Loading...
Dr. Paul Dhinakaran

అసాధ్యమైన దేవుడు!

Dr. Paul Dhinakaran
18 Oct
నా అమూల్యమైన స్నేహితులారా, ఈ రోజు దేవుని వాగ్దానం లూకా 1:37 నుండి ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా, " దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదు. '' అవును, దేవునికి అన్నీ సాధ్యమే. దేవునికి అన్ని విషయాలు ఎలా సాధ్యమవుతాయనే దాని గురించి యేసు మాట్లాడే ముందు, లూకా 18:25,26 లో ఇలా అన్నాడు, " ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటెదూరుట సులభమని చెప్పెను. ఇది వినినవారు ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. ''

ప్రజలు డబ్బు వెంబడి పరుగెత్తి, నేను ధనవంతుడిని కావాలి. నేను సంపదను సంపాదించాలి. నేను ఆస్తులను కలిగి ఉండాలి మరియు ఆ కారణంగా వారు దేవుడి కోసం సమయం ఇవ్వకపోగా, వారు దేవునితో సమయం గడపరు, వారు తమ కుటుంబంతో సమయం గడపరు మరియు వారు ఇతర మనుష్యులను గౌరవించరు, మరియు విలువైన విషయాలు, దుష్టకార్యాలు వారి హృదయంలోకి ప్రవేశిస్తాయి మరియు అత్యధికంగా ధనవంతులుగా ఉన్నప్పటికీ అందులో ఆశీర్వాదం ఉండదు.
అవును, నా ప్రియులారా, అందుకే బైబిల్ సామెతలు 10:22 లో, " యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు. '' కానీ, ప్రజలు ఐశ్వర్యమునిచ్చే ఆశీర్వాదాల కోసం మాత్రమే చూస్తూ, దేవుని కోల్పోతే, వారికి ఆశీర్వాదాలు రావు. వారు ధనవంతులు కావచ్చును. కానీ వారు లోకములోని ఆశీర్వాదాలతో పాటు దేవుని ఎన్నుకోకపోతే, వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. కానీ అప్పుడు శిష్యులు, ఇది వినినవారు ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, " అందుకు యేసు మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. '' అవును, ఆయన, " కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.'' అవన్నియు అనగా, ఆహారం, దుస్తులు, రేపటి దీవెనలు మరియు ప్రతి ఐశ్వర్యం కోసం దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే, మీ ఆత్మ దేవునితో ముడిపడి ఉంటుంది. ఆయన ఐశ్వర్యముతో పాటు ఆయన ఆశీర్వాదాలు కూడా దిగివస్తాయి. అంతమాత్రమే కాదు, మీ ఆత్మ నీతితో నింపబడి ఉంటుంది మరియు మీరు దేవుని చేరుకుంటారు. ఈ రోజు దేవుడు మీకు ఈ కృపను ప్రసాదించుగాక మరియు దేవుడు మీ కొరకు ప్రతిదాన్ని చేస్తూ ఆనందించవచ్చును. కనుక ముందుగా ఆయనను వెదకండి మరియు ఆశీర్వదించబడండి. ఆయన ఇచ్చిన వాగ్దానములు ఎన్నటికి మీ జీవితములో నిరర్థకము కానేరవు. నిశ్చయముగా అవి మీ జీవితములో అద్భుతములను జరిగించి మిమ్మల్ని కాపాడి సంరక్షించును. దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ ప్రభువా,

నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీ మాట ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, నీకు సమస్తము సాధ్యమని మేము నమ్ముచున్నాము. దేవా, నీవు మా సమస్తమును జరిగిస్తావనియు నీవు చేసిన వాగ్దానానికై నీకు వందనములు. దేవా, అన్నింటికంటే ముందుగా నిన్ను మరియు నీ నీతిని రాజ్యాన్ని వెదకడానికి మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, నీ ఆశీర్వాదమే మాకు ఐశ్వర్యమిచ్చునట్లుగా చేయుము.ప్రభువా, నీవు మా పట్ల ఇచ్చిన ప్రతి మాట నిరర్థకము కాదని మేము నమ్మునట్లును, మాలో అపనమ్మకము కలుగకుండా ఉండునట్లును మాకు సహాయము చేయుము. దేవా, ఈ లోకములో మాకు కావలసిన వన్నియు నీవు మాకు అనుగ్రహిస్తావని మేము విశ్వసించుచున్నాము. దేవా, మా నమ్మకాన్ని విడిచిపెట్టకుండా, మాకు అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. దేవా, మా ఆత్మ నీ నీతితో నింపబడునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000