Loading...
Stella dhinakaran

దేవుడు ఇచ్చిన సంపద మరియు ఆశీర్వాదాలు!

Sis. Stella Dhinakaran
20 May
నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నేను మీకు శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు మనం సామెతలు 10:22 నుండి వచ్చిన వాగ్దాన వచనాన్ని ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు'' అని చెప్పబడియున్నది. ఇంకను మీరు ఆదికాండము 24:1ని చదివినట్లయితే, " అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను'' అని బైబిలు చెబుతుంది. మరియు " మీ తండ్రియైన అబ్రాహాము సంగతి ఆలోచించుడి మిమ్మును కనిన శారాను ఆలోచించుడి అతడు ఒంటరియై యుండగా నేను అతని పిలిచితిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది యగునట్లు చేసితిని'' (యెషయా 51:2) అని చెప్పబడియున్నది.

నా ప్రియులారా, ఇంకను మీరు ఆదికాండము 17:4-5 చదివినట్లయితే, " అబ్రాము సాగిలపడి యుండగా దేవుడతనితో మాటలాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు. మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.'' అబ్రాహాముకు ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేరు. కానీ మీరు రోమీయులకు 4:17 చదివినట్లయితే, " తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.''
అబ్రాహాము నూరు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతీంద్రియ మార్గంలో ఇస్సాకు అనే కుమారునితో ఆశీర్వదించబడ్డాడు. అవును, నా ప్రియులారా, మనకు కూడా మన జీవితంలో వివిధ రకాల సమస్యలు ఉండవచ్చును. కానీ, " కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు '' (కీర్తనలు 121: 1-2) అను వచనముల ప్రకారం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. నా జీవితంలో కూడా, నేను అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్నాను, కానీ నేను సిలువ వైపు చూచుచున్నాను మరియు దేవుడు నా పరిస్థితిని మార్చి నన్ను ఆశీర్వదించాడు. " నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధిగలచోటికి మమ్ము రప్పించి యున్నావు '' (కీర్తనలు 66:12) అని చెబుతుంది. మరియు " పేరాసగలవాడు కలహమును రేపును యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును'' (సామెతలు 28:25) లో ప్రభువునందు నమ్మకముంచువారు వర్ధిల్లుతారని కూడా చెబుతుంది. దేవుడు మీకు ఈ లోక ఆశీర్వాదాలను మాత్రమే ఇవ్వడు. కానీ, " మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను'' (ఎఫెసీయులకు 1:3) ప్రకారం ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను కూడా ఇస్తాడు. " సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు'' (కీర్తనలు 34:10) ప్రకారం కాబట్టి, నా ప్రియులారా నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువు వైపు చూడండి మరియు మీ పూర్ణ హృదయంతో ఆయనను వెదకండి. ఎందుకంటే, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, కానీ ప్రభువును వెదకువారికి ఆయన ఏ మేలు కొదువ చేయడని చెప్పబడియున్నది. అవును, ఈ వాగ్దానాల ప్రకారం దేవుడు మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. సంతోషించండి మరియు ప్రభువుచే ఆశీర్వదించబడండి. ఆయన ఆశీర్వాదము మీకు ఐశ్వర్యమిచ్చునట్లుగా, దేవుడు సమస్త మేలులతో మిమ్మును వర్థిల్లజేస్తాడు.
Prayer:
ఆశీర్వాదములకు కర్తవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు. దేవా, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మా అవసరమైన సమస్త సహాయం కోసం మేము నీ వైపు చూస్తున్నాము. దేవా, మా హృదయ కోరికలు మరియు మాకు కావలసినవన్నీ నీకు తెలుసు. దేవా, నీ హస్తము మమ్మును ఆశీర్వదించునట్లుగాను మరియు నీ మహిమ కొరకు నీకు సాక్ష్యముగా ఉండుటకు మేము కోరినదంతా మాకు అనుగ్రహించుము. సమస్త మహిమ ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ నీకే చెల్లించుచున్నాము. ప్రభువా, నీ ఆశీర్వాదమే మాకు ఐశ్వర్యమును ఇచ్చునట్లుగా మాకు సమృద్ధియైన దీవెనలను కుమ్మరించుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యేసు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000