Loading...

దేవుడు మీకు ఒక గొప్ప ధననిధి!

Shilpa Dhinakaran
08 Apr
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ పట్ల ఆయన న్యాయము తీర్చాలనియు మరియు మీ బంధకముల నుండి విడిపించాలనియు దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, నేటి వాగ్దానమేమనగా, కీర్తనల గ్రంథము 146:7 వ వచనము ఎన్నుకొనబడినది. " బాధపరచబడువారికి ఆయన న్యాయము తీర్చును ఆకలిగొనినవారికి ఆహారము దయచేయును యెహోవా బంధింపబడినవారిని విడుదల చేయును '' అని చెప్పబడియున్నది. అవును నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ అన్ని అవసరాలను తీర్చబోతున్నానని ప్రభువు వాగ్దానము చేయుచున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును '' (ఫిలిప్పీయులకు 4:19) అన్న వచనము ప్రకారము మీకు ఉన్న ప్రతి చిన్న అవసరాలు కూడా, ప్రభువు ఈ రోజు తీరుస్తాడు. అందుకే బైబిల్‌లో ఇలా చెబుతుంది, దేవుడు క్రీస్తుయేసునందు ఆయన తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరంను తీర్చగలడు. అదేవిధంగా, ప్రభువు ఈ రోజు మీ అన్ని అవసరాలను తీర్చబోతున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీ అన్ని అవసరాలను తీర్చినప్పుడు, మీరు చేయవలసినది ఏమిటి? మీరు ధారాళంగా ఇవ్వాలి మరియు అవసరమైన వారికి సహాయం చేయాలి. బైబిల్‌లో చూచినట్లయితే, లూకా సువార్త 6:38 అన్న వచనము ప్రకారము " ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను. '' అందువలన, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నేను దీనిని మా జీవితంలో ఎన్నోసార్లు అనుభవించాను. అన్నివిధాలుగా, ఇది నిజమని నాకు తెలుసు. నేను నాకు కలిగినది ఏదో ఇతరులకు ఇచ్చినప్పుడల్లా, నాకు ప్రతిఫలంగా రెట్టింపు భాగం లభిస్తుంది. నాకు దుస్తులు పెరిగినప్పుడు మరియు దానిని వేరొకరికి ఇవ్వాలని నేను ఆలోచించి, వారికి ఇస్తాను; మరల ఒక వారంలో, నేను వేరొకరి నుండి బహుమతిగా మరో రెండు దుస్తులను పొందుకుంటాను. కాబట్టి, నేడు ఈ సందేశము మీరు కూడ మీకు కలిగినదానిలో నుండి మరొకరికి ఇవ్వండి. అప్పుడు దేవుడు మీకు రెట్టింపుగా దయచేసి, మీ బంధకముల నుండి మీరు విడుదల పొందునట్లుగా చేస్తాడు.
అదేవిధంగా, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ధారాళంగా ఇచ్చినప్పుడు, ప్రభువు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మనము బైబిల్‌లో ఒక విధవరాలి యొక్క కథను చదివియున్నాము. యేసు ప్రభువు కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరు తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను (లూకా సువార్త 21:1-3). అదేవిధంగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు చేయగలిగినదంతా, మీకు కలిగిన దానిలో నుండి ఇతరులకు ఇచ్చినప్పుడు, ప్రభువు మీ పట్ల ఎంతో సంతోషంగా ఉంటాడు మరియు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజు ప్రభువు మీ అన్ని అవసరాలను తీర్చి, మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా అనుగ్రహిస్తాడు. దీనికి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. నేడే, ఈ సందేశము చదువుచున్న మీరు బంధకములలో ఉన్నను సరే, ఆకలితోను, ఆవసరతలోను ఉన్నను సరే, మీరు దేవుని చేతికి మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ బంధకముల నుండి విడుదల నిచ్చి, మీరు ఇతరులకు ఇచ్చినదానిని బట్టి, మీకు ఆయన అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుచునట్లు చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
ప్రేమా కనికరము గలిగిన మా పరలోకమందున్న తండ్రీ,

ఈ వాగ్దాన వచనమునకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము నీ ప్రేమకు కృతజ్ఞులమై జీవించుటకు మాకు సహాయము చేయుము. మా జీవితంలో ప్రతి చిన్న అవసరాన్ని నీ మహిమలో తీర్చునట్లుగా చేయుము. దేవా, నేడు నీవు మా అవసరాలను మరియు మా హృదయ కోరికలన్నింటిని తీర్చబోవుచున్నావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీవు మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, ధారాళంగా ఇవ్వడానికి మరియు ఇతరులకు సహాయం చేయడానికి మాకు అటువంటి హృదయమును దయచేయుము. బాధపరచబడిన మా పట్ల నీవు న్యాయము తీర్చుము. ఆకలిగొనినవారికి ఆహారము దయచేయునట్లుగా మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించుము. ప్రభువా, నేడు అపవాది బంధకముల చేతను మరియు వివిధ కరములైన బంధకముల చేత బంధింపబడిన మమ్మల్ని విడుదల చేయుము. దేవా, మేము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటి కంటెను అత్యధికముగా మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000