Loading...
Paul Dhinakaran

దేవుడు నిన్ను ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు!

Dr. Paul Dhinakaran
01 Jun
నా ప్రియమైన స్నేహితులారా, ఈ నూతన మాసములో అడుగుపెట్టిన నేడు ఈ సందేశము చదువుచున్న మీకు ఈ నెల సమృద్ధియైన మాసం. ఈ నెల వాగ్దానంగా యెషయా 52:13 నుండి ఎన్నుకొనబడినది. చూడండి, " ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహా ఘనుడుగా ఎంచబడును.'' ఈ వాగ్దానం ద్వారా యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఎన్నో సంవత్సరాల క్రితమే, ఆయనను గురించి చెప్పబడింది. మొదటిగా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రజలందరికి సేవకుడిగా ఉండెను. అవును, ప్రభువు ప్రజలందరికి సేవ చేయడానికి తనను తాను సేవకునిగా తగ్గించుకున్నాడు మరియు సిలువపై ఆయన ఈ లోకాన్ని జయించి ఇహలోకపు అధికారాలన్నిటిపై విజయంను సాధించాడు, తద్వారా ఆయన బిడ్డలమైన మనం కూడా ఈ లోకాన్ని జయించగలము.

రెండవదిగా, ప్రభువు సిలువపై పైకెత్తబడ్డాడు. యోహాను 12:32లో, మరియు " నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.'' అవును, ఆయన చేసిన ఒక త్యాగం వలన పైకెత్తబడ్డాడు మరియు దాని ద్వారా ఆయన ప్రజలందరినీ తన వైపునకు ఆకర్షించుకున్నాడు. ప్రజలు తమ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు ఆయన చేసిన త్యాగం ప్రజలను గొప్ప స్థాయికి హెచ్చిస్తుంది. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువునకు అప్పగించుకున్నారా? లేకపోతే, ఈరోజే చేయండి మరియు ప్రభువు మిమ్మల్ని ఈ లోకములో ప్రజలందరి యెదుట ఘనులనుగా హెచ్చిస్తాడు.
మూడవదిగా, " తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను '' ( యోహాను 1:12)లో ఉన్నట్లుగా, దేవుడు యేసును అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. తద్వారా, పరలోకములోను మరియు భూమిపై ఉన్న సమస్త అధికారాలు ఆయనకే చెందుతాయి. తద్వారా, ఆయన నామమును విశ్వసించే వారందరూ దేవుని పిల్లలుగా ఎంచబడుదురు. ఇంకా ఆయనను అంగీకరించిన వారందరికి, ఆయన నామాన్ని విశ్వసించిన వారికి, దేవుని పిల్లలుగా మారే అధికారమును ఆయన అనుగ్రహించాడు. ఈ రోజు రక్షణ దినం ప్రియ స్నేహితులారా. యేసు నామాన్ని నమ్మి మీ నోటితో ఒప్పుకున్నారా? అలాగైతే, ప్రభువులా జ్ఞానయుక్తంగా ప్రవర్తించడానికి, మిమ్మును హెచ్చించడానికి మరియు ఉన్నత స్థాయికి చేర్చడానికి దేవుడు మీకు సహాయం చేస్తాడని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాగ్దానం మీ జీవితంలో వందరెట్లు ఫలవంతం కావాలి. ఒకవేళ, నేడు మీరు ఇంతవరకు దీన స్థితిలోనే ఉన్నట్లయితే, ఇప్పుడే మీ జీవితాలను దేవునికి సేవకులుగా సమర్పించుకోండి, మీరు వివేకముగా ప్రవర్తించునట్లు మీరు హెచ్చింపబడి ప్రసిద్ధులై, ఈ నూతన మాసములో మహా ఘనులుగా ఎంచబడుదురు. దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,
 
ఈ నూతన మాసములో అడుగిడిన మాతో నీ వాగ్దానము ద్వారా మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా జీవితాన్ని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాము. యేసుక్రీస్తు మా ప్రభువును ప్రియ రక్షకుడని మేము నమ్ముచున్నాము. ప్రభువు యొక్క ఆశీర్వాదాలు మా జీవితంపై నిలిచి యుండునట్లు చేయుము. ప్రభువా, ఈ లోకములో మేము జ్ఞానయుక్తంగా లేక వివేకముగా ప్రవర్తించుటకు మాకు సహాయము చేయుము. దేవా, ఈ భూమిపై నీ మహిమ కొరకు లేవనెత్తబడాలి, పైకి ఎత్తబడుటకును, ఘనపరచబడుటకును,నీ సేవకులుగా హెచ్చింపబడుటకు నీవు మా ద్వారా బయలుపడునట్లు మమ్మును నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. దేవా, నీ సేవకులము వివేకముగా ప్రవర్తించుటకును, హెచ్చింపబడి ప్రసిద్ధులై, మహా ఘనులుగా ఎంచబడునట్లు సహాయము చేయుము. ఈ మాసమంతయు మాకు ఇటువంటి గొప్ప ధన్యతను అనుగ్రహించి, మమ్మును నీ యొక్క సమృద్ధికరమైన దీవెనలతో నింపుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000