Loading...
Samuel Paul Dhinakaran

దృఢమైన అడుగులు కదిలించబడలేవు!

Samuel Dhinakaran
30 Nov
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ నడతను ప్రభువు స్థిరపరచాలని మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. అందుకే నేడు వాగ్దానముగా, " ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును '' అని బైబిల్‌లో చెప్పబడినట్లుగా, కీర్తనలు 37:23 నుండి తీసుకోబడిన నేటి వాగ్దానముతో దేవుడు మిమ్మును బలపరచి మరొక్కసారి ముందుకు సాగిపోవునట్లుగా చేయుచున్నాడని నేను ఎంతగానో ఆనందించుచున్నాను. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రభువు ఒక వ్యక్తి యొక్క నడత లేక మార్గంలో ఆనందించినట్లయితే, ఆయన వారి అడుగులను స్థిరపరుస్తాడు. ఈ వాగ్దానము ప్రకారము, ఈ రోజు ప్రభువు మీ నడతలను స్థిరపరచుచున్నాడు, తద్వారా మీరు ఉన్న చోట నుండి ఎవరూ మిమ్మల్ని కదిలించలేరు లేదా మీ జీవితంలో దేనిని మీ నుండి విడదీయలేరు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితంలో దేవుడు స్థాపించిన వాటిని అపవాది దొంగిలించలేడు లేదా నాశనం చేయలేడు. కారణము, దేవుడు మీ పట్ల ఆనందించుచున్నాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి.

బైబిల్‌లో చూచినట్లయితే, " దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును '' (కీర్తనలు 1:1-3) అన్న వచనముల ప్రకారము, దేవుడు మీ పట్ల ఆనందించినట్లయితే, నిశ్చయముగా, మీరు చేయునదంతయు దేవుడు ఫలించునట్లు చేయును. కాబట్టి, దేవుని మాత్రమే సంతోషపెట్టడం కొనసాగించినప్పుడు ఆయన మీ నడతలను స్థిరపరచును. ఈ రోజు దేవుడు మిమ్మును ఉన్నత స్థాయి నుండి ఏదైన లేక ఎవరైన మీ యొద్ద నుండి దానిని తీసివేస్తారని లేక దొంగిలిస్తారని భయం మీలో ఉండవచ్చును. దేవుడు మీకిచ్చిన దానిని విడిచి తొలగిపొమ్మని చెప్పి మిమ్మల్ని బెదిరించవచ్చును. లేక మీ మీద వ్యతిరేకముగా తప్పుడు దోషారోపణ చేసి, కేసులు పెట్టవచ్చును లేదా దేవుడు నిర్మించిన దానిని తీసివేయడానికి మీ పరిచర్య మీదికి లేక మీకు విరోధముగా ప్రజలు రావచ్చును. కానీ, నా ప్రియులారా, నేడు మీరు దేనికిని భయపడవద్దు. దేవుడు మీ పట్ల ఆనందించుచున్నాడు. కాబట్టి, మీకు ఏదియు సంభవింపకుండా చేయడానికి దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మరువకండి.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితము ముందుకు సాగివెళ్లుటకు మరియు ప్రభువును ఆనందింపజేయడానికి మాత్రమే మీ జీవితాన్ని కొనసాగింపజేయాలని ఆయనను అడగండి, " ప్రభువా, మేము నీకు ఏమి చేయాలి? '' మీరు దేనికిని భయపడరని, జీవితంలో స్థిరంగా నిలబడగలం అని ధైర్యంగా ప్రకటించినప్పుడు, దానికి బదులుగా, మీరు ముందుకు సాగిపోతారు మరియు మీరు అలా చేసినప్పుడు, దేవుడు మీ అడుగులను స్థిరపరచి మిమ్మును రక్షిస్తాడు. మీరు ఆయన చిత్తాన్ని చేయడానికి పట్టుదలతో ఉన్నప్పుడు; ఆయన పరిచర్య లేదా మీ పనిని కొనసాగించడం లేదా పేదలకు సహాయం చేయడం మరియు దేవుని కోసం మీ వంతు సహాయం చేయడం, మీ అడుగులు స్థిరంగా ఉంటాయి. కాబట్టి, నా స్నేహితులారా, ప్రభువులో స్థిరంగా నిలిచియున్నప్పుడు మీరు ఎన్నటికిని కదిలించబడరు. అందుకే నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును మీరు ప్రభువు చేతులకు సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ నడతలను స్థిరపరచి, మీ పట్ల ఆనందించుట మాత్రమే కాదు, మిమ్మును ఉన్నత స్థాయికి ఎదుగునట్లు చేసి, మిమ్మును వర్థిల్లజేస్తాడు.
Prayer:
కరుణావాత్సల్యత గల మా ప్రేమగల పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మును ప్రోత్సహించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. దేవా, ఎల్లప్పుడు నీవు మా పట్ల ఆనందించునట్లుగా, నేడు మా జీవితాలను మరియు హృదయాలను సంపూర్ణంగా నీ ప్రేమగల హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, మా జీవితం ఎల్లప్పుడు నీ యెదుట ఆనందంగా ఉండునట్లు మమ్మును మార్చుము. దేవా, మాకు విరోధముగా లేచు యే ఆయుధము కూడ వర్ధిల్లకుండా చేయుము. యేస య్యా, మా జీవితములో నిన్ను ఆనందింపజేయలేని కార్యాలు ఉన్నట్లయితే, వాటన్నిటిని మా యొద్ద నుండి తొలగించి, మా నడతలను స్థిరపరచుము. ప్రభువా, మమ్మును రక్షించి మరియు నీవు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటి చుట్టూ నీ అగ్ని కంచె వేయమని వేడుకొనుచున్నాము. దేవా, అనేకసార్లు మా నడతలు కదిలించబడినప్పుడు, నీ గొప్ప కృప మమ్మును ఆదరించి, మా అడుగులు జారిపోకుండా పట్టుకొనునట్లు చేయుము. ప్రభువా, నీ వాగ్దానానికి అనుగుణంగా నడుచుకొనునట్లుగాను మరియు మేము ఎన్నటికిని కదిలించబడకుండా మా అడుగులను స్థిరపరచుము మరియు మా ప్రతి క్లిష్టమైన పరిస్థితుల మీద మాకు విజయం అనుగ్రహించి, నీ నామాన్ని మహిమపరచుమని యేసుక్రీస్తు ప్రేమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000