Loading...
Dr. Paul Dhinakaran

మీలో ఉన్న దేవుని ఆత్మచేత మీ శోధనలను జయిస్తారు!

Dr. Paul Dhinakaran
22 Nov
నా ప్రశస్తమైన స్నేహితులారా, ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీ కోసం దేవుని వాగ్దానం బైబిల్ నుండి అపొస్తలుల కార్యములు 1:8 వ వచనము నుండి అనుగ్రహింపబడినది. " అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులుగా ఉందురు '' అన్న వచనము ప్రకారము ఈ లోకములో మనం బలహీనులముగా ఉండాలని దేవుడు మన పట్ల ఎప్పుడు కోరుకోడు. ఆయన శక్తిని మనం సంపూర్ణంగా పొందుకోవాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు. అందుకే ఆయన మనలను తన పరిశుద్ధాత్మతో నింపుతాడు. యేసులో ఉన్న ఆత్మ మీలో ఉన్నదని మీరు విశ్వసించండి. అది మీరు దేవుని నుండి పొందగల గొప్ప వరమై యున్నది. సిలువపై మరణించినప్పుడు యేసు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. ఏ అపవాది కూడ తన ఆత్మను స్వాధీనం చేసుకోలేకపోయినది. కానీ, సర్వశక్తిమంతుడైన దేవునికి ఆయన తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఆయన ఎందుకు అలా చేశాడు? దేవుడు ఆ ఆత్మను మీకు అనుగ్రహించుట కొరకే ఆయన ఆలాగున చేశాడు.

యేసు సిలువపై తన బాధింపబడుట ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని ఉత్పత్తి చేశాడు. యేసు ఈ భూమిపై జీవించినప్పుడు, పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నందున పరిశుద్ధాత్మ ఈ భూమి మీదికి రాలేదు. యోహాను 7:39 లో, " తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. '' యేసు సిలువపై ఉన్నప్పుడు బాధల అనుభవించి, ఆయన రక్తం ద్వారా విలువపెట్టి కొనవలసి వచ్చెను. ఇందువలన, పరిశుద్ధాత్మ మీ కొరకు మరియు ఆయన కొరకును అధికారము పొందుకొనుటకును ఆయన ద్వారా సిలువలో ఉత్పన్నం చేయబడినది. మరియు నేను మరియు మీరు ఆయన శక్తిని కలిగి ఉన్నాము. అపొస్తలుల కార్యములు 10:38 లో మనము చూచినట్లయితే, " అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. '' దేవుడు మీతో ఉండటానికి అదే శక్తిని నేడు మీకు అనుగ్రహించబడుతుంది.
నా ప్రియులారా, ఈ రోజు, ఈ సందేశము చదువుచున్న మీరు యేసులో ఉన్న అదే పరిశుద్ధాత్మశక్తిని కలిగి ఉంటారు. నేడు మీరు అడగండి, ఈ పరిశుద్ధాత్మ శక్తిని మీరు కూడ పొందుకుంటారు. ఆయన మీలోనికి వచ్చినప్పుడు, ఆయన మీకు క్రొత్త భాషలను అనుగ్రహిస్తాడు. " అందుకు ప్రభువు ఇలా అంటున్నాడు, నిజమే అలసినవానికి నెమ్మది కలుగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాటలాడుచున్నాడు '' (యెషయా 28:11) అన్న వచనములో చెప్పబడినట్లుగానే, నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఆయన మీ ద్వారా దేవుడు ఈ ప్రజలతో మాట్లాడతాడు. కాబట్టి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి వచ్చినప్పుడు ఆయన మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఎటువంటి బాధలు, భయాలు మరియు చింతలైనను సరే, అవి మీ నుండి తొలగిపోతాయి. అప్పుడు దేవుని శక్తి మీలోనికి వస్తుంది. మీలో భయం లేనప్పుడు, మీలో దేవుని శక్తి నిలిచియుంటుంది. రోమీయులకు 8:26 ప్రకారం, పరిశుద్ధాత్మ ఏమి చేస్తుంది? అదే విధంగా, " అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. '' పరిశుద్ధాత్మ మన ద్వారా క్రొత్త భాషలలో ప్రార్థిస్తుంది. ఇంకను, " మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు '' (రోమీయులకు 8:27) అను వచనములో చెప్పబడినట్లుగానే, ఉన్నట్లుగా దేవుని చిత్తంలో మనలను నడిపించినప్పుడు మనలో ఉన్న మన భయాలను తొలగిస్తుంది. మీరు మాట్లాడే విధానాన్ని దేవుడు మీకు నేర్పిస్తాడు, ఆయన మీతో మాట్లాడుతున్నప్పుడు మరియు గొప్ప శక్తి మరియు విశ్రాంతి మీ ఆత్మలోనికి దిగివస్తాయి. యేసు అరణ్యంలో తన శోధనలను జయించినట్లే, మీరు ఆయన యొక్క రక్షించే శక్తి ద్వారా మరియు మహిమపరచే శక్తి ద్వారా అన్ని శోధనలను జయించగలరు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.
Prayer:
ప్రేమా నమ్మకమైన మా పరలోకమందున్న తండ్రీ,

సిలువ వద్ద నీవు మాకోసం ఉత్పన్నము చేసిన నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపుము. దేవా, మేము నిన్ను మాలోనికి ఆహ్వానించుచున్నాము. నీవు ఏలాగున శోధనలను జయించావో, ఆలాగుననే, మేము కూడ మా శోధనలను జయించుటకు మాకు నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని దయచేయుము. ప్రభువా, నీ యొక్క శక్తి ద్వారా భూదిగంతములందతటను నీకు సాక్ష్యమిచ్చే శక్తివంతమైన జీవితాన్ని గడపడానికి మాకు నెమ్మదిని మరియు శక్తిని దయచేయుము. దేవా, మేము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మాకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో నీ యొక్క ఆత్మ తానే మా పక్షముగా విజ్ఞాపనము చేయుటకు సహాయము చేయుము. ప్రభువా, నీ ఆత్మ శక్తితో మేము ఈనాటి నుండి నూతన భాషలైన అన్యభాషలను మాట్లాడుటకును మరియు నీ శక్తి ద్వారా నీ మహిమను బయలుపరచుటకు మాకు సహాయము చేయుమని సమస్త స్తుతి, ఘనత మహిమ నీకే చెల్లించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000