Loading...
Dr. Paul Dhinakaran

పుట్టినది మొదలుకొని నేటి వరకును మిమ్మల్ని పోషించే దేవుడు!

Dr. Paul Dhinakaran
24 Nov
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ప్రభువు పోషించాలని మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. మీ పరలోకపు తండ్రి యొక్క మంచి యీవులను అనుగ్రహించే చక్కటి వాగ్దానంపై మీ దృష్టిని ఉంచండి, " మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన యెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యావుల నియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యావుల నిచ్చును '' (మత్తయి 7: 9-11) అన్న వచనముల ప్రకారము మీ పరలోకపు తండ్రి మీకు మంచి యీవులను ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. మీ గొఱ్ఱెల కాపరియైన దేవుడు ఈనాటి మీ జీవితాంతము మిమ్మల్ని పోషిస్తాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ...ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు '' (ఆదికాండము 48:15) అన్న వచనము ప్రకారము ఆయన మిమ్మల్ని పోషించి, తన నీతి మార్గంలో నడిపిస్తాడు.

ఒక యువకుడు తన చిన్న కొడుకును కిండర్ గార్డెన్ వద్ద వదిలివేసి తన కారులో పనికి వెళ్ళాడు. అకస్మాత్తుగా, తన కుటుంబ సభ్యుల రక్షణ మరియు కాపుదల కోసం ప్రార్థించమని పరిశుద్ధాత్మ అతనిని ఎంతగానో ప్రేరేపించినది. అందువల్లన, అతడు విశ్వాసముతో నింపబడి, ఒప్పుకోలు చేయుచు, తన కుటుంబము కొరకు ప్రార్థించుటకు మొదలు పెట్టాడు మరియు బిగ్గరగా ఇలా అన్నాడు, " ప్రభువా, మాకు విరోధముగా ఏర్పడబోవుచున్న ఏ ఆయుధమూ వర్థిల్లదు. మా కుటుంబము మరియు యింటి చుట్టు ఏ కీడు రాకుండా కాపాడుము. మా రాకపోకల యందును మరియు మేము లోపలికి వచ్చునప్పుడును, బయటికి వెళ్లునప్పుడును మమ్మల్ని, మా కుటుంబ సభ్యులను ఆశీర్వదించుము. ఎందుకంటే, మేము నివసించుచున్న మా యింటి చుట్టు ఏ కీడు రాకుండా కాపాడుము. నీ కృప మమ్మల్ని ఒక కంచె వలె ఆవరించునట్లు చేయుము '' అని ప్రార్థించాడు. ఆ క్షణంలోనే, వారి పెద్ద కొడుకును పాఠశాలకు తీసుకొని వెళ్తున్న అతని భార్య తన కారును వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక వాహనం ద్వారా ఆ కారు నలగొట్టబడినది. ఆ వాహనం ఎంతో వేగంతో వచ్చుట ద్వారా, కారు బోల్తా పడి, రద్దిగా ఉన్న రహదారిపై అదుపులేకుండా విసిరివేయబడినది. ఆమెకు ఈ భూమి అక్షరాలా తలక్రిందులుగా ఉండటంతో, ఆమె ' యేసు! యేసు! ' అని కేకలు పెట్టింది. వారిద్దరూ నలగొట్టబడిన ఆ వాహనము నుండి క్షేమంగా మరియు శాంతితో కప్పబడి ఉండి బయటకు వచ్చారు. అవును, వారు ఘోరమైన ప్రమాదం నుండి ఎటువంటి గాయాలు తగలకుండా బయటపడి నడిచి వెళ్లుట, ఆ మార్గమున వెళ్లుచున్న వారందరూ వారిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. హల్లెలూయా!
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు యేసు ప్రభువు ఒక మంచి కాపరిగా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. ఆయన తన వాక్ శక్తితో ఆ కుటుంబాన్ని ఎంత చక్కగా రక్షించియున్నాడు కదా! కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఈ రోజును ఎదుర్కోలేకపోవచ్చును, అయితే, మీరు ఆయన మంచితనం మరియు విశ్వసనీయతపై నమ్మకం ఉంచండి, ఇది మీ యొక్క కఠినమైన పరిస్థితులన్నిటిలలోను మీరు ముందుకు వెళ్లునట్లు చేస్తుంది. ఆయన మిమ్మల్ని ప్రేరేపిస్తాడు మరియు ఆశీర్వాదం మరియు రక్షణ మార్గాల్లో మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు ఎక్కడైతే, లోటును అనుభవించుచున్నారో, అక్కడ మిమ్మల్ని సమృద్ధిగా తోడుకొని వెళతాడు. మీ గమ్యము చేరడానికి ఆయన మీ మార్గంలో మీకు ముందుగా తన దేవదూతలను పంపుతాడు. ఆయన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి మీకు ప్రజలతో దైవిక సంబంధాలు కలిగి ఉండునట్లు చేస్తాడు. మీ చేతులను ఆయనతో కలిపి,ఈ జీవిత ప్రయాణంలో గమ్యము చేరుటకు సంతోషంగా ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
Prayer:
కృపకు పాత్రుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

ప్రేమగల ప్రభువైన యేసు! నీవు మా గొఱ్ఱెల కాపరివై యున్నందుకు నిన్ను స్తుతించుచున్నాము. ఈ రోజు నీ అద్భుతమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించుము. మా పట్ల నీ ఉద్దేశము ఏమైయున్నదో మాకు తెలియదు. కానీ నీవు మాతో కూడ ఉన్నావని మేము గుర్తెరుగుచున్నాము. యెహోవా నీవు మా కాపరిగా ఉన్నందున మాకు లేమి కలుగకుండ చేయుము. పచ్చికగల చోట్లను నీవు మమ్మల్ని పరుండజేయుము. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించుము. మమ్మల్ని క్రిందికి లాగే ప్రతి కఠినమైన పరిస్థితులను మా నుండి తొలగించుము. మా అవసరతలన్నిటిని తొలగించి, మమ్మల్ని నిత్యము సమృద్ధితో పోషించుము. మా మార్గమున నీవు బాధ్యతను వహించుము. నీవు మా కాపరి కావుననే, మాకు ఎటువంటి కొరత ఉండదని మేము విశ్వసించుచున్నాము. మేము వెళ్లు కఠినమైన మార్గములలో నీవు మాకు ముందుగా నీ దూతలను పంపించి, మమ్మల్ని కాపాడి సంరక్షించుము. మాకు మరియు మా కుటుంబమునకు రూపింపబడు యే ఆయుధము వర్థిల్లకుండా జేయుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000