Loading...
Paul Dhinakaran

పరలోక మర్మములను మీకు బయలుపరచే దేవుడు!

Dr. Paul Dhinakaran
19 Jan
నా ప్రియులారా, నేడు మన దేవుడు తన ఉద్దేశములను మరియు మర్మములను ఈ సందేశము చదువుచున్న మీకు తెలియజేయాలని మీ పట్ల కోరుచున్నాడు. ఎందుకంటే, ఆయన ప్రేమామయుడై యున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, ‘‘ ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడి యున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు ’’ (1 కొరింథీయులకు 2:9,10) అన్న వచనముల ప్రకారము ప్రియమైనవారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రతిదానిలోనూ అభివృద్ధి చెందాలని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నట్లుగా, ఆయన మీకు మేలు జరిగించకుండా నిరాకరించడు. జ్ఞానం, వివేచన, మనస్సును, శరీరాన్ని స్వస్థపరచడాన్ని, అవగాహన, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, ఐక్యత, అను ఆత్మ ఫలములను మొదలగువాటి యొక్క పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మొదలైన శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; కాబట్టి, మీరు శ్రేష్ఠమైన ప్రతియీవిని మన పరలోకపు తండ్రి యొద్ద అడగండి మరియు పొందుకొనండి.
 
నా స్నేహితులలో ఒక భక్తిపరుడు, ప్రఖ్యాత కంపెనీలో ఉద్యోగము చేయుచున్నాడు. ఒకసారి పశ్చిమ దేశం ఒకటి లక్షల డాలర్ల పెట్టుబడితో ఒక ఖరీదైన ప్రాజెక్టును గూర్చి ప్రకటించింది. ఆ ప్రాజెక్టును సాధించినట్లయితే, అది వారికి లాభకరముగా ఉంటుంది. ఆ కంపెనీ యజమాని ఆ ప్రాజెక్టును ఎలాగైన పొందాలని ఆశించాడు. కానీ, అది ఎలా సాధ్యమో అతనికి తెలియలేదు. అప్పుడు నా స్నేహితుడు ఆయనతో, ‘‘ అయ్యా, మేము ఉపవాసముతో ప్రార్థన చేస్తాము. దేవుడు మాకు ఈ ప్రాజెక్టును ఎలాగైనా పొందాలని ఆశించాడు. కానీ, అది ఎలా సాధ్యమో అతనికి తెలియలేదు. అప్పుడు, నా స్నేహితుడు ఆయనతో, ‘‘ అయ్యా, మేము ఉపవాసముతో ప్రార్థన చేస్తాము. దేవుడు మాకు ఈ ప్రాజెక్టునకు సంబంధించిన కార్యాలను బయల్పరుస్తాడు ’’ అని చెప్పాడు. దేవుని గురించి ఏమీ తెలియని ఆ యజమాని ప్రార్థన చేయమని ప్రోత్సహించారు. వెంటనే నా స్నేహితుడు మరియు మరొక ఇద్దరు యువకులు మోకరించి, ఏకమనస్సుతో ప్రార్థన చేశారు. ప్రభువు వారి ప్రార్థనలను ఆలకించి, దర్శనము ద్వారా ఆ ప్రాజెక్టును ఏ విధంగా అమలు చేయాలో స్పష్టముగా వివరించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారము వారు చేశారు. ఆ ప్రాజెక్టులో విజయమును సాధించారు మరియు వారు ముగ్గురు కంపెనీలో హెచ్చింపబడ్డారు.
నా ప్రియులారా, ఈవిధంగా, ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో విజయమును అనుగ్రహిస్తాడు. ఇతరులు ఎదుట మీరు హెచ్చింపబడుదురు. మీరు ఏ విషయములోనైనను సరే, దేవుని ఆలోచనల ద్వారా నడిపింపబడినట్లయితే, ఆయన ఖచ్చితముగా మిమ్మల్ని సరియైన మార్గములో నడిపిస్తాడు. దానియేలు మరియు అతని స్నేహితులు దేవుని ప్రార్థించుచు, ఆయనను వెదకినందున వారు రాజమందిరములో ఉన్నత స్థానములకు హెచ్చింపబడిరని బైబిల్‌లో మనము చదివియున్నాము. ‘‘ అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు, అంత్యదినముల యందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా ’’ (దానియేలు 2:28) అన్న వచనము ప్రకారము ప్రతి పరిస్థితిని దేవుని జ్ఞానంతో నిర్వహించడానికి వారికి అధికారమును ఇచ్చాడు. దేని నిమిత్తమైననను మీరు ఆయన యొక్క సలహాను అడిగినట్లయితే, నిశ్చయముగా, ఆయన మిమ్మును సరైన నడిపింపు చేత తన జ్ఞానముచేత నడిపిస్తాడు. కాబట్టి, ఆయన సలహాను మరియు నడిపింపును పొందడానికి ప్రతికార్యము నిమిత్తము దానియేలు వలె పట్టుదలతో ప్రార్థించినట్లయితే, మీరు వీటన్నిటిలో అత్యధిక విజయము పొందినవారవుతారు. కాబట్టి, ధైర్యముగా ఉండండి. దేవుని నడిపింపునకు విధేయులుకండి, దీవెనలను పొందండి.
Prayer:
ప్రేమగల మా పరలోకపు తండ్రీ,
 
నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, నీకు వందనములు చెల్లించుచున్నాము. దానియేలు మరియు అతని స్నేహితులు నిన్ను వెదకినప్పుడు నీవు వారిని నీ సన్నిధితో నింపిన ప్రకారము మమ్మల్ని కూడ నీ సన్నిధితో నింపుమని ప్రార్థించుచున్నాము. నీ చిత్త ప్రకారము మేము పని చేయుటకు పరిశుద్ధాత్మో మమ్మల్ని నింపి, నీ యొక్క బుద్ధి జ్ఞానములను మాకు అనుగ్రహించుము. నీవు మనుష్యుల హృదయాన్ని గుర్తెరిగిన దేవుడవు. కాబట్టి, హృదయ రహస్యాలను తెలిసిన నీవు నేడు మేము  ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిలో సరైన నిర్ణయం తీసుకోడానికి మర్మములను బయలుపరచి మరియు మమ్మల్ని నీ యొక్క జ్ఞానంతో నింపుము. శత్రువుల భారీ నుండి మమ్మల్ని మరియు మా కుటుంబాన్ని రక్షించుమని ఈ ప్రార్థనను నీ యొక్క సాటిలేని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000