉండుటకు మీ యొద్దకు వస్తాడు.

నా ప్రియులారా, మనము నీతిమంతులుగా మారడం ఎలా? సిలువపై మన కొరకు చిందించబడిన యేసుక్రీస్తు రక్తముతో మనము కడుగబడినప్పుడు, మనము నీతిమంతులుగాను/యథార్థవంతులముగాను మార్చబడగలము. అవును, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును పవిత్రంగా మరియు నిర్దోషిగా చేయడానికి ప్రభువు తన ప్రాణమును సిలువపై త్యాగ బలిగా ఇచ్చాడు. ప్రియమైన సోదరుడా/సోదరీ, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ రోజు యథార్థమైన మార్గంలో నడుచుకొనుచున్నారా? ఆలాగున నడుచుకొనలేకపోయినట్లయితే, మొదట యేసు ప్రభువు మీ కోసం తనను తాను త్యాగం చేసిన సిలువ వైపు చూడండి. లేకపోతే యథార్థమైన జీవితాన్ని గడపడం చాలా కఠినమైన కార్యము. సిలువపై, యేసుప్రభువు తన తల నుండి అరికాళ్ళ వరకు గాయపరచబడ్డాడు. తద్వారా, ఆయన నేడు ఈ సందేశము చదువుచున్న మీ కోసం ఎంత బాధను మరియు వేదనను అనుభవించాడో కదా! కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీరు మీ హృదయాన్ని తెరిచి, ఈ ప్రేమగల ప్రభువును మీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తారా? యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు పవిత్రులుగా మార్చబడతారు.

లేఖనాలో మనం నీతిమంతుడైన యోబును గురించి చదువుతాం. అతడు దైవభక్తి కలిగిన వ్యక్తి అయినప్పటికీ ఎన్నో నష్టాలు, బాధలు అనుభవించవలసి వచ్చినది. ఇంకను అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడై ఉన్నందున, అతను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నిటిని అధిగమించడానికి దేవుడు అతనికి సహాయం చేశాడు. చివరికి తనకు వచ్చిన శోధనలన్నిటిని జయించి ధన్యుడయ్యాడు. అదేవిధంగా, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడా పరిపూర్ణమైన వ్యక్తులుగా మార్చబడినప్పుడు దేవుని కటాక్షమును సమృద్ధిగా మీరు పొందగలరు. ప్రియమైన సోదరీ/సోదరుడా, ఎల్లప్పుడూ దేవుని సహాయం మరియు ఆశీర్వాదాలను పొందడానికి ఆయన వైపు చూడాలని గుర్తుంచుకోండి. అలాగున నేడు ఈ సందేశము చదువుచున్న మీరు చేసినట్లయితే, నిశ్చయముగా, యెహోవా మీకు సహాయకుడై ఉండి మిమ్మును రక్షించును. నేడు మీరు యెహోవా శరణుజొచ్చి యున్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి మిమ్మును విడిపించి రక్షించును. కాబట్టి, ధైర్యంగా ఉండండి. ఇదేవిధముగా, దేవుడు మిమ్మును దీవించును గాక.

Prayer:

మాకు కోటగా, ఆశ్రయముగా ఉన్న మా పరలోకమందున్న ప్రియ తండ్రీ,

నీ నామము మా జీవితములో హెచ్చింపబడుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ ఆశీర్వాదాలను పొందేందుకు నీవు మా కొరకు సిలువపై తెరిచిన మార్గాన్ని బట్టి మేము నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, మా పాపాల కోసం నీవు సిలువపై శ్రమపడి, మా పాపాలు మరియు బాధలను అంతం చేయడానికి నీవు సిలువ వేయబడి మరియు నలుగగొట్టబడినందుకై నీకు వందనాలు. ప్రభువా, మేము ఇప్పుడు నీ సిలువ వైపు చూస్తున్నాము. యేసయ్యా, పాపులముగా ఉన్న మమ్ములను నీ రక్తము ద్వారా కడిగి పవిత్రులనుగాను మరియు నిరాపరాధులనుగా మార్చి, మా పాపాలను క్షమించుము. దేవా, నీ అమూల్యమైన రక్తంతో మమ్మును కడిగి, నీ బిడ్డగా చేసుకొని నీ యెదుట మమ్మును యథార్థవంతులనుగాను, నిర్దోషులనుగాను, పవిత్రులనుగాను జీవించులాగున చేయుము. ప్రభువా, నీ దీవెనలు మా జీవితంలో సమృద్ధిగా ఉండునట్లుగా మమ్మును ఆశీర్వదించుమని యేసుక్రీస్తు పవిత్రమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000