Loading...
Paul Dhinakaran

దేవుని సహాయం మిమ్మల్ని గొప్పగా చేస్తుంది!

Dr. Paul Dhinakaran
30 Apr
నా అమూల్యమైన స్నేహితులారా, ఈరోజు దేవుడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును చూచి, " నేను నీకు సహాయం చేస్తాను మరియు నిన్ను గొప్పగా చేయబోతున్నాను '' అని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, బైబిల్‌నందు, కీర్తన 18:35లో ఇలా చెబుతుంది, "నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు నీ కుడిచెయ్యి నన్ను ఆదుకొనెను నీ సాత్వికము నన్ను గొప్పచేసెను'' అని కీర్తనకారుడు చెప్పగలిగాడు. అదేవిధంగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ కష్టాలన్నిటి మధ్యలో దేవుడు మిమ్మును గొప్పగా చేయబోతున్నాడు. కాబట్టి, ఉత్సాహంగా ఉండండి. ఇంకను ఇది ఎప్పుడు మీ యొద్దకు వస్తుందనగా, " యుద్ధ దినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము'' (సామెతలు 21:31)లో చెప్పినట్లుగానే, మీ కష్టాలన్నిటి నుండి మీకు విజయం ప్రభువు యొద్ద నుండి వస్తుంది.

నా ప్రియులారా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఎల్లవేళలా అన్ని చోట్లా విజయోత్సవ ఊరేగింపులో నడిపిస్తాడని బైబిల్ చెబుతుంది, " మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము'' (2 కొరింథీయులకు 2:14) అని వ్రాయబడినట్లుగానే, ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగిస్తాడు. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం కదా! అదేవిధంగా మరి కొన్ని వచనములను చూద్దాము. దేవుడు, " ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక '' (1 కొరింథీయులకు 15:55-57) అన్న వచనముల ప్రకారము యేసుక్రీస్తు ద్వారా ఆయన మీకు విజయాన్ని కలుగజేస్తాడు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువు నామంలో వెళ్తే, మరణం యొక్క విజయం కూడా రద్దు చేయబడుతుంది. అవును, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును జయించే పాపపు శక్తి శూన్యం అవుతుంది. పాపం మరియు పాపం వలన కలిగే మరణంపై మీరు విజయాన్ని పొందే అధికారం మీకు ఉంటుంది. అపవాది ఇకపై మిమ్మల్ని ముట్టదు మరియు మీపై విజయమును పొందలేదు.
నా ప్రియులారా, ఇంకను బైబిల్‌లో చూచినట్లయితే, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును దేవుడు ఉన్నత స్థలముల మీద ఎక్కించాలని కోరుచున్నాడు. అందుకే వాక్యమేమంటుందో చూడండి, " నీవు యెహోవా యందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను నీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యమును నీ యనుభవములో ఉంచెదను యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే '' (యెషయా 58:14) అన్న వచనము ప్రకారము మీరు ప్రభువునందు ఆనందమును పొందునట్లుగా ఆయన మిమ్మును దేశపు యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడు. అవును నా అమూల్యమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు విజయం పొందునట్లుగా మరియు విజయం మార్గములో ప్రయాణించునట్లు చేస్తాడు. అంతమాత్రమే కాదు, " వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును'' ( యెషయా 60:22) అన్న వచనము ప్రకారం, ఎన్నికలేని మిమ్మును బలమైన జనమగునట్లు ప్రభువు గొప్పవారినిగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఈ కృపతో మిమ్మల్ని ఆశీర్వదించబోవుచున్నాడు. కాబట్టి, నేడు, మీరు కూడ దీనత్వమును వహించి, మీ జీవితాలను దేవునికి సమర్పించినట్లయితే, ఆయన సాత్వికము మిమ్మల్ని గొప్పచేసి, ఉన్నత స్థానమునకు ఎక్కించి, దీవించును.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,
 
నేటి వాగ్దానానికి నీకు వందనాలు. ప్రభువా, మా జీవితాన్ని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాము. మరణమును జయించుటకు మాకు నేర్పించుము మరియు మా దీన స్థితి నుండి మమ్మును పైకి లేవనెత్తుము. దేవా, మమ్మును జయోత్సముతో ఊరేగించునట్లుగా విజయ మార్గములో నడిపించుము. ప్రభువా, మా జీవితంలో నిన్ను మహిమపరచడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ సాత్వికము మమ్మల్ని గొప్ప చేస్తుందని నీ వాక్యము చెప్పినట్లుగానే, నీ సాత్వికము చేత నేడు గొప్ప చేయుటకు మమ్మల్ని నీ దివ్య హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, నీవలె మేము సాత్వికము కలిగి జీవించునట్లుగా మాకు అటువంటి హృదయమును దయచేయుము. దేవా, అపవాది ఈ లోకములో మమ్మల్ని నాశనము చేయుటకై పంపుచున్న ప్రతి అగ్ని బాణములను మా మీదికి రాకుండా, నీ రక్షణ కేడెముతో మమ్మల్ని కప్పుము. రక్షణ కేడెము, మా చుట్టు ఆవరించునట్లుగాను, మాకు విజయ కేడెమును ధరింపజేయుము. మా జీవితంలో నీ యొక్క మంచితనమును కుమ్మరించునట్లు చేయుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000