Loading...
Evangeline Paul Dhinakaran

కనికరముతో నుండుటకు ఏర్పరచబడినవారు!

Sis. Evangeline Paul Dhinakaran
11 Jun
నా ప్రియమైనవారలారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ లోక కార్యాలను చూచి అధైర్యపడుచూ, వాటిని గూర్చి ఎల్లప్పుడు చింతించకండి. మా కుటుంబములో ఆనందము లేదు, ఎప్పుడు చూచిన ఏడ్పు, కన్నీళ్లే అని దిగులుపడకండి. మా గురించి చింతించేవారు ఎవరు లేరని దుఃఖపడకండి. ఎందుకంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు నేటికిని సజీవముగా మన మధ్యలో జీవించుచున్నాడని మరవకండి. అందుకే బైబిల్లో, " మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును; నీ యందలి సంతోషముచేత ఆయన హర్షించును '' (జెఫన్యా 3:17) అన్న వాక్యము ప్రకారము, మన దేవుడు యెంత శక్తిమంతుడైయున్నాడో కదా! ఆయన మీ పట్ల సంతోషించే దేవుడైయున్నాడు. 

చూడండి, ఆలాగుననే, బైబిల్లో " విలపించే ప్రవక్త '' అని పిలువబడు భక్తుడైన యిర్మీయాను దేవుడు ఏర్పరచుకొనెను. ప్రజలు తమ పాపములో నుండి విడుదల పొందవలెనని అతను దేవుని యొద్ద విజ్ఞాపన చేసెను. ప్రభువైన యేసువలె, అతను ప్రేమతోను, కనికరముతోను, ధైర్యముతోను నింపబడి ప్రజల కొరకు కన్నీటితో ప్రార్థించెను. నా ప్రియులారా, కనికరముతో ఉండుట మాత్రమే గాక, మన జీవితములో ఎటువంటి పరిస్థితి ఎదురైనను క్రీస్తుయందు విశ్వాసముతో ధైర్యముగా ఉండవలెను. 
నా ప్రియులారా, కొన్ని సమయములలో మనకు సహాయము చేయుటకు ఎవరును లేరు అని ఒంటరిగా భావించెదము. యేసుని బలమైన హస్తములకు మనలను సమర్పించుకొనవలెననే ఉద్దేశముతో ప్రభువు మనకు అటువంటి పరిస్థితులను అనుమతించుచున్నాడు. " దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి '' (1 పేతురు 5:6) అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. గనుక ఆయన మిమ్మును ఉన్నత స్థానమునకు హెచ్చించును. " మీరు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదరు '' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. " మీరు యెహోవా యందు ఆనందించెదరు మీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును అనుభవించెదరు '' (యెషయా 58:11,14) అని ఆయన సెలవిచ్చు చున్నాడు. మీరు ఏ మనుష్యుని యందును ఆనందించరు, దేవుని యందు మాత్రమే ఆనందించెదరు. ఆయన వాక్యమును మాత్రమే విశ్వసించండి. " లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, '' (యోహాను 16:33) అన్న వచనము ప్రకారము ప్రభువు ఈ లోకమును జయించియున్నాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో శ్రమలు కలిగినను, మీరు వాటిని చూచి దిగులుపడకండి, దేవుడు మీ పట్ల ఆనందించేవాడైయున్నాడు. కనుకనే, నేడు మీకు కలుగు శ్రమలన్నిటిలోను మీరు అత్యధికమైన విజయమును పొందెదరు.

దేవుడు యిర్మీయాతో, " నీవు నా కొరకు నిలబడుదువా? '' (యిర్మీయా 1:9) అని అడిగెను. ఆయన రాజ్యమును స్థాపించుటకు దేవుడు మిమ్మును పిలుచుచున్నాడు. ఆయన తన ఆత్మతో మనలను నింపియున్నాడు గనుక, ఏదియు మనలను కదిలించలేదు. ఏ మనుష్యుని చూచి భయపడము. మనము ధైర్యముతో ముందుకు సాగెదము. దేవుడు యిర్మీయా నాలుకను ముట్టి, అతను మాటలాడునట్లు చేసెను (యిర్మీయా 1:7,8) అన్న వచనముల ప్రకారం నేడు మిమ్మును కూడ ముట్టును. మోషేకును, యిర్మీయాకును తోడైయున్న దేవుడు, నేడు ఈ సందేశము చదువుచున్న మీకును తోడైయున్నాడు. దానినే బైబిల్ మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది, " ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు '' (జెఫన్యా 3:15). కనుక, మనము ఎన్నడును నిరుత్సాహపడకూడదు. మన బలహీనతల వలన మనలో ఆయన క్రియ చేయకుండునట్లు ఆటంకపరచకూడదు. ఆయన క్రియలు తగ్గునట్లు సాకులు చెప్పకూడదు. బండ సందులో ఆయన కొరకు నిలబడుదుము. సింహము వలె ధైర్యముగా దేవుని సువార్తను ప్రకటించెదము. 

నా ప్రియమైనవారలారా, ఈ వెబ్సైట్ చూచు మీరు సంతోషించి హర్షించుట చూచి, ఆయన మీపట్ల ఆనందించుచున్నాడు. ఇందు నిమిత్తమే, నేడు మీరు పయనించే అన్ని దుఃఖ సమయాలలో మిమ్మును విడిపించుట కొరకు యేసు సిలువలో ఆనాడు శ్రమలను సహించాడు. మీ దుఃఖము, వ్యా«ధులు, పాపము యొక్క శక్తిని ఆయన సిలువలో నాశనము చేశాడు. నేడు మీరు దుఃఖముతో ' ప్రభువా, మా పాపము నుండి, వ్యాధి నుండి మమ్మును విడిపించి, రక్షించుమని ' మీరు అడిగినప్పుడు, వెంటనే శక్తిమంతుడైన దేవుడుగా ఉన్న ఆయన మిమ్మును రక్షించుటకు మీ మధ్యలోనికి దిగివస్తాడు. మీ సకల సమస్యల నుండి మిమ్మును విడిపిస్తాడు. సంతోషముతో మీ పేరున హర్షిస్తాడు. యెంత గొప్ప ఆనందమో కదా! ఇప్పుడే దేవుడు ఈ కార్యము మీ జీవితములో జరిగిస్తాడు. మీరు సమస్యలతో కూరుకుపోయినప్పుడు, శక్తిమంతుడైన దేవుడు మీ యొద్దకు వచ్చి, మీకు తోడుగా ఉండి, మీకు ఎన్నోరెట్లు దీవెనలు కలుగచేసి, మిమ్మును సంతోషపరుస్తాడు. మీకు మంచి యీవులను ఇచ్చి మిమ్మును దీవెనకరమైన జల్లులతో తప్పక వర్ధిల్లజేసి ఆశీర్వదించును. తద్వారా మీరు సంతోషించుట చూచి ఆయన కూడ మీతో పాటు ఆనందించి హర్షిస్తాడు. 
Prayer:
సర్వశక్తి గల ప్రభువా, శక్తిమంతుడవైన మా గొప్ప దేవా!

నిన్ను ఘనపరచుచున్నాము, మా పాపములను నీవు మోసి మమ్మును వాటిని నుండి కాపాడినందులకు నీకు వందనములు. నీవు మా పాపశాపముల నుండియు, వ్యాధుల నుండియు విడిపించుటకు ఈ లోకములో శాపముగా మారితివి. నేడు నీవు మా మధ్యలో నివసించుచు, మా కుటుంబములో గొప్ప సంతోషమును దయచేయుము. మా జీవితాలలో పరిపూర్ణ ఆనందమును కుమ్మరించుము. మేము దుఃఖ సమయములో ఉన్నప్పుడు నీవు మా యొద్దకు వచ్చి, మమ్మును ఆనందపరచుము. మా పట్ల నీవు ఆనందించి , హర్షించుటకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. మా హృదయమును తెరచి నిన్ను మేము ఆహ్వానించుచున్నాము. మా ఆపత్కాలములో మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము, నీవు మాకు ఉత్తరమిమ్ము, తద్వారా నీ నామము మహిమపడునట్లు సహాయము చేయుము. నీవు మా హృదయములోనికి వచ్చి, మా పాపమును, మా రోగమును తీసివే సి, మా కుటుంబములో వున్న శాపమును తొలగించి, మా కుటుంబమునకు రక్షణను, దీవెనకరమైన జల్లులను కురిపించి, మా పట్ల నీవు హర్షించి, సంతోషించుము. మా పట్ల నీ ఆనందమును బయలుపరచి మమ్మును పరవశింపజేయుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ద నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000