Loading...
Stella dhinakaran

మీ ప్రాణమునకు నెమ్మదిని కలుగజేయు ఆదరణ కర్త!

Sis. Stella Dhinakaran
21 May
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రాణములకు నెమ్మదిని కలుగజేసి, మీకు గొప్ప ఆదరణను అనుగ్రహించాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. ఆదరణ లేని ప్రతి ఒక్కరిని దేవుడు తన యొక్క ఆనందముతో నింపాలని మీ పట్ల కోరుచున్నాడు. సాధారణంగా, ఈ లోకములో మనం సంతోషంగా జీవిస్తున్నప్పుడు చాలాసార్లు అకస్మాత్తుగా పిడుగుపడ్డట్టుగా మనకు కష్టాలు వస్తుంటాయి. ఊహించని సమయంలో ప్రమాదాలను మరియు తప్పనిసరిగా జరిగే అపాయాలను గూర్చి మరియు మరణకరమైన వార్తలను వినాల్సి వస్తుంది. హృదయం పగిలినప్పుడు, కన్నులు కన్నీటితో నిండినప్పుడు ఎవరు ఆ కష్టాన్ని భరించగలరు? జీవితంలో వేదనను, కష్టాలను అనుభవించినవారే! మేము కష్టాలను అనుభవించాం. మళ్లీ ఆ పాతకాలే ఎందుకు వినిపిస్తావు? అని ఇతరులు వ్యంగ్యంగా అనవచ్చును. కానీ, " కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు ఓదార్చినట్టుగా ఇతరులు ఓదార్చలేరని మనం తెలుసుకోవాలి '' (2 కొరింథీయులకు 1:3) అన్న వచనము ప్రకారము కనికరము చూపు తండ్రి మిమ్మల్ని ఓదార్చుస్తాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎంత దుఃఖములో ఉన్నను సరే, మరణ లోయలో సంచరించేటప్పుడు కూడ మీరు దేవుని వైపు మాత్రమే చూడాలి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను '' (కీర్తనలు 91:15) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు శ్రమలో దేవునికి మొర్రపెట్టినట్లయితే, ఆయనే మీకు ఆదరణను మరియు ఓదార్పును అనుగ్రహిస్తాడు.

1986వ సంవత్సరంలో మా ప్రియ కుమార్తె ఏంజల్‌తో పాటు మరో ప్రదేశానికి వెళ్లడానికి కారులో ప్రయాణం చేస్తున్నాం. అయితే, మార్గంలో కారు ప్రమాదానికి గురియై మా ఒక్కగానొక్క ప్రియమైన కూమార్తె ఏంజల్ మరణించినందువలన మేము కలత చెందాము. మా హృదయము రెండు ముక్కలైనట్లుగా ఎంతో బాధపడ్డాం. ఇటువంటి దయనీయ స్థితిలో మన దయగల దేవుడు పరలోకపు తండ్రి, మా యొద్దకు వచ్చి మమ్ములను హత్తుకొని, దుఃఖముతో ఉన్న మమ్ములను ఎంతగానో ఓదార్చాడు. అయితే, మా కష్టంలో ఏ మాత్రం పాలుపంచుకోని ఒక వ్యక్తి నా భర్త దగ్గరకి వచ్చి, " చనిపోయిన నీ కుమార్తెను గురించి బహిరంగ కూటాలలో పదే పదే చెప్పుతూ, ఎందుకు కన్నీరు కారుస్తావు? దేవుడే నీ కుమార్తెను తీసుకువెళ్లాడని నీకు తెలియదా? అని వ్యంగ్యంగా అన్నాడు. '' కానీ, నా భర్త ఆ మాటలకు మౌనంగా ఉండెను. రోజులు గడిచాయి. ఒకరోజు ఆ వ్యక్తి కుమారుడు తన స్నేహితులతో సముద్రంలోకి ఈత కొట్టడానికి వెళ్లి మళ్లీ రాలేదు. ఈ చేదు అనుభవం తర్వాత, ఆ వ్యక్తి నా భర్త దగ్గరకి వచ్చి, " సహోదరుడా, దయచేసి నన్ను క్షమించు, నా జీవితంలో నీవు అనుభవించిన వేదనను, బాధను ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను '' అని అతడు ఎంతగానో ఏడ్చాడు. గతాన్ని మరచి నా భర్త అతన్ని కౌగలించుకుని, ఓదార్చి అతని యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చునట్లుగా అతని కోసం ప్రార్థించారు.

ఔను, నా ప్రియులారా, ఒకవేళ నేడు మీరు మీ ప్రియులగు వారిని పోగొట్టుకొని దుఃఖములో ఉండవచ్చును. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది '' (కీర్తనలు 94:18,19) అన్న వచనముల ప్రకారము అవును, మీ అంతరంగమందు విచారములు హెచ్చగా, ఆయన మీ దుఃఖమును మీ యొద్ద నుండి తొలగించి, మిమ్మును ఓదారుస్తాడు.ఈ దినము ఇవ్వబడిన వాగ్దాన వచనము ప్రకారము మన దేవుడు ఎటువంటి విపత్కర పరిస్థితులలోనైనా మిమ్ములను ఓదార్చి, మీ కన్నీటిని తుడిచివేయగలడు. కాబట్టి, మీరు దేని నిమిత్తము చింతించవద్దు. ఆయన మీ అలసియున్న ఆత్మకు బలాన్ని ఇస్తాడు మరియు ఈ లోకములో మీరు జీవించేలా చేస్తాడు. కాబట్టి, నేడే ఈ సందేశము చదువుచున్న మీ పట్ల ఎవరైన వ్యంగ్యంగా మాట్లాడినట్లయితే, మీ కాలును ఆయన అడుగుజాడలలో నడిచినట్లయితే, మీరు కూడ మీ దుఃఖాన్ని మరియు వేదన, బాధలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టి, ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ఆయన మీ కన్నీటిని తుడిచి, అంతరంగమందు విచారములు హెచ్చగా ఉన్న మీకు గొప్ప ఆదరణను అనుగ్రహించి, మీ ప్రాణమునకు నెమ్మది కలుగజేసి, మిమ్ములను ఓదార్చి, ఆనందముతో నింపి పరవశింపజేస్తాడు.

Prayer:
సమస్త ఆదరణకు కర్తవైన దేవా, కనికరము చూపు మా పరమ తండ్రీ,

ప్రేమగల ప్రభువా, మా హృదయం పగిలినప్పుడు నీవే మమ్మును ఓదార్చగల సమర్ధుడవు. మా అలసిన ఆత్మలను తృప్తిపరచుట కొరకే, సిలువపై నీవు మరణాన్ని జయించావు. కాబట్టి, నేడు మా శ్రమలను బాధలను అధిగమించడానికి మాపై నీ హస్తాన్ని ఉంచుము. మా అంతరంగములో విచారములు హెచ్చగా, దేవా, నీవు మా ప్రాణమునకు నెమ్మది కలుగజేసి, మమ్మల్ని ఓదార్చుము. దేవా, మా ప్రియులను పోగొట్టుకొని, దుఃఖములో ఉన్న మా కన్నీటిని నేడు తుడిచివేయుము. మా సంతోషమును నాశనము చేయుటకు అకస్మాత్తుగా పిడుగుపడ్డట్టుగా మేము ఎదుర్కొంటున్న కష్టాలు మరియు ఊహించని సమయంలో ప్రమాదాలను మరియు తప్పనిసరిగా జరిగే అపాయాలను గూర్చి వినాల్సి వచ్చినప్పుడు, మా హృదయభారాన్ని అధికం చేసే దుఃఖాన్ని మరియు చింతలను మేము జయించే శక్తిని, నీ ఆదరణ ఇచ్చి, మమ్మల్ని నడిపించుము. మా విచారమును కొట్టివేసి, ఆదరణ, ఓదార్పులేని మా జీవితాలలో నీ ఆదరణను పొందుకొని అనేకులకు ఆదరణనిచ్చేవారినిగా మమ్మును మార్చుమని యేసు ప్రభువు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000