Loading...

మీ ఫలం నిలిచియుండునట్లు మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకొన్నాడు!

Shilpa Dhinakaran
04 Dec
నా ప్రియులారా, మన సృష్టికర్తయైన దేవుడే మనలను ఎన్నుకోవడం ఎంత అద్భుతం. ఆయన మనలో ప్రతి ఒక్కరిని తన నిమిత్తము ఎన్నుకొన్నాడు. ఏదో వ్యర్థముగా మిమ్మల్ని మరియు నన్ను ఆయన ఎన్నుకోలేదు. తన కొరకు మీరు ఫలాలను ఇచ్చులాగున ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మనము ఆయనను ఏర్పరచుకొనలేదు; కానీ, మనము వెళ్లి ఆయన కొరకు ఫలించుటకును, మన ఫలము నిలిచి యుండుటకును ఆయన మనలను ఏర్పరచుకొని నియమించెను. కాబట్టి, ఈనాడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని మహిమపరచడానికి, దానిని ఉపయోగించుకోవటానికి ప్రభువు మనలో ప్రతి ఒక్కరికి భిన్నమైన తలాంతులను కలిగి ఉండునట్లు ఆశీర్వదించియున్నాడు. ఆయన మనలో ప్రతి ఒక్కరిని పలు ఉద్దేశముల కొరకు ఎన్నుకున్నాడు.

అమెరికాలోని అట్లాంటా నుండి జామీ గ్రేస్ అని పిలువబడే ప్రసిద్ధి గాంచిన సువార్త గాయకురాలు ఉండేది. ఆమె ఒక క్రైస్తవ కుటుంబంలో పెరిగెను. ఆమె ఇల్లు ఎల్లప్పుడూ సంగీతంతో నిండి ఉంటుంది. చిన్నప్పుడు, జామీ కూడా వివిధ వాయిద్యాలను ఎలా నేర్చుకోవాలో మరియు దేవుని మహిమపరచడానికి పాటలు ఎలా పాడాలో నేర్చుకొనెను. జామీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమెకు ' టూరెట్స్ సిండ్రోమ్ ' అనే వ్యాధి ఉందని వైద్యుల ద్వారా నిర్ధారణ చేయబడినది. ఇది ఆమె యొక్క శరీరమును మెలితిప్పినట్లుగా చేస్తుంది మరియు ఆమె చేతులు, ఇంకను శరీరమంతా అనియంత్రిత కదలికలను కలిగి ఉంటుంది. ఆ క్షణం నుండి, వాయిద్యాలు వాయించడం మరియు దేవుని ఆరాధించడం ఆమెకు ఎంతో కష్టమైనది. ఈ సంఘటన జామీ హృదయాన్ని బ్రద్ధలు చేసింది మరియు ఈ ప్రత్యేకమైన సిండ్రోమ్ వ్యాధికి ఎటువంటి చికిత్స మరియు మందులు లేవని తెలుసుకోవడం ద్వారా అనేక ప్రశ్నలు కలిగినవి. అదేమనగా, దేవుడు ఆమెను ప్రేమిస్తున్నాడా? అని ప్రశ్నలు ఆమెలో తలెత్తడానికి కారణముగా ఉన్నది. కానీ, జామీ తనకున్న నైపుణ్యత ద్వారా దేవుని మహిమపరచడానికి ఉపయోగించుటకు ఎప్పుడూ తనకున్న తలాంతులను దేవుని కొరకు ఉపయోగించకుండా ఆపలేదు. ఆమెకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికిని, ఆమె పాడటం మరియు దేవుని ఆరాధించడం ఎప్పుడు కూడ ఆపలేదు. ఆమె ఎంతో మందిని ఆశీర్వాదకరమైన మార్గములో నడిపిస్తూ, అనేక ఫలములను పొందునట్లు చేసినది. దేవుడు ఆమె ప్రయత్నాలను ఆశీర్వదించాడు. తద్వారా, దేవుడు ఆమెను ఉన్నత స్థానమునకు హెచ్చించాడు.
అదే విధంగా, నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు తీసుకునే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి, ఒక గొప్ప వ్యక్తి ఇలా అన్నాడు. " మీలో ఉన్న ప్రతి తలాంతులను దేవుడు మీకు ఇచ్చిన ఒక బహుమతి. దానితో మీరు జరిగించేది దేవునికి తిరిగి మీరు ఇచ్చే బహుమతి - అని లియో బస్కాగ్లియా స్పష్టముగా తెలియజేసెను.'' కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని మహిమపరచడానికి, ఆయన మీకివ్వబడిన తలాంతులను ఉపయోగించినప్పుడు తప్పకుండా, ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. అవును, ఇది ప్రారంభంలో చాలా కష్టం, కానీ ప్రభువు స్వయంగా మిమ్మల్ని బలపరుస్తాడు మరియు మీరు ఉత్తమమైన క్రియలు జరిగించడం ద్వారా మీకు సహాయం చేస్తాడు. కారణము, " మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచి యుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని '' (యోహాను 15:16) అన్న వచనము ప్రకారము, మన ఫలము ఈ భూమి మీద నిలిచియుండునట్లుగా, ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొనియున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను, భయపడకుము: నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును '' (యెషయా 41:9,10) అన్న వచనముల ప్రకారము ప్రభువు నేడు ఈ సందేశము చదువుచున్న మీకు ఇచ్చిన తలాంతులను దేవుని మహిమ కొరకు ఉపయోగించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మీ పట్ల జాగ్రత్త వహించి, ఆయన నామము మహిమపడునట్లుగా, ఈ భూమి మీద మీ ఫలములు నిలిచియుండునట్లుగా, నేడు దేవుడు మీకు ఇవ్వబడిన తలాంతులను ఉపయోగించి, అనేకులకు దీవెనకరముగా ఉండునట్లుగా మిమ్మల్ని ఆశీర్వదించి ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు.
Prayer:
ప్రేమా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ,

ప్రభువైన యేసు, ఈ అద్భుతమైన తలాంతులతో మమ్మల్ని ఆశీర్వదించినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నిన్ను మహిమపరచడానికి, నీవు మాకిచ్చిన తలాంతులను ఉపయోగించడానికి మాకు సహాయం చేయుము. ఈనాడు మేము చేయు ప్రతి ప్రయత్నములను ఏలాగైన ప్రజలను తాకడానికి దీన్ని ఉపయోగించడంలో మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ యొక్క తలాంతులతో మమ్మల్ని ఆశీర్వదించినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. మేము నిన్ను ఏర్పరచుకోలేదు గానీ, నీవు మమ్మల్ని నీ సేవకొరకై ఏర్పరచుకొన్నందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవు మాకిచ్చిన తలాంతుల ద్వారా మేము అనేకులకు దీవెనకరముగా ఉండునట్లు మమ్మల్ని మార్చుము. నీ కొరకు జీవించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించుము. మా బలహీనతలో నీవు మమ్మల్ని బలపరచి, నీ నీతియను దక్షిణ హస్తముతో ఆదుకొను తలాంతులను మరల నీకొరకే ఉపయోగించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మేము ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000