Loading...
Dr. Paul Dhinakaran

మిమ్మును రక్షించి, విడిపించుటకు తోడైయున్న దేవుడు!

Dr. Paul Dhinakaran
04 Aug
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అనేక సమస్యలతో పోరాడుచు, ఈ సమస్యల నుండి విడిపించుటకు ఎవరున్నారు? ఎవరి దగ్గరకు వెళ్లాలని చింతించుచున్నారా? మన పరలోకపు పరమ తండ్రి మిమ్మును విడిపిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును '' (యిర్మీయా 15:20) అన్న వచనము ప్రకారము, అవును, అనాదికాలములలో ఆయన మనకు తోడైయున్నాడు. ఆయన చేతిలో నుండి మనలను విడిపించగలవాడెవడు. ఆయన ఒక పనిచేసినప్పుడు ఎవరు దానిని మర్చగలరు? అని బైబిల్ మనకు తెలియజేయుచున్నది. ఆలాగుననే, యేసుక్రీస్తు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకమునకు దిగివచ్చాడు. కాబట్టి, మీరు మీ చెడు కార్యాలను విడిచిపెట్టి, దేవుని ప్రేమ వైపునకు మరలి రండి. దేవుడు మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానము చేయుచున్నాడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు మరియు తన దైవీకమైన ఆనందముతోను మరియు శాంతితోను నింపుతాడు. 

25 సంవత్సరముల క్రితం జరిగిన ఒక సంఘటనను నేను గుర్తుకు తెచ్చుకుంటున్నాను. కార్యాలయములో ఒక ముఖ్యమైన పని ఉన్నందున నేను అత్యవసరముగా ఆఫీసుకు వెళ్లవలసి వచ్చినది. నేను ఎంతో వేగముగా వాహనము నడుపుచూ, ట్రాఫిక్ సిగ్నల్ దాటుకొని వెళ్లవలసి వచ్చినది. వెంటనే, అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసు నాకు వ్యతిరేకముగా కేసు దాఖలు చేసి, " ఎవరు నీవు? '' అని నన్ను ప్రశ్నించుటకు మొదలు పెట్టాడు. వెంటనే నేను సహోదరులు డి.జి.యస్. దినకరన్ గారి కొడుకును అని చెప్పాను. ఆ మాటలు విన్న అతడు ఆశ్చర్యమొంది, నా మీద దాఖలు చేసిన కేసును వెనుకకు తీసుకున్నాడు. తన ఉద్యోగము కొరకు చేసిన ప్రార్థన మరియు అతడు మరణము నుండి కాపాడబడుటకు మా నాన్నగారు చేసిన ప్రార్థనను గుర్తుచేసుకొని, నా తండ్రిగారి నిమిత్తము నన్ను విడిచిపెట్టునట్లుగా నాతో చెప్పి, నన్ను విడిచిపెట్టెను. నా తండ్రిగారి ద్వారా నేను కాపాడబడ్డాను. అదేవిధముగా, మన పరలోకపు తండ్రి, మనకు కలుగు అపాయముల నుండి మనలను కాపాడుతాడు. మరియు అపవాది బంధకాల నుండి మనలను విడుదల చేస్తాడు.
కాబట్టి, నా ప్రియులారా, మనము ఎంత గొప్ప దేవునిని కలిగియున్నామో కదా! మన కాలు జారకుండునట్లు, ఆయన మన పట్ల జాగ్రత్త వహిస్తు, మన పాదములు తడబడకుండునట్లు మనలను కాపాడి సంరక్షిస్తున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును '' (కీర్తనలు 121:7) అన్న వచనము ప్రకారము ఏ అపాయము రాకుండా ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ఈ లోకము యొక్క దుష్టత్వము నుండి మిమ్మును విడిపించి, కాపాడి సంరక్షిస్తాడు. కాబట్టి, మీరు ఈ లోకములో ఉన్న దానినంతటిని విడిచి దేవుని వైపునకు తిరగండి, " ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? '' (మార్కు 8:36) అన్న వచనము ప్రకారము మీరు ఈ లోకములో సమస్తాన్ని సంపాదించుకొని మీ ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే, మీకేమి ప్రయోజనము. మీ ప్రాణము కాపాడబడాలంటే, మీరు దేవుని యొద్దకు రావాలి. కారణము, ఆయన మీ మీద ప్రేమకలిగియున్నాడు, మీ విలువైన ప్రాణమును ఈలోక దుష్టత్వము నుండి కాపాడి రక్షించాలని మీ పట్ల ఆసక్తి చూపుతున్నాడు. కనుకనే, మీ మార్గములను దేవునికి అప్పగించండి. ' మీ మార్గమును యెహోవాకు అప్పగింపుము మీరు ఆయనను నమ్ముకొనుము ఆయన మీ కార్యములను నెరవేర్చి, మీ సమస్త కార్యములలో ఆయన మీకు తోడుగా ఉండి, మీ వ్యాధుల నుండి మిమ్మును విడిపించి, మీ ప్రాణమును రక్షించి, పరవశింపజేస్తాడు. 
Prayer:
ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మా ప్రాణమును కాపాడి సంరక్షించుటకు నీ చేతులకు మమ్మును అప్పగించుకొనుచున్నాము. దేవా, నీవు లేకుండ మేము ఈ లోకములో జీవించలేము. మేము ఈ లోకమునంతయు సంపాదించుకొని మా ప్రాణమును పోగొట్టుకొంటే, మాకేమి ప్రయోజనము కాబట్టి, దయతో మా ప్రాణమును ఈ లోక దుష్టత్వము నుండి తప్పించి, మా పాదములు జారకుండునట్లు, మమ్మును కాపాడి, సంరక్షించుము. నీవు మా పట్ల చూపుతున్న జాగ్రత్త, ప్రేమను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. మా ప్రమాదాల నుండియు, మా వ్యాధుల నుండి మమ్మును విడిపించి, రక్షించుటకు నీవు మాకు నిత్యము తోడైయుండి కాపాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్

1800 425 7755 / 044-33 999 000