Loading...
Dr. Paul Dhinakaran

తన ఉద్దేశమును మీ పట్ల కనుపరచిన ప్రభువు దానిని నెరవేరుస్తాడు!

Dr. Paul Dhinakaran
06 Aug
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల కార్యములు సఫలము చేయాలని మన ప్రభువు కోరుచున్నాడు. ఈనాడు మనందరి జీవితంలోని అనేక విధాలుగా భయము మనలో ఉండవచ్చును. పిల్లలు కూడా ఎవరూ ఆందోళన చెందకుండా ఉండరు. కానీ, పిల్లలు సాధారణంగా నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకంటే, వారి తల్లిదండ్రులు తమకు అవసరమైన వాటిని చూసుకుంటారని వారికి తెలుసు. ఆలాగుననే, మీ అవసరాలకు ఎవరి మీద ఆధారపడటానికి దేవుడు మిమ్మల్ని అనుమతించడు. ఎవరైనా మీకు ఇచ్చే ఆస్తి ద్వారా మీరు జీవితంలో ముందుకు రావడం లేదు. ఒకరి సహాయం వలన మీరు గొప్ప మార్పును చూడలేరు. మీ జీవితానికి దేవుడు ఒక ప్రణాళికను నిర్ణయించినప్పుడు, ఎవరూ మీకు సహాయం చేయలేరు. తన చిత్తాన్ని నెరవేర్చడానికి, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన స్వయంగా మీకు ఆజ్ఞాపిస్తాడు.  ప్రభువు ఇలా అంటున్నాడు, " వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును '' (యెషయా 60:22) అన్న వచనము ప్రకారము కాబట్టి, మీరు దేవుని చిత్తాన్ని కనుగొని దానిని నెరవేర్చడానికి మీ సమయాన్ని వెచ్చించండి. ప్రభువు కొరకు కనిపెట్టుకొని యుండండి. తన ఉద్దేశమును మీ పట్ల కనుపరచిన ప్రభువు దానిని నెరవేర్చడానికి మీకు బలాన్ని అనుగ్రహిస్తాడు.

మా పరిచర్య ప్రారంభ దినములలో, 1980 నుండి 1985 మధ్యకాలములో, మేము కారుణ్యను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మేము సహాయం కోసం ప్రజల యొద్దకు పరిగెడుతున్నాము. " మేము వారితో, కారుణ్యను నిర్మించాలని ప్రభువు బయలుపరచాడు. దయచేసి, మీరు ఉత్తర్వు ఇవ్వండి మరియు ఈ స్థలమును నమోదు చేయండి '' అని వారితో చెప్పాము. ఆ సమయంలో మాకు డబ్బు లేదు, మాకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. కొన్నిసార్లు, మా స్నేహితులు, " మేము కొంతమంది ఐశ్వర్యవంతులతో కలిసి మాట్లాడునట్లుగా మీకు సమావేశాలు ఏర్పాటు చేస్తాము. దేవుని ప్రణాళికను వారికి తెలియజేయండి మరియు వారు కళాశాల నిర్మాణంలో మీకు సహాయం చేస్తారు '' అని చెప్పి, ఆలాగుననే, వారు అలాంటి సమావేశాలను ఏర్పాటు చేశారు. " మేము ఒక కాలేజిని నిర్మించాలని దేవుడు కోరుకుంటున్నాడని, ఆ వ్యాపారవేత్తలతో చెప్పి,దయ చేసి, దానిని నిర్మించడానికి మాకు సహాయం చెయ్యండి '' అని వారితో చెప్పినప్పుడు, వారిలో కొందరు, " డబ్బు లేని ఎవరైనా సరే, ఎందుకు అంత గొప్ప కాలేజీని నిర్మించాలి? అది కూడా, మీరు దేవుని పేరు మీద చెప్పినట్లయితే, అది జరుగుతుందా? '' అని చెప్పి వారు మమ్మల్ని ఎంతో హేళన చూచి, మా పట్ల చెడుగా ప్రవర్తించారు.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు విశ్వసించే వ్యక్తులు మిమ్మల్ని తిరస్కరించవచ్చును. మీకు సహాయం చేయడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవచ్చును మరియు వారు మీ నుండి దూరంగా ఉండవచ్చును. దిగులుపడకండి! ప్రజలపై నమ్మకం ఉంచడం కంటే ప్రభువును ఆశ్రయించడం మంచిది అని బైబిల్ చెబుతోంది, " మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు '' (కీర్తనలు 118: 8) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మనుష్యులను నమ్ముకొనకుండా, దేవుని యందు మాత్రమే నమ్మకముంచండి. అంతమాత్రమే కాదు, విశ్వాసంతో దేవుని రాజ్యాన్ని వెదకండి. మీరు దేవుని వెదుకుచున్నప్పుడు, దేవుడు మీకు న్యాయం మరియు సరైన క్రియలను జరిగిస్తాడు. ఆయనే మీ యింటిని మరియు మీ పిల్లల భవిష్యత్తును నిర్మిస్తాడు మరియు వారిని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగునట్లు చేస్తాడు. " యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా, నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము '' (కీర్తనలు 138:8) అన్న వచనము ప్రకారము దేవుడు మీ పక్షమున కార్యము జరిగించినప్పుడు, మీరు ఇతరులకన్నా ఎక్కువగా ఆశీర్వదింపబడుదురు. కాబట్టి, మీరు దేనిని నిమిత్తము భయపడకుండా, దేవుని చేతులకు మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన నేడు ఈ సందేశము చదువుచున్న మీ పక్షమున కార్యము సఫలము చేసి, మిమ్మల్ని శాంతి సమాధానముతో నింపి, పరవశింపజేస్తాడు.
Prayer:
కృపగల దేవా, పరలోకమందున్న మా పరమ తండ్రీ,

నీకు వందనములు చెల్లించుచున్నాము. మా పట్ల నీవు కార్యము సఫలము చేయుచున్నందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, మేము అడగకముందే మా అక్కరలను ఎరిగిన దేవుడవు గనుకనే, నేడు మా పక్షమున కార్యము సఫలము చేయుమని ఎంతో విధేయతతో వేడుకొనుచున్నాము. మా పట్ల చింతించే దేవుడవు కనుకనే, మా చింతలన్నిటిని నీ మీద వేయుచున్నాము. నీవు మా పట్ల గొప్ప కార్యములను జరిగించుము. తద్వారా, అనేకులకు మేము దీవెనకరముగా ఉండునట్లు మాకు సహాయము చేయుము. దేవా, మా విన్నపములన్నిటిని నీ పాద సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నాము. దయతో నీవు మా విన్నపములను అంగీకరించి, మాకు సహాయము చేయుము. మేము నిన్ను విశ్వసిస్తున్నందున మమ్మల్ని ఎల్లప్పుడు శాంతి సమాధానములతో ఉండునట్లుగాను మరియు మా వ్యాధులను స్వరపరచి మమ్మల్ని పరవశింపజేయుము. మేము మనుష్యులను ఆశ్రయించుకుండను, రాజులను నమ్ముకొనకుండా, నిన్నే ఆశ్రయించుటకు మాకు కృపను చూపుమని యేసుక్రీస్తు సాటిలేని నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000