Loading...
Dr. Paul Dhinakaran

మీరు అడుగకముందే మీ ప్రార్థనకు జవాబిస్తాడు!

Dr. Paul Dhinakaran
12 Jul
నా ప్రియులారా, ఈనాడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించక ముందే ఆయన మీ ప్రార్థనలకు జవాబిస్తాడని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేయుచున్నది. అందుకే బైబిలేమంటుందో చూడండి, " వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను '' (యెషయా 65:24) అన్న వచనము ప్రకారము నేడు మీ హృదయములో దేనినిమిత్తము ప్రార్థించుచున్నారో? వాటన్నిటిని దేవుడు మీకంటే ముందుగా ఎరిగి యున్నాడు. ఎందుకంటే, ఆయన హృదయాంతరంగములను పరిశోధించు దేవుడైయున్నాడు. కావుననే, దేవుడు మీ జీవితములో మేలైన ఆశీర్వాదములను ఏవైతే దాచియుంచాడో, వాటన్నిటిని మీరు పొందకుండా ఎవరు కూడ అడ్డుకోలేరు. మీకును మరియు దేవునికి మధ్య సహవాసము లేకుండ వుండవచ్చును. లేకపోతే, మీ యతిక్రమములు, లేక నేరాలు, దోషాలు దేవుని ప్రేమ నుండి మిమ్మును వేరుచేయవచ్చును. కానీ, మీరు ఎప్పుడైతే, దేవునికి మొఱ్ఱపెడతారో, ఆయన నిశ్చయముగా మీ ప్రార్థనకు జవాబిస్తాడు. 

మొట్టమొదటి వ్యోమగామియైన నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలము మీద తనకు నిర్ణయించిన సమయములోనే తాను కాలు మోపాలనుకున్నాడు. అందుకు నాసా కార్యాలయము అతనికి అనుమతివ్వలేదు. ఎందుకంటే, తాను చంద్రునిపై కాలుమోపాలంటే, చంద్రుని ఉపరితలము మీద ఉన్న ఒత్తిడికి తట్టుకొనే శక్తి అతని గుండెకు ఉన్నదో, లేదో అని అతని గుండెను పరీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. అతనిని పరీక్షలు చేసిన తరువాత, అతడు చంద్రుని ఉపరితలముపై కాలు పెట్టడానికి అనుమతిని ఇచ్చారు. ఒక సాధారణమైన మానవుని యొక్క భద్రత పట్ల మరొక మానవుడు ఎంతో శ్రద్ధ వహించినప్పుడు మనలను సృష్టించిన దేవాది దేవుడు మన పట్ల ఇంకా ఎంతో శ్రద్ధ వహిస్తాడని మీరు ఒకసారి ఊహించుకొని చూడండి. 
నా ప్రియులారా, మనము దేవుని మహత్తరమైన కార్యాలను ఎన్నటికిని గ్రహించుకొనలేము. ఎందుకంటే, తన బిడ్డల పట్ల తాను కలిగియున్న సహవాసమును బట్టి, ఆయన వారి పట్ల ఆనందించే దేవుడైయున్నాడు. కనుకనే, ఆయన తనకు మొఱ్ఱపెట్టే తన బిడ్డలైన మీ ప్రార్థనలను విని, మీకు సమస్తమైన మేలులను జరిగించాలని ఆయన ఎంతగానో మీ కొరకు వేచియున్నాడు. మీరు అడుగకముందే మీ అక్కరలన్నియు ఎరిగిన దేవుడు మీ హృదయ వాంఛలను కూడ ఎరిగియున్నాడు. తద్వారా ఆయన మీ ప్రార్థనలకు తప్పకుండ జవాబిస్తాడు. కాబట్టి, " నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవా యందు నమ్మక ముంచుము'' (సామెతలు 3:5) అన్న వచనము ప్రకారము మీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మికయుంచి అడగండి. అవును, మీరు భరించలేని శ్రమల మధ్య ఆయన మీ హృదయానికి బలమును మరియు ధైర్యమును దయచేస్తాడు. దేవుని పట్ల మీకున్న నిరీక్షణను ఎవరు కూడ కదిలించలేరు. ఎందుకంటే, మీరు దేవునినే ఆశ్రయముగాను మరియు కోటగా ఉంచుకొని, ఆయననే నమ్ముకొని యున్నారు గనుకనే, ఆయన మీ ప్రార్థనలకు తప్పకుండా జవాబిచ్చి, మీ ప్రతి అవసరతను తీర్చి మిమ్మును ఆశీర్వదిస్తాడు.
Prayer:
కృపాకనికరములు గలిగిన మా పరలోకపు తండ్రీ, 

నిన్ను స్తుతించుటకును మరియు ఘనపరచుటకును మాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మేము అడగకముందే మా అక్కరలన్నియు ఎరిగిన దేవుడవు. కనుకనే, మేము నీ యందు నమ్మిక యుంచియున్నాము. మా నమ్మకము ఎన్నటికి వ్యర్థము కాకుండా, మా ప్రార్థనలన్నిటికి నీవు మాకు జవాబును దయచేయుము. దేవా, మేము మా స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా, నీ యందు నిరీక్షణ కలిగి జీవించునట్లు మాకు సహాయము చేయుము. మా హృదయాంతరంగములను ఎరిగిన దేవుడవు, నేడు మేము అడగక ముందే మా ప్రార్థనలకు జవాబు దయచేసి, మా జీవితములో సమస్త మేలులను జరిగించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000