Loading...
DGS Dhinakaran

మంచి యీవులతో మిమ్మల్ని నింపే దేవుడు!

Bro. D.G.S Dhinakaran
22 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు దేవుడు మంచి యీవులను అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. మీరు అడిగే ప్రతి యీవిని మీకివ్వాలని ఆయన మీ పట్ల వాంఛించుచున్నాడు. మనము చెడ్డవారమై యున్నప్పటికిని ఆయన తన మంచి యీవులైన ఆత్మాభిషేకమిచ్చు వరములు మీకు అనుగ్రహించుటకు సిద్ధముగా వున్నాడు. మీరు అడిగినవన్నియు దేవుడు మీకిస్తాడని మీరు నమ్మినట్లయితే, మీకు తప్పక మంచి యీవులను అనుగ్రహిస్తాడు. ఒకవేళ మీరు ఇంతవరకు మేము మంచి యీవులను అనుభవించలేదు. అన్నియు కీడునే మేము రుచి చూచుచున్నామని చింతించుచున్నారా? దిగులుపడకండి, మన పరలోకపు తండ్రి మంచి యీవులను కలిగియున్నాడు. మన నిమిత్తము సమస్తమును మనకు మేలు జరిగించి, సంపూర్ణంగా మంచి యీవులను అనుగ్రహిస్తాడు.
 
ఐదవ మొగల్ చక్రవర్తియైన షాజహాన్, చాలా గొప్ప రాజు. అతడు ఎన్నో వజ్రాలను కలిగి ఉండెను. అతను కొన్ని వజ్రాలను తన జేబులో ఉంచుకొని తన స్నేహితుని యొద్దకు వచ్చాడు. ఒకసారి, షాజహాన్ మక్కాకు వెళ్లి అక్కడ ముల్లాతో చాలా స్నేహంగా ఉండెను. అతని జ్ఞాపకార్థముగా ముల్లాకు వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. కొంతకాలం తర్వాత, ముల్లా ఆ వజ్రాలను విక్రయించడానికి ప్రయత్నిస్తూ, వజ్రాల దుకాణానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న వ్యాపారి ఆ వజ్రాలను చూచి ఎంతగానో ఆశ్చర్యపోయాడు. కారణము, ఇది ఎంతో విలువైన వజ్రం. కాబట్టి, ఈ వజ్రానికి కోటి రూపాయలు లభిస్తుంది అని చెప్పాడు.
నా ప్రియులారా, ఒక భూసంబంధమైన రాజు హృదయం తన స్నేహితుడిని ఇంత ఖరీదైన వజ్రాలతో ఆశీర్వదించగలిగితే, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పరలోకపు తండ్రి, మీ కోసం ఎంత ఎక్కువ చేస్తాడు కదా! బైబిలు ఇలా చెబుతోంది, ‘‘ మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యీవుల నిచ్చును ’’ (మత్తయి 7:11) అన్న వచనము ప్రకారము దేవుడు మంచివాడు మరియు మీ హృదయ కోరికలను నెరవేర్చడం ద్వారా మిమ్మల్ని సంతోషపెట్టడంలో ఆయన ఆనందం పొందుతాడు. కారణము, ‘‘ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ’’ (రోమీయులకు 8:32) అన్న వచనము ప్రకారము అడుగు మనకు ప్రభువు సమస్తమును ధారాళముగా దయచేస్తాడు.
 
అవును, నా ప్రియులారా, ఈనాడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు మంచి యీవులను ఇచ్చుటకు మన కొరకు వేచియున్నాడు. భూమిని దానిలో సమస్తాన్ని కలిగి ఉన్న దేవుడు తన పిల్లలకు మంచి బహుమతిని ఇవ్వకుండా మానడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, ‘‘ శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు ’’ (యాకోబు 1:17) అన్న వచనము ప్రకారము కాబట్టి, ఆయనను మీరు మంచి యీవులనే అడగండి, నమ్మండి మరియు పొందుకొనండి! ‘‘ నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను ’’ (కీర్తనలు 81:10) అన్న వచనము ప్రకారము మీ నోరు బాగుగా తెరచి, దేవుని అడగండి, ఈనాడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఆయన తన యొక్క మంచి యీవులతో నింపి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు
Prayer:
ప్రేమా కనికరముగల మా పరలోకపు తండ్రీ,
 
మా జీవితములోని ప్రతీ అవసరమును తీర్చుము. విశ్వాసములో మేము దిగజారి పోకుండునట్లు మా ఆత్మలను బలపరచుము. నీ ప్రేమా కనికరములతో మా హృదయమును నింపుము. నీ మంచి యీవులను ఆత్మీయ అభిషేకము ద్వారా మాకు తగిన జ్ఞానమును అనుగ్రహించి మా ద్వారా అనేక అద్భుత కార్యములను జరిగించుము. అపవాది చేతిలో నుండి మమ్ములను కాపాడి మా చుట్టు వున్న బంధకాల నుండి మమ్మల్ని విడిపించి నీ యొద్ద గుప్తములై ఉన్న మంచి యీవులైన ఆత్మ వరములతో, అభిషేకముతోను మమ్ములను నింపుమని కోరుచున్నాము. చెడు కార్యములు మా నుండి దూరపరచి మమ్ములను నీ మంచి యీవులతోను, నిత్య రాజ్యమునకు వారసులనుగా చేయుము. ఆయా సమయాలకు తగిన జ్ఞానమును మాకు దయచేయుము. నీవు అనుగ్రహించు జ్ఞానము ద్వారా మా యిల్లు కట్టబడునట్లు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000