Loading...
Evangeline Paul Dhinakaran

ప్రభువు మీ యొద్ద నుండి సర్వరోగములను తొలగిస్తాడు!

Sis. Evangeline Paul Dhinakaran
23 Dec
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ జీవితములో ఆత్మీయ అభివృద్ధిని మరియు సంపూర్ణ స్వస్థతను పొందాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను '' (3 యోహాను 2) అన్న వచనము ప్రకారము, మీరు అన్ని విషయములలో వర్థిల్లాలని ప్రభువు మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. కాబట్టి, క్రీస్తుపై విశ్వాసం మరియు అధికారంతో ఉన్న మీరు ఇప్పుడు మీ స్వస్థతను మీరు సొంతం చేసుకొనండి. మీరు ప్రతి అనారోగ్యం నుండి విడుదల పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిలువపై మరణించాడు. అంతేకాక, " ...నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే '' (నిర్గమకాండము 15:26) అని సెలవిచ్చియున్నాడు. మీ ప్రోత్సాహం కోసం, తేని పట్టణములోని అండిపట్టి ప్రాంతమునకు చెందిన సహోదరులు చెల్లదురై, ఇచ్చిన సాక్ష్యం ఇక్కడ మీతో పంచుకొనుచున్నాను.

" నా మూత్రపిండములలో ఏర్పడిన సమస్య కారణముగా అనేక సంవత్సరాలు నేను వేదన అనుభవించాను. ఏ పని చేయలేక చాలా కష్టపడ్డాను. గత సెప్టెంబర్ నెలలో 2018 సంవత్సరములో నేను, ' యేసు పిలుచుచున్నాడు ' టెలివిజన్ కార్యక్రమమును చూస్తున్నప్పుడు, సహోదరి ఇవాంజెలిన్ పాల్ దినకరన్‌గారు దేవుని సందేశమును అందించి, ప్రార్థించారు. ఆనాడు వారు, వ్యాధితో బాధపడుచున్న వారి కొరకు ఎంతో భారముతో ప్రార్థించారు. ప్రత్యేకముగా, మూత్ర పిండముల సమస్యతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థించుచున్నప్పుడు, నేను కూడ వారితో ఏకీభవించాను. అప్పుడు దేవుని శక్తి నా మీదికి దిగివచ్చినది. అనేక దినములుగా ఉన్న ఈ మూత్ర పిండముల వ్యాధి ఆ క్షణమే నా నుండి మాయమైపోయినది. ఇప్పుడు నేను ఆరోగ్యముగా ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక.

అవును, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ జీవితాలలో అద్భుతాన్ని పొందుకోవడానికి ఆవగింజంత విశ్వాసము కలిగియుంటే చాలు అన్న వాక్యము వాస్తవం. కాబట్టి, ఈనాడు మీరు ఆయన యందు విశ్వాసముంచుటకు ధైర్యము వహించండి. ఆయన ఎన్నటికిని మిమ్మల్ని విడిచిపెట్టడు. బైబిలు ఇలా చెబుతోంది, " విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును '' (యాకోబు 5:15). దేవుని వాక్యం సజీవమైనదియు మరియు శక్తివంతమైనదియుగా ఉన్నది. అది గొప్ప ధననిధి, అందులో మీకు అవసరమయ్యే మేలులన్నిటిని మీరు కనుగొందురు. అద్భుతమైన స్వస్థతను ఇచ్చే మహిమగల యేసును మీరు కలిగియున్నారు. తన వాగ్దానం ఒక గొప్ప ఔషదమని ఒప్పుకొన్నప్పుడు ప్రభువు మీ నుండి అనారోగ్యాలన్నిటిని తొలగిస్తాడని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. " యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి, నీవెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయ వ్యాధులన్నిటిని నీకు దూరపరచి, నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును '' (ద్వితీయోపదేశకాండము 7:15) అన్న వచనము ప్రకారము మీలో ఉన్న విశ్వాసం ఉప్పొంగునప్పుడు, మీలో ఉన్న సర్వరోగములను తొలగిస్తాడు. ఇంకను, " అయితే నా నామమందు భయ భక్తులుగలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును; అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు '' (మలాకీ 4:2). అవును! ఆయన వాక్యం నుండి వచ్చే కాంతి మీపై అనారోగ్యం కలిగించాలని కోరుకునే చీకటి శక్తుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. ఆయన మీ నుండి సర్వరోగములను తొలగించి, మంచి ఆరోగ్యముతోను మరియు దీర్ఘాయుష్షుతోను నింపి, మిమ్మల్ని పరశింపజేస్తాడు.

Prayer:

స్వస్థపరచే మా ప్రియ పరలోకపు తండ్రీ,

ప్రభువా, మేము నీ మంచితనాన్ని నమ్ముతున్నాము. నీవు పరమ వైద్యుడవని మేము నమ్ముచున్నాము. నీవు మాకు మంచి బహుమతులను ఇచ్చేవాడవని మేము విశ్వసించుచున్నాము. నీ పిల్లలమైన మేము వ్యాధిపడకలో ఉండుట నీవు ఇష్టపడవు. కాబట్టి, నీవు మమ్మల్ని స్వస్థపరచుము. మాలో ఉన్న సర్వరోగములను తొలగించుము. డాక్టర్లు ద్వారా స్వస్థపరచలేని మా వ్యాధులను నీవు స్వస్థపరచగలవని మేము విశ్వసించుచున్నాము. మా విశ్వాసాన్ని బలపరచి, నీవనుగ్రహించే మేలులను పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. శరీరానికి అనారోగ్యం కలిగించడానికి మేము ఎన్నుకున్న తప్పు మార్గములను, ఆలోచనలు, ఆహారపు అలవాట్లను అనుమతించినందుకు చింతిస్తున్నాము. మమ్మల్ని క్షమించుము. ఇప్పుడు కూడా, నీ వాగ్దానం ప్రకారం, యేసు రక్తం మీద నమ్మకంతో మా స్వస్థత కొరకు నీ యొద్దకు వచ్చియున్నాము. నీ స్వస్థపరచు శక్తి మా శరీరాన్ని నింపునట్లు చేయుము. మా శరీరంలో నూతన అవయవాలను సృష్టించుము. మా చుట్టూ ఉన్నవారిని ఆశ్చర్యపరిచే అద్భుతాల ద్వారా మా వ్యాధులను ముట్టి స్వస్థపరచుమని వేడుకొనుచున్నాము. మరణకరమైన వ్యాధులను మా నుండి దూరపరచి, నీ రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యమును మాకు దయచేసి, నీతి సూర్యుడు మాపై ఉదయించునట్లు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు అతిశ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000