Loading...
DGS Dhinakaran

యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత!

Bro. D.G.S Dhinakaran
17 Jun
నా ప్రియులారా, నేడు మన ప్రభువైన యేసు తన బిడ్డలైన వారికి క్షమాపణ మరియు స్వస్థతను కలుగజేయడానికి చెప్పనలవికాని వేదనకు గురయ్యాడు. ముళ్ళ కిరీటం ద్వారా ఆయన తల రక్తస్రావంగా మారినది. ఆయన మనకు సమాధానమును కలుగజేయడానికే, ముళ్ల కిరీటమును తన తల మీద ఉంచబడినది. అదియుగాక, మన యొక్క సమాధానమునకు అర్హత కలిగించుటకే ఆయన పోరాడవలసియున్నదని ఆయన ముందుగానే గుర్తెరిగియున్నాడు. ఆయన మనకు స్వస్థతను అనుగ్రహించుటకు తన శరీరము మీద తాను మేకుల ద్వారా గాయములను భరించాడు. ఆయన సజీవంగా లేచినప్పుడు, ఆయన యొద్దకు వచ్చిన వారందరు స్వస్థతను పొందుకున్నారు. కారణము, ఎవరైతే, బాధలు మరియు వ్యాధుల ద్వారా వేదన పడుచున్నారో, ప్రతిమానవాళి ఆయన ఈ భూమిని విడిచి పెట్టి వెళ్లకముందుగానే ఆయన తీసుకొని వచ్చిన స్వస్థతను అందరికి అనుగ్రహించాడు. ఈ రోజు, ఆయన ఇచ్చు స్వస్థత కొరకు వెదకుచున్న వారెవరైనా సరే, తప్పకుండా స్వస్థతను పొందుకుంటారు. ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీ వ్యాధులు స్వస్థపరచలేమని డాక్టర్లు చెప్పినట్లయితే, మీరు భయపడకండి. దేవుడు, మీ విశ్వాసం ప్రకారం అది మీకు జరిగిస్తాడు. " యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? అని వారి నడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగు గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను '' (మత్తయి సువార్త 9:29) అన్న వచనము ప్రకారము మీరు దేవుని వాక్యంపై మాత్రమే నమ్మకం ఉంచవలెను. బైబిల్ ఇలా చెబుతోంది, " ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవుఎ '' (మత్తయి 24:35) అన్న వచనము ప్రకారము మీరు దేవుని మాటలు విశ్వసించినట్లయితే, ఆయన మాటలు ఎన్నటికి గతింపవు. కనుక ఇది మీకు సరైనదని దేవుడు సెలవిచ్చినట్లయితే, మీరు ఆయన మాటలపై విశ్వాసం ఉంచినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ జీవితములో అద్భుతములను జరిగిస్తాడు.

అనేక సంవత్సరాల క్రితం, అమెరికా దేశములో, టెక్సాస్ అనే ప్రదేశములో, ఒక వ్యక్తి ఒక అందమైన తోటను దాటి వెళ్లుచుండగా, అక్కడ ఒక చక్కటి చిన్న పిల్లవాడు తోటలోని అందమైన పువ్వులను నిలవబడి ఆరాధించడం అతను గమనించాడు. అకస్మాత్తుగా, ఎంతో విషపూరితమైన ఒక పాము మెల్లగా ఆ బాలుని వైపునకు సమీపించుట ఆ వ్యక్తి చూచాడు. అతను జరుగబోయే ప్రమాదాన్ని అర్థం చేసుకున్నాడు మరియు అది బాలుడిని కాటువేస్తుందనియు, ఆ పిల్లవాడు వెంటనే చనిపోతాడని అతడు గ్రహించాడు. ఏమి చేయాలో అతనికి తెలియలేదు. ఏదేమైనా, రెప్పపాటులో అతను పామునకు మరియు ఆ చిన్నపిల్లవానికి మధ్యన దూకాడు. వెంటనే, ఆ పాము తన దృష్టిని అతని వైపుకు తిప్పి, పదిసార్లు అతనిని కాటువేసినది. అతను బాధతో కేకలు వేశాడు. ఇది విన్న ఆ చిన్న పిల్లవాని తండ్రియు మరియు మరికొందరు పరుగెత్తుకుంటూ వచ్చారు. పాము వెళ్లిపోయినది, ఆ చిన్న పిల్లవాడు రక్షించబడ్డాడు. కానీ, ఈ వ్యక్తి గాయపరచబడ్డాడు. ఆ పిల్లవాని తండ్రి మరియు అక్కడున్న వారందరు ఈ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతను ప్రాణాలతో పోరాడాడు. చివరకు అతన్ని రక్షించారు. చిన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడైనప్పుడు, ఆ వ్యక్తిని చూచినప్పుడల్లా, " ఈ వ్యక్తి తన నన్ను కాపాడడానికి తన ప్రాణాన్ని త్యాగము చేశాడు '' అని చెప్పేవాడు.
నా ప్రియులారా, మన ప్రభువైన యేసు కూడా, పామును, అపవాదిని తన కాళ్ల క్రింద చితుక త్రొక్కాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది '' (యెషయా 53:5) అన్న వచనము ప్రకారము మన యతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగజేయుట మాత్రమే కాదు, సిలువపై ఆయన కార్చిన రక్తము ఎంత ఘోర పాపికైన క్షమాపణ కలుగుతుంది. యేసు, " నా పిల్లలు పాపం నుండి విముక్తి పొందటానికి నేను దీనిని సహనముతో భరిస్తాను '' అని తలంచి, మన అతిక్రమక్రియల నిమిత్తము ఆయన గాయపడ్డాడు; మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మనలను దుష్టుడిని నుండి రక్షించడానికి ఆయన మరణాన్ని రుచి చూశాడు. కానీ, మనము చేయవలసినదేమనగా, మనము మన పాపాలను ఒప్పుకోవాలి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును '' (1 యోహాను 1:9) అన్న వచనము ప్రకారము ఆయన మన పాపములను క్షమించి, మనలను పవిత్రులనుగా చేస్తాడు. ఆయన చేసిన త్యాగము ద్వారా క్షమాపణ మన యొద్దకు వచ్చినది. ఆయన మన మీదికి రావాల్సిన శిక్షను తానే భరించాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము (రోమా 5:9) అన్న వచనము ప్రకారము మనం యేసుక్రీస్తు ద్వారా ఆయనను అంగీకరించుచున్నాము. స్వస్థత, క్షమాపణ మరియు ఆశీర్వాదాల సిలువలో ఉన్నదని మీరు నమ్ముచున్నారా? మీరు దేవుని వాక్యమును గట్టిగా హత్తుకొన్నట్లయితే, నిశ్చయముగా, ఆయన పొందిన గాయాల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది. మీరు దేవుని ద్వారా దీవించబడుదురు.
Prayer:
ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రీ,
 
త్యాగమునకు చిహ్నముగా ఉన్న నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును నీవు ఈ లోకమునకు పంపించినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. మా వ్యాధుల మరియు అతిక్రమముల నిమిత్తము, నీవు గాయపరచినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, ప్రస్తుత పరిస్థితులలో ఉన్న మమ్మల్ని నీవు విడిపించి, మా జీవితాలలో ఉన్నతమైన స్థానమునకు తీసుకొని రమ్మని వేడుకొనుచున్నాము. యేసయ్యా, నీవు మా నిమిత్తము చేసిన త్యాగమును నిమిత్తము నిన్ను స్తుతించుటకు వందనములు చెల్లించుచున్నాము. యేసయ్యా, నీవు చూపిన ప్రేమను మేము ఇతరుల పట్ల చూపించుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీవు మా కొరకు చనిపోయావని మేము విశ్వసించి, నిన్ను వెంబడించుటకు మాకు సహాయము చేయుము. మేము నీకు మొర్రపెట్టు చున్నాము. మా కొరకు నీవు నలుగగొట్టబడి, గాయపరచబడినందున, నీవు పొందిన గాయముల ద్వారా మా వ్యాధులను, రోగములను స్వస్థపరచి, ఈ క్లిష్టమైన పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించి, పరవశింపజేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000