Loading...
Evangeline Paul Dhinakaran

మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదకండి!

Sis. Evangeline Paul Dhinakaran
24 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెదకాలి. కానీ, కష్ట సమయాలలో మనుష్యుల సహాయమును వెదకకూడదు. విూరు ఆయన రాజ్యమును నీతిని మొదట వె దకాలి. ఆహారము, గృహము, వస్త్రములు, ఈ లోక జీవితములో ఆనందమును ఇస్తాయి. కానీ, దేవుని నీతిని యథార్థతను కోరుకునే ఏ ప్రయత్నమైనా ఆధ్యాత్మిక సుసంపన్నతను అనుగ్రహించడమే కాక, మీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని పునరుద్ధరించును. " అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తుయేసునందున్నారు '' (1 కొరింథీయులకు 1:30) అన్న వచనము ప్రకారము మీరు దేవుని మూలముగా క్రీస్తులో ఉన్నామని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. " యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును '' (కీర్తనలు 1:2,3) అన్న వచనముల ప్రకారము మీరు దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారాను, విశ్వాసంతో ప్రార్థన చేయుట యందును మరియు మీరు చేసే పనులన్నిటిలోను దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే, ప్రతిదానిలోను మీరు అభివృద్ధి చెందుతారు. " యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును '' (యిర్మీయా 17:7) అన్న వచనము ప్రకారము దేవుని నమ్ముకొని ధన్యతను పొందుకొనండి. అటువంటి ధన్యతను పొందుకొనిన ఒక సహోదరి యొక్క సాక్ష్యమును మీ విశ్వాసము కొరకు. జార్ఖండ్ (భారతదేశం)లోని రాంచీకి చెందిన డాక్టర్. నీలిమా హెరాన్స్, ఆమె దేవునికి తన జీవితములో మొదటి స్థానము ఇవ్వడం ద్వారా ఆమె ఎలా సమృద్ధిగా ఆశీర్వదించబడినదో, దానిని గురించి ఆమె తన అనుభవాన్ని పంచుకొన్న సాక్ష్యమును ఈ క్రింద చదవండి.

జార్ఖండ్‌లోని రాంచీ అను ప్రాంతమునకు చెందిన ప్రియ సహోదరి డాక్టర్. నీలిమా హెరాన్స్, పరిశుద్ధాత్మ అనుగ్రహించు సంతోషమును పొందుకొనిన విధమును మరియు తద్వారా వారు పొందుకొనిన సుగుణములను గూర్చి చెప్పిన సాక్ష్యము... " యేసు పిలుచుచున్నాడు బిలాయి ప్రార్థన ఉత్సవములో నేను పాల్గొన్నాను. సహోదరి ఇవాంజెలిన్ పాల్ దినకరన్ గారు సందేశమును అందించి, ప్రార్థన సమయములో పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనమని చెప్పినప్పుడు, నేను పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవమును మొదటిసారిగా పొందుకొని ఆనందించాను. అంతేగాక, ఒక చల్లటి గాలి నా మీద వీచినట్లుగా అనుభూతి చెందాను. మరియు అన్య భాషలు మాటలాడు అద్భుతమైన అనుభవమును కూడ పొందుకొన్నాను. ఆనాటి నుండి నా జీవితము మారిపోయింది. " యేసు పిలుచుచున్నాడు '' రాంచీ స్వచ్చందముగా సేవ చేయుటకును, ఎస్తేరు ప్రార్థన బృందమును ప్రారంభించుటకును మరియు యేసు పిలుచుచున్నాడు అంబాసిడర్‌గాను పరిచర్య చేయుటకు దేవుడు కృపననుగ్రహించాడు. నా ఇద్దరరు కుమార్తెలు కారుణ్యలో చదువుకొనే భాగ్యము లభించింది. మంచి గృహము లేక చాలా కష్టపడ్డాము. అదే దినమున నా భర్త పనిచేయుచున్న కార్యాలయములోనే సిబ్బంధి నివసించుటకు క్వార్టర్స్‌ను ప్రభువు మాకు సిద్ధపరిచాడు. తద్వారా, మేము ఎంతో ఆనందించాము. మరియు రాంచీ స్త్రీల కళాశాలలో పనిచేయుచున్న నేను, ఉత్తమ అధ్యాపకురాలు బిరుదును పొందుకొని మా డిపార్ట్‌మెంట్ హెడ్‌గా నియమించబడుకు మరియు డీన్‌గా పదోన్నతి పొందుటకు ప్రభువు నాకు అటువంటి గొప్ప కృపను అనుగ్రహించాడు. మా కళాశాలలోని పిల్లలకును అధ్యాపకులకును ప్రార్థించే అవకాశమును దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ విధంగా ఇహలోకపు మరియు ఆత్మీయ ఆశీర్వాదములతోను సంతోషముతోను దేవుడు మా కుటుంబమును అత్యధికముగా నింపియున్నాడు. దేవునికే స్తోత్రము.
నా ప్రియులారా, ఆమె పట్ల అద్భుతమును చేసి, సమాధానమును అనుగ్రహించిన ప్రభువైన యేసు తాను పంపించిన పరిశుద్ధాత్మ ద్వారా మీ బాధల నుండి మిమ్మును విడిపించి, మీకు సమాధానమును సంతోషమును అనుగ్రహించును. " అయ్యో నాకు విశ్వాసము లేదు, నిరీక్షణ లేదు '' అని మీరు చింతించవచ్చును. ప్రభువు మీ విశ్వాసమును వృద్ధిపరచును. సమస్తమును సంపూర్ణముగా నింపే ప్రభువు మిమ్మును కూడ తన పరిశుద్ధాత్మతో నింపును. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమస్తమును బోధించి, సంతోషముగా జీవించుటకు కృపను అనుగ్రహించును. అందుకే బైబిలేమంటుందో చూడండి, " కాబట్టి విూరు ఆయన రాజ్యమును నీతిని మొదట వె దకుడి; అప్పుడవన్నియు విూకనుగ్రహింపబడును '' (మత్తయి 6:33) అన్న వచనము ప్రకారము మీరు దేవునికి మొదటి స్థానం ఇచ్చేవరకు విధేయత యొక్క సంపూర్ణ ప్రతిఫలం మీకు ఎన్నటికిని గుర్తించలేరు. ఆయన మీద నమ్మకాన్ని కలిగించే వాగ్దానం, " ఐశ్వర్య ఘనతలును స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి '' (సామెతలు 8:18) అన్న వచనము ప్రకారము మీకు ఘనతను ఇచ్చి, కిరీటమును ధరింపజేస్తాడు. మీ జీవితము, కుటుంబము దేవుని యొక్క అధికారము క్రింద ఉన్నదా? అని పరిశీలించుకొనండి. సమస్త ఆశీర్వాదాలు గుప్తములై యున్న దేవుని వద్దకు రండి. మీ ఆందోళనలు మరియు భయములన్నిటిని విడిచిపెట్టి, ఆయనను మీ పూర్ణ హృదయముతో వెదకండి, ఆయన వాగ్దానము చేసినట్లుగానే, మీరేమి అడిగినను, అవన్నియు మీకు సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు.
Prayer:
కృపగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప కృపకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మేము ఈ లోకములో ఉన్నవాటిని గానీ, మనుష్యులను గానీ వెదకకుండా, నిన్ను నిత్యము వెదకుటకు మాకు అటువంటి కృపను దయచేయుము. ప్రభువా, మా నమ్మకము మనుష్యుల మీద ఉన్నట్లయితే, ఇప్పుడే మమ్మల్ని క్షమించి, నీ నామ మహిమార్థమై మమ్మల్ని వాడుకొనుము. దేవా, మొదట నీ నీతిని రాజ్యమును వెదకుటకు మాకు సహాయము చేయుము. మా అవసరతలన్నియు క్రీస్తు యేసులో తీర్చబడునట్లు మాకు కృపను అనుగ్రహించుము. దేవా, మా చింతలను మరియు ఆందోళనలను నీ మీద వేయుచున్నాము. నీవు మాకు విడుదలను మరియు స్వస్థతను అనుగ్రహించి, ఆనందకరమైన మరియు సమృద్ధికరమైన జీవితమును దయచేసి, మమ్ములను పరవశింపజేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000