Loading...
Stella dhinakaran

ఎన్నటికిని నిరర్థకము కానేరని దేవుని మాటలు!

Sis. Stella Dhinakaran
17 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితములో దేవుడు వాగ్దానము చేసిన ఏ మాట కూడ నిరర్థకముకాదని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. మానవులుగా ఉన్న మనం కొన్నిసార్లు మన సామర్థ్యాలను ఒక పరిమితం చేసుకుంటాము. అందువలన, మనం కొన్ని క్లిష్టమైన పరిస్థితులను తీవ్రంగా ఎదుర్కొన్నప్పుడు, వాటిని జయించుటకు ప్రయత్నించకుండా, వాటిని జీవితంలో ఒక భాగంగా అంగీకరించాలని నిర్ణయించుకుంటాము. ఏది ఏమైనా, ఈ రోజు, మీ కోసం దేవుని వాగ్దానాన్ని ఒకటి నేను గుర్తు చేస్తున్నాను, అన్నిటిలోను మరియు అందరిపై ఆధిపత్యం వహించే అధికారమును మరియు మీ ఆశీర్వాదాలను దొంగిలించడానికి, హత్యచేయడానికి లేదా నాశనం చేయడానికి వచ్చుచున్న అపవాదిని మీరు మీ జీవితములోనికి అనుమతించవద్దు. యేసు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, " నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను '' (మార్కు 16:17-18) అన్న వచనము ప్రకారము దేవుని వాగ్దానములను నమ్మండి. ఆలాగున పొందుకొనిన శ్రీమతి విమల, ఈ క్రింద భాగములో ఆమె పొందుకున్న

" నేను జ్వరంతో ఎంతగానో బాధపడ్డాను. కానీ, నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు, అక్కడ వైద్యులు నన్ను పరీక్షించి, నాకు కొన్ని మందులు ఇచ్చారు. కానీ మరుసటి రోజు, నా కాళ్ళు వాపు వలన, నేను నడవలేకపోయాను. అలాగే, నేను మూత్రం సరిగ్గా విసర్జన చేయలేక ఎంతగానో బాధపడ్డాను. నన్ను మరల ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు, నా మూత్రపిండాలు బాధింపబడినవని, వారు నన్ను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చాలని చెప్పారు. రోజులు గడిచే కొలది, నా పరిస్థితి క్షీణించింది మరియు చివరికి, నేను మంచం పట్టాను. చివరగా, నన్ను కాపాడలేరని వైద్యులు తెలియజేశారు. అదియుగాక, చికిత్స ఖర్చు తగ్గించడానికి నన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వారు సలహా ఇచ్చారు. వెంటనే, నా పిల్లలు నన్ను అక్కడికి తీసుకెళ్లారు మరియు నేను బ్రతకనని అక్కడ ఉన్న వైద్యులు తెలియజేశారు. చివరికి నాలో ఉన్న చివరి ఆశ కూడ అడియాశలుగా మారిపోయాయి. చేసేది ఏమి లేక, నన్ను తిరిగి మా ఇంటికి తీసుకువచ్చారు. ఇంట్లో, ఒక రోజు, వేదనతో నా మంచం మీద పడుకుని, నేను యేసు పిలుచుచున్నాడు టెలివిజన్ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు ఆ కార్యక్రమములో సహోదరి స్టెల్లా దినకరన్‌గారు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు నేను కూడా ఆమెతో కలిసి కన్నీళ్లతో ప్రార్థనలో ఏకీభవించాను. ఎంత అద్భుతం! ప్రార్థన ముగిసిన వెంటనే, నేను మూత్ర విసర్జన చేయుటకు ప్రారంభించాను. నా కాళ్ళలో వాపు మాయమై, నేను లేచి చక్కగా నడుచుటకు మొదలు పెట్టాను. నేను కూడ ఒక ఉద్యోగమును చేయుటకు మొదలు పెట్టాను. నాకు అద్భుతమైన స్వస్థతను అనుగ్రహించి, నా జీవితాన్ని పునరుద్ధరించిన ప్రభువైన యేసుకు సమస్త మహిమ కలుగును గాక. ''
నా ప్రియులారా, మన దేవుడు ఎంత మంచివాడు! నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మానవ జ్ఞానం మరియు అవకాశాల చేజారినప్పుడు జీవితము చివరి దశకు చేరుకున్నప్పుడు భయపడకండి, దేవునికి సమస్తము సాధ్యమే. " దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్థకము కానేరదు '' (లూకా 1:37) అను వచనము గుర్తుంచుకోండి. అరణ్యములో ఇశ్రాయేలీయుల కోసం మన్నా మరియు పూరేడులు కురిపించిన దేవుడు; బండ నుండి నీళ్లు ఇచ్చిన దేవుడు; ఎఱ్ఱ సముద్రం రెండుగా పాయలు చేసిన దేవుడు, అద్భుతం యొక్క నూతన తలుపు తెరవడానికి మీకు ముందుగా వెళ్లుచున్నాడు. మీరు సజీవముగా జీవించాలి మరియు ఆయన యొక్క అద్భుతమైన కార్యాలను గురించి వివరించాలి. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కృతజ్ఞతాస్తుతులతోను మరియు పాటలతో నింపబడండి ఆయనను గట్టిగా పట్టుకొనండి. ఆయన ఇచ్చిన వాగ్దానమును ఎన్నటికి మీ జీవితములో నిరర్థకము కానేరవు. నిశ్చయముగా అవి మీ జీవితములో అద్భుతములను జరిగించి మిమ్మల్ని కాపాడి సంరక్షించును. కాబట్టి, మన దేవుడు మీ పట్ల ఏమైతే ఈనాడు వాగ్దానము చేసియున్నాడో,  మీరు ఆయన మాటల యందు నమ్మకముంచి, ఆ వాగ్దానములు మరియు ప్రవచనములు నెరవేరువరకు దేవుని పాదసన్నిధిలో వేచియున్నట్లయితే, ఆయన తప్పకుండా తాను మీ పట్ల చేసిన వాగ్దానములను నెరవేర్చి మిమ్మును బహుగా దీవిస్తాడు.
Prayer:
మా నమ్మకమైన ప్రియ పరలోకమందున్న గొప్ప తండ్రీ ,

నీవు మా పట్ల చేసిన వాగ్దానములను మేము నమ్మునట్లు మాకు అటువంటి హృదయమును దయచేయుము. అవి నెరవేరు వరకు మేము నీ పాదసన్నిధిలో యాకోబు వలె కనిపెట్టుకొని వేచియుండునట్లు మాకు ఓర్పును సహనమును దయచేయుము. ప్రభువా, నీవు మా పట్ల ఇచ్చిన ప్రతి మాట నిరర్థకము కాదని మేము నమ్మునట్లును, మాలో అపనమ్మకము కలుగకుండా ఉండునట్లును మాకు సహాయము చేయుము. దేవా, నీ బిడ్డల పట్ల చేసిన వాగ్దానములు నెరవేరు వరకు వారు ఏలాగున నీ సన్నిధిలో వేచియున్నారో, ఆలాగుననే, మేము కూడ మా సహనమును కోల్పోకుండా, ఓర్పుతో కనిపెట్టుకొనియుండునట్లు మాకు సహాయము చేయుము. నీవు మా జీవితములో జరిగించే కార్యములు అద్భుతముగాను మరియు శక్తివంతమైనవిగాను ఉండునట్లు మాకు కృపను దయచేయుమని సమస్త స్తుతి, ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000