Loading...
Stella ramola

ఇవ్వండి మరియు తిరిగి పొందుకొనండి!

Sis. Stella Dhinakaran
25 Nov
నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నేను మీకు వందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు మనం సామెతలు 19:17 వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనమేమనగా, " బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును'' అని ఈ వచనం చెబుతుంది. పై వచనములో 'వాడు' మరియు 'వాని' అని ఎవరిని సూచిస్తుంది? ఇది బీదలను కనికరించు వ్యక్తులను సూచిస్తుంది!

నా ప్రియులారా,ఈ రోజు దేవుడు మనకు సీషాను దయచేశాడు. మేము బీదలకు సహాయం చేసే సేవా పరిచర్య ఇది. ఈ సీషా పరిచర్య ద్వారా వేలాది మంది పేద ప్రజలు ఆశీర్వదించబడుచున్నారు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మాకు సహాయం చేస్తున్నారు మరియు మీ త్యాగపూరితమైన కానుకల ద్వారా మేము ఎంతో మంది పేదలకు సహాయం చేయగలుగుచున్నాము. మీరు కానుకలు అర్పించే సమయంలో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు ఇచ్చేది ఇతరులకు తెలియకపోవచ్చును, కానీ దేవుడు మిమ్మును చూస్తున్నాడు. కాబట్టి, మీరు సామెతలు 15:3వ వచనమును చదివినట్లయితే, " యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును'' అన్న వచనము ప్రకారము ప్రభువు కన్నులు ప్రతిచోటా ఉన్నాయి అని చెప్పబడియున్నది. ఎవరికి తెలియకుం డా, మీ కానుకలను పేద ప్రజలకు మరియు మీ దశమ భాగాన్ని కొరతలో ఉన్న దేవుని సేవకులకు ఇవ్వండి. ఆలాగుననే, నేడు ఈ సందేశము చదువసుచున్న మీ కానుకలను పేద ప్రజలకు మరియు మీ దశమ భాగాన్ని కొరతలో ఉన్న దేవుని సేవకులకు ఎవరికి తెలియకుండా ఇచ్చుచున్నట్లయితే, నిశ్చయముగా, మీరు కనికరించబడతారు.
నా భర్త పేద పాస్టర్లకు తన యొక్క దశమభాగాన్ని ఇవ్వడానికి ఎంతో జాగ్రత్త వహించారు. అందుకే దేవుడు ఆయనగారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉత్తమ ఉద్యోగం ఇచ్చి, అత్యున్నత స్థానానికి ఎదుగునట్లుగా హెచ్చించాడు. అందుకే, సీషా పరిచర్య ద్వారా పేద ప్రజలకు మీ కానుకలు మరియు సహాయమును అందించండి. ఇటీవల, పాండిచ్చేరి నుండి ఒక పేద దంపతులు వచ్చి తమ దశభాగాన్ని కానుకగా సమర్పించారు. నిశ్చయంగా, దేవుడు అలాంటి వారిని అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. బైబిల్‌లో కీర్తన 41:1 ఇలాగున చెబుతుంది, " బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.'' కాబట్టి, సీషా సేవా పరిచర్య ద్వారా పేద ప్రజలకు మీకు కలిగిన దానిలో నుండి ఉత్తమమైనదానిని ఇవ్వండి. దేవుడు దానిని మీకు రెండింతలు తిరిగి మరల అనుగ్రహించి, అనేక విధాలుగా మీ కొరతలను తీర్చి, దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు ఆ కృపను మరియు ఉదారమైన మనస్సును ఇవ్వాలని దేవుని ప్రార్థించినట్లయితే, బీదలను కనికరించు మీరు యెహోవాకు అప్పిచ్చుటయే కాకుండా, మీ ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేసి మిమ్మును రెండంతలుగా ఆశీర్వదిస్తాడు.
Prayer:
ప్రశస్తమైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

బీదలను కనికరించే గొప్ప హృదయమును మాకు అనుగ్రహించుము. మా ప్రభువా, ఇదేవిధంగా మంచి కార్యాలు చేయుటకు మాకు నేర్పించుము, నీ పరిశుద్ధులకు మరియు అవసరతలో నున్న వారిని ఆదుకొనుటకు నీ నామాన్ని మహిమపరచుటకు మాకు నేర్పించుము. ప్రభువా, మేము బీదల పట్లను మరియు నీ పరిచారకుల పట్ల ప్రేమ కలిగియుంటూ, వారి యొక్క అవసరతలను తీర్చే సందర్భమును మాకు దయచేయుము. దేవా, నిత్యము మేము నీ యొక్క దివ్య ప్రేమను కలిగియుండుటకు మాకు అటువంటి హృదయమును దయచేయుము. అనేకులకు దీవెనకరముగాను, అప్పిచ్చువారినిగాను మమ్మును మార్చుమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000