Loading...
Stella dhinakaran

విూరు నిజముగా స్వతంత్రులై యున్నారు!

Sis. Stella Dhinakaran
14 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ బంధకముల నుండి మిమ్మల్ని విడిపించి, స్వతంత్రులనుగా చేయాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, నేడు మనము అనుభవించే పోరాటల నుండి, ఒత్తిడి, అనారోగ్యం మరియు అపవాది బంధకముల నుండి మనలను విడిపించడానికి నేడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చాడు. ఆయన ఇలా అంటున్నాడు, " ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును (కలుగునని) ప్రకటించుటకును, నలిగిన వారికి ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి యున్నాడు '' (లూకా 4:18) అన్న వచనము ప్రకారము ఈ రోజు, శత్రువుల కోటలను పడగొట్టడానికి యేసు తన బిడ్డలందరికిని అదే అధికారాన్ని అనుగ్రహించి యున్నాడు. ఆయన నామము, వాగ్దానాలు మరియు ఆత్మ ద్వారా చేసిన ఆయన నిబంధన రక్తం చేత అపవాది ద్వారా నాటబడిన చెడు విత్తనాలకు పరిష్కారం కలుగుతుంది. 60 సంవత్సరములుగా అనుభవించని సమాధామును సంతోషమును పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు తన జీవితాన్ని ఎలా మార్చాడో ప్రియమైన సహోదరి యొక్క సాక్ష్యము మీ కొరకు ఇక్కడ తెలియజేయబడినది.

నాకు ఇప్పుడు 63 సంవత్సరములు, నేను పుట్టినప్పుడు, ఆడపిల్లనని నా తల్లి నన్ను చంపుటకు ప్రయత్నించినప్పుడు, నా తండ్రి నన్ను కాపాడి పెంచి పెద్ద చేశారు. నాకు వివాహమైన 3 సంవత్సరములలో నా భర్త మరణించాడు. ఆ సమయములో నా కుమారుడికి ఒకటిన్నర సంవత్సరము వయస్సు పుట్టినింటి సహాయము మరియు మెట్టినింటి సహాయము లేక చాలా కష్టపడ్డాను. ఆ తరువాత నేను కళ్ల అద్దాల వ్యాపారమును ప్రారంభించాను. కానీ, అందులో మోసపోయాను. నా కుమారుడు 12వ తరగతి చదివిన తరువాత, కళాశాలకు పంపించాను. అతను కళాశాలకు వెళ్లకుండా నాకు ఎదురు తిరిగాడు. ఇంటి అద్దె కట్టుటకు కూడ చాలా కష్టముగా ఉండేది! తినుటకు ఆహారం లేదు. కట్టుకొనుటకు బట్టలు లేవు బ్రతకాలా? చావాలా? అని వేదనను అనుభవించాను.

ఆ పరిస్థితిలో, ఎస్తేరు ప్రార్థన బృందమును నడిపించుచున్న ఒక సహోదరి నన్ను కలిసి ఓదార్చి, నన్ను ఎస్తేరు ప్రార్థన బృందంలో ప్రార్థించుటకు పిలిచారు. అక్కడ ఇంచుమించు 8 మంది సహోదరీలు కూడి ప్రార్థించుచున్నారు. నేను వారి ఇంటికి వెళ్లి నా కొరకు ప్రార్థించమని అడిగేదానను. వారు పాప క్షమాపణ మరియు రక్షణను గూర్చి నాకు వివరించి, నా జీవితమును దేవునికి సమర్పించి, ప్రార్థన చేయమని చెప్పేవారు. నేను కూడ అదేవిధంగా, నన్ను దేవునికి సమర్పించుకొని ప్రార్థించినప్పుడు, నన్ను బంధించియున్న అనేక దురాత్మ శక్తులు నన్ను పీడించినవి. ఎస్తేరు ప్రార్థన బృందములో నాకు విడుదల కలగాలని పరిశుద్ధాత్మతో నింపబడి వారందరు ప్రార్థన చేశారు. అప్పుడు అపవాది బంధకముల నుండి ప్రభువు నాకు పరిపూర్ణ విడుదలను అనుగ్రహించాడు. అంతేగాక, ఆనాడు, సాయంత్రమే నాకు పార్ట్‌టైం ఉద్యోగం లభించినది. నా కుమారుడి మారుమనస్సు కొరకు ఎస్తేరు ప్రార్థన బృందంలో ప్రార్థించాము. దేవుడు అతనిని కూడ విడిపించాడు. ఇప్పుడు నా కుమారుడు క్రమంగా ఉద్యోగమునకు వెళ్లుచున్నాడు. 60 సంవత్సరములలో నేను ఎన్నడు అనుభవించని సంతోషమును సమాధానమును ఇప్పుడు అనుభవించుచున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొన్నాను. నేను ఇప్పుడు దేవుని మందిరమునకు ఎస్తేరు ప్రార్థన బృందమునకు క్రమము తప్పకుండా వెళ్లుచున్నాను. నన్ను బాధపెట్టిన వారు మరియు మోసము చేసిన వారు, అవమానించిన వారి మీద నాకు ఉన్న ద్వేషం మరియు కోపం, చిరాకు సమస్తము మాయమైపోయినవి. వారిని క్షమించి, వారి కొరకు ప్రార్థించుటకు వారితో ప్రేమగా మాటలాడుటకు ప్రభువు నాకు సహాయము చేయుచున్నాడు. ఈ పరిశుద్ధమైన మార్గములోనికి నన్ను తీసుకొని వచ్చిన దేవునికి సహోదరి స్టెల్లా దినకరన్‌గారికి ఎస్తేరు ప్రార్థన బృందమునకు, " యేసు పిలుచుచున్నాడు, '' పరిచర్యకు నా హృదయ పూర్వక వందనములు చెల్లించుచున్నాను. హల్లెలూయా!
నా ప్రియులారా, ఒకవేళ మీ పాపముల నుండి విడిపింపబడలేక, అయ్యో! పాపము మా జీవితమును సర్వనాశనము చేయుచున్నదని విలపించుచున్నారా? నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని కూడ మీ బంధకముల నుండి విడిపించుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. బైబిల్ ఈ విధంగా వాగ్దానము చేయుచున్నది, " కాబట్టి, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల విూరు నిజముగా స్వతంత్రులై యుందురు '' (యోహాను 8:36) అన్న వచనము ప్రకారము నిజమైన విమోచన యేసు ద్వారా మాత్రమే కలుగుతుంది. ఈ రోజు, అటువంటి యేసును మీ హృదయంలోనికి ఆహ్వానించండి. మీరు దేవుని కుటుంబంలో ఒక భాగముగా ఏకమైనప్పుడు, మీ దైనందిన జీవితంలో ఆయన శాంతి, నడిపింపు, అవసరతలు మరియు సంపూర్ణతను మీరు అనుభవిస్తారు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ ప్రేమగల తండ్రియైన యేసు ప్రభువును వెంబడించుటకు ముందుకు కొనసాగండి మరియు ఆయన దయను రుచి చూడటానికి మీరు ఆయనను ఎన్నుకొనండి. దేవునిచేత నింపబడిన సమద్ధికరమైన జీవితాన్ని దొంగలించుకునే ప్రతి విధమైన మోసాలను విడిచిపెట్టినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మిమ్మల్ని పీడించుచున్న బంధకములేవైనను సరే, మీ జీవితము పట్ల దేవుడు మంచి ప్రణాళికలను కలిగి ఉన్నాడు! ఆ ప్రణాళిక ప్రకారము దేవుడు నేడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసి, విజయవంతులనుగా మారుస్తాడు.
Prayer:
ప్రేమామయుడవైన మా పరలోకపు తండ్రీ!

ఇహలోక పాపమనెడి బంధ కముల నుండి నీవు మాత్రమే మమ్ములను విడిపించి స్వతంత్రులనుగా చేయగలవని మేము విశ్వసించుచున్నాము. నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తముతో మమ్ములను మరియు మా పాపములను కడిగి పరిశుద్ధపరచి, నీతిమంతులనుగా తీర్చి దిద్దుము. మా కొరకు నీవు మ్రానుపై వేలాడినందుకై నీకు స్తుతులు చెల్లించుచున్నాము. మా కన్నీటి బాష్పబిందువును తుడిచి వేసి, మా అపజయాలన్నిటిని విజయవంతముగా మార్చుము. మా పాప శాపముల నుండి నీ కుమారుని ద్వారా మమ్మును విడిపించి, నీ సత్యము ద్వారా మమ్మును స్వతంత్రులనుగా మార్చుము. మా మీద నీ దృష్టియుంచిన మమ్మును కాపాడుము. మా చెడు అలవాట్ల నుండి మమ్మును నిజముగా విడుదల దయచేయుమని సమస్త, స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు పరిశుద్ధుడవైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000