Loading...
Evangeline Paul Dhinakaran

మీకు ఘనత మరియు ఉన్నతస్థానమిచ్చే దేవుడు!

Sis. Evangeline Paul Dhinakaran
24 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు ఘనపరచాలని మీ పట్ల కోరుచున్నాడు. ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎంతో దీన స్థితిలో ఉన్నట్లుగా తలంచినట్లయితే, ఆయన మిమ్మల్ని తలగా ఉంచుతానని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:13 నుండి దేవుడు మీ కోసం అద్భుతమైన వాగ్దానంను చేయుచున్నాడు. ఆ లేఖన వచనమేమనగా, " యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు '' అన్న వచనము ప్రకారము ఈ రోజు నుండి ఆయన ఎల్లప్పుడు మిమ్మల్ని తలగా ఉంచుతాడు. మీరు తలగా ఉండాలంటే, ఏమి చేయాలో చూడండి, " నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికి గాని యెడమకుగాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు '' అని నేడు యెహోవా దేవుడు మిమ్మల్ని చూచి సెలవిచ్చుచున్నాడు. పాతనిబంధన కాలంలో, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎన్నో కష్టాలను అనుభవించినప్పుడు, యెహోవా వారిని విడిపించి బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చాడు మరియు ప్రభువు వారి తలలను పైకి ఎత్తునట్లు ఐగుప్తు బానిసత్వము నుండి బయటికి వచ్చేలా చేశాడు.

బైబిల్‌లో చూచినట్లయితే, లేవీయకాండము 26:13 వ వచనములో మనం ఇలా చదువుచున్నాము. ఆ వాక్యమేమనగా, " మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములో నుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని '' అని సెలవిచ్చుచున్నాడు. మనం ఈ దుష్ట ప్రపంచంలో ఉన్నందున, మనం కూడా ఇదే మార్గంలో వెళ్ళవచ్చును. ఒకవేళ, ' నేను దుర్మార్గులు ఆధీనంలో ఉన్నాను. నేను పాపానికి బానిసను. నేను నా స్వంత కుటుంబ సభ్యునికి బానిసలాంటివాడిని. నేను నా కార్యాలయంలో బానిసలాంటివాడిని/దానను అని చెప్పవచ్చును. ' కానీ, ఈ రోజు ప్రభువు ఈ సందేశము చదువుచున్న మీతో, " నేను నిన్ను తలగా చేస్తాను, తోక కాదు. నీవు పైవాడవుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు '' అని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎల్లప్పుడు ఉన్నత స్థానములో ఉంటారు మరియు ఎప్పుడు క్రిందివారుగా ఉండరు. కాబట్టి, ధైర్యంగా ఉండండి.
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీకు దత్తపుత్రాత్మను అనుగ్రహిస్తున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము '' (రోమీయులకు 8:15) అన్న వచనము ప్రకారము మీరు పొందుకున్న ఆత్మ మిమ్మల్ని బానిసలుగా చేయదు, తద్వారా మీరు మరల భయంతో జీవించరు. అందుకు బదులుగా, మీరు పొందుకున్న ఆత్మ ద్వారా దత్తపుత్రాత్మను కలిగియున్నారు మరియు ఆ ఆత్మ ద్వారా మనము దేవునికి అబ్బా, తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము. ఆయన తన ఆత్మ ద్వారా దేవుడు మనలను తన సొంత పిల్లలనుగా చేయుచున్నాడు. ఆయన తన విలువైన రక్తం ద్వారా మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై యున్నారు. కాబట్టి, మీరు దేనిని నిమిత్తము భయపడకండి. బైబిల్‌లో చూచినట్లయితే, ఎఫెసీయులకు 2:19 వ వచనములో అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు, " కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు '' అన్న వచనము ప్రకారము ఒకవేళ నేడు, ' నా కుటుంబంలో నేను చాలా చిన్నవాడను/దానను. నేను నా కార్యాలయంలో పరజనులునుగా ఉన్నాను '' అని తలంచవచ్చును. ఈ రోజు, ప్రభువు తన అభిషేకంతో మిమ్మల్ని నింపుతాడు మరియు మీ భవిష్యత్తును గురించిన భయాన్ని మీ నుండి తొలగిస్తాడు. అంతేకాదు, దేవుడు అన్నిటిమీద మిమ్మల్ని అధిపతిగా చేసి, ఈ లోకములో మిమ్మల్ని ఉన్నత స్థానాల్లో ఉంచుతాడు. ప్రభువు మిమ్మల్ని అనేక విషయాలకు అధిపతిగా చేస్తాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు తలగా ఉండాలంటే, మీరు దేవుని మార్గములను అనుసరించి నడుచుకొనవలెనని నేడు ఆయన మీకాజ్ఞాపించుచున్న మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల, యెహోవా మిమ్మల్ని తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. మీరు పైవారుగా ఉందురుగాని క్రిందివారుగా ఉండరు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.
Prayer:
ప్రేమకు పాత్రుడవైన మా పరమ తండ్రీ,
                  
నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. మేము మా కార్యాలయంలో మమ్మల్ని బానిసలా చూస్తున్నారు. మేము మా సొంత కుటుంబంలో పరజనులా భావిస్తున్నారు. ప్రభువా, మా పరిస్థితిని తలక్రిందులుగా మార్చుము. ప్రభువా, నీవు మా జీవితములో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుము. మరియు మేము తోకగా కాకుండా మమ్మల్ని తలగా మార్చుము. మాకు మంచి మనస్సు దయచేయుము. మా జీవితంలో ఉన్న నుండి భయాన్ని తొలగించుము. మేము చేసే పనులన్నింటిలో ఘనతను మాకు దయచేయుము. దేవా, ఈ దుష్టలోకములో మమ్మల్ని నీ అభిషేకంతో నింపి, ఆశీర్వదించుము. సమస్త కీడు చెడు అలవాట్లు మేము వదిలిపెట్టునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. మేము పొందుకున్న దత్తపుత్రాత్మ ద్వారా మేము మరల భయపడకుండా, ఉండుటకు మాకు నీ పరిశుద్ధాత్మను దయచేయుము. మా జీవితంలో ఇక పాపం ఉండకుండా, మమ్మల్ని సమస్త బానిసత్వం నుండి విడిపించి, విడిపించి, రాజులైన యాజకసమూహముగా మమ్మల్ని మార్చుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000