Loading...
Paul Dhinakaran

యేసు - నిజమైన ద్రాక్షవల్లి!

Dr. Paul Dhinakaran
18 Aug
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని యందు నిలిచియుండాలనియు ఆయన మీ పట్ల కోరుచున్నాడు. దేవుడు మనపై ఎంతో నమ్మకం కలిగియున్నాడు. ఆ నమ్మకమేమంటే, ఆయనలో మనము ఎటువంటి పరిస్థితిలోను నిలిచియుంటూ, ద్రాక్షవల్లిలా ఫలించాలని ఆయన వాంఛ. ఇంతగా మనలను నమ్మిన దేవుడు మన దగ్గర ఫలములను కోరుచున్నప్పుడు మనము ఫలించకుండా నిష్‌ఫలులమైతే దేవుడు ఎలా ప్రతిస్పందిస్తాడు? " యేసు - నిజమైన ద్రాక్షవల్లి '' అని స్పష్టముగా సెలవిచ్చుచున్నాడు. అటువంటి యేసుక్రీస్తుతో మనము సహవాసము కలిగి జీవించునప్పుడు బహుగా ఈ భూమి మీద ఫలిస్తాము. 

అనేక సంవత్సరముల క్రితం మా తండ్రి యేసును గూర్చిన ఒక దర్శనమును చూచెను. ఆ సమయములో ఒక దైవజనుడు మా తండ్రిగారిని ప్రోత్సహించాడు. అతడు మరియు తన భార్య ఇద్దరు కలిసి మా తండ్రి యొద్దకు వచ్చి, మా నాన్నతో, పరిశుద్ధాత్మ వరములు అను అంశమును గూర్చి మాట్లాడుచు, దేవునితో నడుచుట ఎలా? మరియు ప్రార్థించుటను, ఇంకను దేవునితో ఎక్కువ సమయము గడుపుట అను అంశముల మీద మాట్లాడుచుండెను. ఒక ప్రత్యేకమైన రోజున, కుటుంబ ఆరాధనలో, 1962 అక్టోబరు 10వ తేదీన యేసు ప్రత్యక్షమై మా తండ్రిగారితో మాట్లాడెను. అప్పుడు మా నాన్నగారు పరిశుద్ధాత్మతో నింపబడెను. ఆ సంఘటన జరిగిన తర్వాత, ఆ దైవజనుడు మా తండ్రితో, " సోదరుడా, మీకు ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఎప్పుడైన మా యింటికి మీరు రావచ్చును. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. మీ అవసరతల సమయములో నన్ను పిలిచినట్లయితే, ఎల్లప్పుడు మీకు సహాయపడుటకు సిద్ధముగా ఉన్నాను, ఇంకను, మీరు ఎటువంటి సమయములలోను మరియు పరిస్థితులలోను నాపై ఆధారపడవచ్చును. మా తండ్రి అతని మాటలు నమ్మాడు. కాబట్టి, దేని కోసమైన తన యొద్దకు పరుగెత్తేవాడు. ఇలాగున 7 సంవత్సరములు గడిచిన తర్వాత మా తండ్రి యొక్క ఊపిరి తిత్తులు పాడైపోయినవి. మా అందరి సహాయము కోసం ఆ దైవజనుని మీదనే ఆధారపడ్డాము. కానీ, ఆశ్చర్యమేమనగా, మా పట్ల అతడు ఎంతో వ్యంగ్యంగా ప్రవర్తించాడు. అతడు మాతో ఖండించే మాటలను మాట్లాడుతూ, " నీవు ఏదో ఒక పాపము చేసియున్నావు, నీవు అపవాదికి నీ జీవితములో చోటు ఇచ్చియున్నావు, నీ యొక్క పాపపు అలవాట్ల ద్వారా మా ప్రార్థనలకు జవాబు రావడము లేదు '' అని చెప్పాడు. 

ఆ క్షణం యేసు మమ్మల్ని తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు. " నా కుమారుడా, మీరు నన్ను మాత్రమే విశ్వసించాలని నేను కోరుకుంటున్నాను. ఏ మానవుడు కూడ మీకు సహాయము చేయలేడు. నీవు నాలో నిలిచి యుంటేనే మీరు ఫలములను పొందగలరు. ఇటువంటి స్థితిలో మీరు నాలో ఉండనట్లయితే, ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసి వేయును '' అని చెప్పాడు. ఆ క్షణమే, మా అమ్మనాన్న ఇద్దరు దేవుని వైపునకు తిరిగారు. దేవుని నడిపింపు ద్వారా అద్భుత మార్గాలను వారు అనుభవించారు. అవును, అప్పటి నుండి తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుండునట్లుగానే నిజమైన ద్రాక్షవల్లియైన యేసుతో నా తండ్రియు నిలిచియుండెను. అద్భుతవిధంగా, దేవుని రాజ్యము కొరకు నా తండ్రి ఫలమును ఫలించుటకు మొదలు పెట్టెను. " యేసు - నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు '' (యోహాను 15:1) అన్న వచనము ప్రకారము అంతర్జాతీయంగా సేవాపరిచర్య ఎదుగుటకు ప్రారంభించినది. 
ఈనాడు నా ప్రియులారా, ఈ సందేశము చదువుచున్న మీరు యేసు యందు నమ్మకము ఉంచి, ఆయన మీదనే ఆనుకొని జీవించండి. యేసు క్రీస్తు మాటలు చూచినట్లయితే, " నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు '' (యోహాను 15:4,5) అన్న వచనముల ప్రకారము అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృశించిన వారినందరిని నింపుతాడు. తద్వారా ఈ భూమి మీద మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. కాబట్టి, ఇంతవరకు మీరు మనుష్యులపై ఆధారపడియున్నట్లయితే, నేటి నుండి నిజమైన ద్రాక్షవల్లియైన యేసుపై మీరు ఆనుకొని, ఆయనలో నిలిచియున్నట్లయితే, నిశ్చయముగా, మిమ్మల్ని బహుగా ఫలించునట్లు చేసి దేవుని రాజ్యమునకు ఫలములను తీసుకొని వచ్చువారినిగా మిమ్మల్ని మార్చి, వర్ధిల్లజేస్తాడు. 
Prayer:
సర్వకృపలకు ఆధారభూతుడవైన గొప్ప దేవా, 

నీ యందు భయభక్తులు కలిగి నిన్ను హత్తుకొని జీవించుటకు మాకు నీ కృపను దయచేయుము. నీవు ద్రాక్ష వల్లివి, కానీ మేము తీగెలుగా నీ యందు అంటుకట్టుకొని జీవించుటకు సహాయము చేయుమని మా హృదయాలను, కుటుంబాలను నీ దివ్య హస్తాలకు సమర్పించుకొనుచున్నాము, మమ్మును ఫలించువారలనుగాను మరియు అనేకులకు ఫలములిచ్చువారినిగా చేయుము. ఈ అంత్యకాలములో నీకు వేరుగా వుండి మేమేమి చేయలేము కనుక ఎల్లప్పుడు నీ సన్నిధిని మాతో వుంచుమని కోరుచున్నాము. మా జీవితాలను ద్రాక్షవల్లివైన నీతో పెనవేసుకొనునట్లు మా హృదయాలను తెరువుము. మేము మనుష్యులపై ఆధారపడినట్లయితే, మమ్మల్ని క్షమించి, ఎటువంటి స్థితిలోనైనను నీ మీద ఆనుకొని జీవించునట్లు మాకు అటువంటి కృపను దయచేయుము. కాబట్టి, నీవు మా జీవితములోనికి వచ్చి మమ్మును నీ నివాస స్థానముగా చేసుకొనుము. మమ్మును నీలో ఫలించువారలనుగా చేసి, మా కోరికలన్నిటిని సఫలము చేసి ఈలోక, పరలోక దీవెనలతో మమ్ములను నింపుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000