Loading...
Evangeline Paul Dhinakaran

మీరు గొప్ప విజయం నొందెదరు!

Sis. Evangeline Paul Dhinakaran
28 Oct
నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మీ కోసం ఒక అద్భుతమైన వాగ్దానం చేయుచున్నాడు. ఇది 1 సమూయేలు 26:25వ వచనము నుండి అనుగ్రహించబడియున్నది. " అందుకు సౌలు దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. '' చూడండి, శత్రువుగా ఉన్న సౌలు ఈ మాటలతో దావీదును ఆశీర్వదించాడు. కానీ, సౌలు దావీదును తన హృదయంలో ద్వేషించాడు. సౌలు దావీదును చంపడానికి అతనిని వెంబడించాడు. కానీ, సౌలు దావీదును కలుసుకున్నప్పుడు, అతన్ని ముఖాముఖిగా చూసినప్పుడు, అతన్ని చంపడానికి బదులు దావీదును ఆశీర్వదించాడు. ఇది దేవుని పిల్లలకు అనుగ్రహింపబడిన గొప్ప ధన్యతయై యున్నది. ఆలాగుననే, నేడు మనము హృదయపూర్వకంగా ప్రభువును ప్రేమిస్తున్నప్పుడు, మనలను ఆశీర్వదించడానికి ఆయన మన శత్రువులను కూడా మిత్రులనుగా మారుస్తాడు.

బైబిల్‌లో సామెతలు 16: 7 వ వచనములో ఈలాగున చెప్పబడియున్నది, " ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును '' అన్న వచనము ప్రకారము ఒకని ప్రవర్తన ద్వారా ప్రభువును అతను సంతోషపెట్టినప్పుడు, ఆయన వాని శత్రువులను కూడా మిత్రులనుగా చేస్తాడు. అవును, దావీదు దేవుని హృదయానుసారుడైన ఒక వ్యక్తి అని దేవుడు దావీదును గురించి సాక్ష్యమిచ్చాడు. " అతను నా హృదయానుసారుడైన ఒక వ్యక్తి అని దావీదు దేవుని ద్వారా సాక్ష్యమును పొందాడు. అంతమాత్రమే కాదు, నేను చేయాలనుకున్నదంతా దావీదు చేస్తాడు. అతను నాకు విధేయత చూపిస్తాడు మరియు నా చిత్తాన్ని పరిపూర్ణమైన రీతిలో జరిగిస్తాడు '' అని దేవుడు దావీదు పట్ల ఒక నమ్మకము కలిగియుండెను. దావీదు ప్రవర్తన ద్వారా దేవుని ప్రీతిపరచినందున, దావీదునకు శత్రువైన సౌలు ద్వారా ఆశీర్వాదము పొందు ధన్యతను అనుగ్రహించెను. ఇది ప్రభువు నుండి దావీదుకు ఇవ్వబడిన ఒక గొప్ప సాక్ష్యం. దావీదు యొక్క మార్గాలు ప్రభువునకు ఎంతో ప్రీతికరముగా ఉండెను. అందుకే దేవుడు తనను ఆశీర్వదించడానికి తన శత్రువును ఏర్పాటు చేశాడు.
నా ప్రియులారా, నేడు మన శత్రువులు మనలను ద్వేషించినప్పుడు లేదా మనపై అసూయపడి, మనకు వ్యతిరేకంగా అసభ్యకరమైన మాటలు పలికినప్పుడు, మనము వారిని ద్వేషిస్తాము కదా? కానీ, వారిని ద్వేషించుటకు బదులుగా, మనం వారిని ఆశీర్వదించి, మన శత్రువుల కోసం ప్రార్థిస్తే, ప్రభువు మన శత్రువులకన్నా ఎక్కువగా మనలను ఆశీర్వదిస్తాడు. మనము బైబిల్లో చదివినట్లయితే, " సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను '' (2 సమూయేలు 3:1). అవును, దావీదు బలవంతుడయ్యాడు. మీ కోసం దేవుడు కలిగి ఉన్న ఆశీర్వాదం కూడ ఇదియే. మీరు బలంగా మరియు శక్తివంతముగా ఉంటారు. మీరు నిశ్చయముగా విజయం పొందుకుంటారు. మీరు ధన్యులుగా ఆశీర్వదింపబడుదురు. అందువలన, " దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి '' (1 పేతురు 5:6) అన్న వచనము ప్రకారము యెహోవా మిమ్మల్ని సమృద్ధిగా మరియు తగిన సమయంలో మిమ్మల్ని ఆశీర్వదించు వరకు మీరు దేవుని బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై ఉండినప్పుడు మీరు నిశ్చయంగా ఘనకార్యములు చేస్తారు మరియు మీరు విజయం పొందుకొని ఉన్నత స్థానమునకు హెచ్చింపబడతారు.
Prayer:
సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నీ వాగ్దానం ప్రకారం ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించుము. దేవా, బలహీనులమైన మమ్మల్ని అనుదినము బలంగాను, శక్తివంతముగా మార్చుము. దేవా, మా ప్రవర్తన నీకు ప్రీతికరముగా ఉండునట్లుగాను తద్వారా మా శత్రువులను సహా మాకు మిత్రులనుగా చేయుమని వేడుకొనుచున్నాము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ చేత మా అంతరంగంలో బలపడుటకు మాకు సహాయము చేయుము. దేవా, మేము కోల్పోయిన సమస్తమును మరల మా జీవితములో పునరుద్ధరించుము. మా జీవితంలో సమస్తమును రెండంతలుగా అనుగ్రహించుము. దేవా, దావీదు వలె మేము నీ కోసం గొప్ప కార్యాలు జరిగించేవారలనుగా మమ్మల్ని మార్చుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000