Loading...
Samuel Paul Dhinakaran

దయగల దేవుడు!

Samuel Dhinakaran
26 Nov
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని దేవుడు కరుణింపవలెనని మీ యొద్దకు వచ్చి నిలువబడియున్నాడు.ఈరోజు దేవుని వాగ్దానాన్ని తెలుసుకోవాలని మీరు ఆసక్తిగా ఉన్నారా? ఈ రోజు కోసం దేవుని వాగ్దానంగా బైబిల్‌లో యెషయా 30:18 వ వచనమును ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా, " కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరు ధన్యులు '' అన్న వచనము ప్రకారము అయినప్పటికి యెహోవా మీ పట్ల దయ చూపాలని కోరుకుంటున్నాడు; అందుచేత ఆయన మీకు కనికరం చూపడానికి ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకంటే, యెహోవా న్యాయం చేసే దేవుడు. ఆయన కోసం ఎదురుచూసే వారందరూ ధన్యులు! అవును, నిజంగా దేవుడు తన కృపను మీపై చూపించాలని ఆయన మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా,ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీరు ఉన్నత స్థానాల్లో ఉండవచ్చును, అక్కడ మీరు ఒంటరిగా ఉండవచ్చును, మీరు అన్యాయాన్ని ఎదుర్కొంటూ ఉండవచ్చును, మీకు ద్రోహం చేస్తున్న వారితో మీరు పోరాడుతూ ఉండవచ్చును, దాని గురించి మీ హృదయం విరుచుకుపడవచ్చు ను, మీరు అక్కడ చాలా యుద్ధాలను ఎదుర్కొంటూ ఉండవచ్చును. ఒంటరిగా, సహాయం కోసం వెదకుచున్నాను కానీ ఎవరూ మీకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు మరియు మీరు ఈ పరిస్థితిలో నేను ఏమి చేయగలను? అని మూలన పడవచ్చును. కానీ క్రింది వచనం యెషయా 30:19లో, " సీయోనులో యెరూషలేములోనే యొక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు ఆయన నీ మొఱ్ఱ విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. '' దేవుడు మీ పట్ల దయ చూపాలని, మీ పట్ల కనికరం చూపాలని ఎదురుచూస్తున్నందున ఇక ఏడవవు అని చెబుతోంది. ఆయన మీ గురించి ఆలోచిస్తున్నందున, ఆయన సహాయం చేయగలడు నా ప్రియ స్నేహితులారా.
నా ప్రియులారా, ఈ క్షణాన్ని దేవునికి అనుమతించండి మరియు ఆయన తన కనికరముతో మీ యొద్దకు వస్తాడు. ఈ దుఃఖాన్ని జయించి, మీకు ఒక మార్గం చూపుతాడు. బైబిల్‌లో, లక్షలాది మంది ఇశ్రాయేలీయులకు నాయకుడైన మోషే వారిని ఎర్ర సముద్రం వైపు నడిపించినప్పుడు, ఐగుప్తీయులు వారి వెనుక ఉండి, వారిని చంపడానికి మరియు నాశనం చేయడానికి వెంబడించారు. వాళ్ళు కూడా మూలన పడ్డారు. వారికి మార్గం లేకపోయింది. మోషే ప్రభువుకు మొరపెట్టాడు మరియు ప్రభువు నిర్గమకాండము 14:15-16లో ఇలా అన్నాడు, " అంతలో యెహోవా మోషేతో నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు. '' అవును, ' నేను నిన్ను సముద్రం మధ్యలో నడిచేలా చేస్తాను ' అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మార్గం లేని చోట, దేవుని శక్తి వచ్చి మీ కోసం నూతన మార్గాన్ని సృష్టిస్తుంది. అది దేవుని శక్తి మరియు ఈ రోజు, ఆయన తన దయను మీకు చూపుతాడు. సంతోషించండి మరియు ఆయన సహాయాన్ని పొందుకొనండి నా ప్రియ స్నేహితులారా.
Prayer:
ప్రేమా కనికరము కలిగిన మా పరలోకమందున్న తండ్రీ,

పభువైన యేసు, నీవు మా నిమిత్తము నిందలను, బాధలు మరియు అవమానములను ఎదుర్కొన్నందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. యేసయ్యా, మేము స్వస్థత పొందటానికి నీవు గాయపడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు ఎప్పటికీ మమ్మల్ని మరచిపోలేవనియు మరియు నీ గాయపడిన హస్తాల ద్వారా మమ్మల్ని స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నావని నీ వాగ్దానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, నీ స్వస్థత యొక్క స్పర్శను మేము పొందాలనుకుంటున్నాము. నీ ప్రేమగల స్పర్శ మా హృదయాన్ని, మా శరీరాన్ని స్వస్థతపరచునట్లు చేయుము. దేవా, నీ యొక్క స్వస్థతా శక్తి ద్వారా నేను అనేకులకు సాక్షిగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000