Loading...
Samuel Paul Dhinakaran

మహిమకరమైన కాపుదల!

Samuel Dhinakaran
16 Sep
నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుడు మీతో ఏమి మాట్లాడబోవుచున్నాడో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. యేసు పిలుచుచున్నాడు క్యాలెండర్ లేదా సోషల్ మీడియాలో ఈ రోజు వాగ్దానాన్ని మీరు చూచియున్నారు కదా. ఇది యెషయా 4:5 లోని రెండవ భాగం. ఇది, ప్రతిదానిపై, " మహిమ అంతటి మీద వితానముండును...'' అని చెప్పబడియున్నది. ఇది ఎంత గొప్ప వాగ్దానం! దేవుని మహిమ మీకు కాపుదలగా ఉంటుంది. మీరు ఈ వాగ్దానాన్ని అంగీకరించినప్పుడు ఈ మహిమ మీపై సమృద్ధిగా దిగివస్తుంది.

నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు మరియు మీ కుటుంబానికి విరోధంగా చేసే అనేక కీడు కల్పించే కార్యాలు, అపవాది శోధనలు లేదా దాని యొక్క ఘోరమైన బాణాలుగా ఉండవచ్చును. బైబిల్‌లో కీర్తన 91: 4-5 వ వచనములలో మీరు చదవగలరు, " ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు '' అన్న వచనముల ప్రకారము దేవుడు మిమ్మల్ని రాత్రివేళ కలుగు భయం మరియు పగటివేళ ఎగురు బాణము నుండి విడుదల చేస్తాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని తన రెక్కల క్రింద కప్పుతాడు మరియు ఆయన రెక్కల క్రింద మీరు ఆశ్రయం పొందుతారు. అక్కడే దేవుని మహిమ మిమ్మల్ని కప్పి ఉండడాన్ని మీరు చూచెదరు.
ఒక ప్రత్యేకమైన వ్యక్తికి ఏమి జరిగిందో వినినప్పుడు నా హృదయము బ్రద్ధలైనది. అతను వచ్చి తన సొంత తల్లి తనని మరియు అతని భార్యను నాశనం చేయడానికి మరియు తన భార్య కడుపులో పెరుగుతున్న వారి బిడ్డకు విరోధంగా కూడా తన సొంత తల్లి చేత చేతబడి చేస్తున్నాడని చెప్పాడు. వారు ప్రభువును ప్రేమించినందున, అతని తల్లి దానిని సహించలేకపోయింది. ఈ రోజు, మీరు మీ స్వంత కుటుంబ సభ్యుల నుండి - మీ సొంత సోదరులు, భర్త లేదా మీ శత్రువుల నుండి కూడా దీనిని ఎదుర్కొంటున్నారా? వారు మిమ్మల్ని మంత్ర శక్తులు లేదా దుష్ట శక్తులతో నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారా? చింతించకండి. ఏదీ మీకు విరోధముగా నిలబడదు. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడ వర్ధిల్లదు. ఎందుకంటే, దేవుని మహిమ మిమ్మల్ని రక్షించడానికి, మీ చుట్టూ ఒక వితానముగా ఉంటుంది. కాబట్టి, ఈ క్రింది ప్రార్థనను విశ్వాసంతో చెప్పండి మరియు ప్రస్తుతం దేవుని అద్భుతమైన సన్నిధిని మరియు రక్షణను, కాపుదలను పొందుకొనండి. నిశ్చయముగా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
Prayer:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, నీకు వందనములు చెల్లించుచున్నాము. నేటి వాగ్దానానికై నీకు వందనములు. దేవా, నీ శక్తివంతమైన మరియు అద్భుతమైన సన్నిధితో మా హృదయాన్ని మరియు మా ఇంటిని నింపుము. ప్రభువా, నిన్ను ఎల్లప్పుడూ ఆరాధించడానికి మరియు నిన్ను వెదకడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ మహిమ మమ్మల్ని మరియు మా కుటుంబాన్ని కాపాడి సంరక్షిస్తుందన్న వాగ్దానాన్ని హత్తుకొనుచున్నాము. అపవాది లేదా శాపం నుండి ఏ బాణం లేదా కీడు కల్పించు ప్రణాళికలు వర్థిల్లకుండా చేయుము. ప్రభువా, మా మీద ఉపయోగించే మంత్రశక్తులు మరియు చేతబడి శక్తులు బ్రద్ధలగునట్లు చేయుము. మేము నీ నామమును ఘనపరచినప్పుడు, మేము ఆ మహిమను చూచుటకును మరియు ఎల్లప్పుడూ నీ మహిమతో మమ్మల్ని నింపుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000