Loading...
Samuel Paul Dhinakaran

మీరు పోరాడే ప్రతి పోరాటాలలో దేవుడు మీకు జయమిస్తాడు!

Samuel Dhinakaran
18 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు జలములలో బడి వెళ్లినప్పుడు అవి మీ మీదికి పొర్లిపారకుండ ఉండునట్లు దేవుడు ఎల్లప్పుడు మీకు తోడైయున్నాడు. ఆయన కృప మిమ్మల్ని నిత్యము ఆవరించి, మీ కష్టకాలములో మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి, మీరు సున్నితమైన రహదారిలో ప్రయాణిస్తున్నప్పుడు మీ ప్రయాణం సౌకర్యవంతంగా మరియు ఆనందదాయకంగా ఉంటుంది.

నేను నా సహోదరి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా తండ్రి మాకు ఈత నేర్పించవలెనని ఆశించినందున ఒక లోతైన ఈత కొలనుకు మమ్ములను తీసుకొని వెళ్లారు. మా సమయమును వృద్ధా చేయక, ఆయన ఆ కొలనులో మమ్మల్ని విడిచిపెట్టారు. మేము చాలా భయపడ్డాము. నేను ఊపిరి తీసుకోలేక, " నాన్న నన్ను కాపాడు '' అని అరిచాను. ఆయన మేము ఏ విధంగానైన సరే, ఆ నీళ్లలో ఈత కొట్టి బయటకు రావలెనని చెప్పారు. మేము అదేవిధంగా చేసి, నీటి మీదకు వచ్చాము! అవును, మేము ఎంతో కఠినమైన విధంగా దానిని నేర్చుకొన్నాము. అదేవిధంగా, దేవుడు మనలను లోతైన నీటిలో పడవేస్తున్నాడు. మనము ఈత కొట్టి కష్టపడి చివరికి ఆయనకు మొఱ్ఱ పెట్టినప్పుడు, ఆయన మన యందు దయను చూపించి, తన చెయ్యి చాపి మనలను కూడ పైకి లేపును. అవును, ఆయన యొక్క దయగల హస్తము యొద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సున్నితంగా కౌగలించుకుంటాడు. మీ జీవితం కష్టతరమైనప్పుడు, మీ స్వబలముతో దానిని చేయవలెనని అనుకొనవచ్చును. అది మీకు అపజయమును మరియు నిరుత్సాహమును కలుగజేయును. కానీ, మనము ఆయన యొక్క బలమును ఆశ్రయించినప్పుడు, తప్పించుకునే ఆయన అద్భుతమైన మార్గాలను చూడండి, సహనముతో ఆయన మనకు నేర్పించు విషయముసమ ఆశ్చర్యకరముగా ఉండును!

సముద్రంలో పడవేయబడిన యోనాను గురించి బైబిల్‌లో మనం చదివి యున్నాము. అతను సముద్రములో పడవేయబడినప్పుడు, నీటిలో మునిగిపోయాడు. ఆ తరువాత, దేవుడు ఒక గొప్ప మత్స్యమును పంపించి అది అతనిని మ్రింగివేయునట్లు చేసెను (యోనా 1వ అధ్యాయము). మా తాతయ్య సహోదరులు డి.జి.యస్ దినకరన్‌గారికి ఒక దర్శనములో, ఆయన యోనాను పరలోకములో కలుసుకొనే కృపను ప్రభువు అనుగ్రహించాడు. యోనా మా తాతయ్యతో, " మీకు తెలుసా? నేను మత్స్యము యొక్క కడుపులో ఉన్నప్పుడు, అన్ని వైపుల నుండి జీర్ణ ఆమ్లములు వచ్చి, నన్ను జీర్ణించి వేయుటకు చూచును. ఆ సమయములో కూడ దేవుని కృప నన్ను చుట్టు ముట్టి యుండుటను నేను చూశాను. అది నన్ను జీర్ణించి వేయకుండునట్లుగా కాపాడినది. దేవుడు నన్ను మత్స్యము యొక్క కడుపులోనికి పంపించినను, అది నన్ను ఏమీ చేయకుండునట్లుగా కృపతో ఆయన నన్ను కాపాడెను. ఆయన కృప యొక్క శక్తిని ఆనాడు నేను తెలుసుకొన్నాను '' అని ఆయన మా తాతయ్యతో చెప్పెను.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని యొద్ద, ' ప్రభువా, నాకెందుకు ఈ కష్టమును అనుమతించివి? నేను నిన్ను నమ్ముటకు ఆసక్తి చూపుచున్న సమయములో ఎందుకు నాకు ఈ వేదనను కలిగించావు '' అని అడుగుచున్నావా? మీరు చింతించుటకు ఆయన అనుమతించడు, ఏ విధంగా యోనా ఆ మత్స్యము యొక్క కడుపులో దేవుని స్వరమును వినెనో, అదే విధంగా దేవుడు తన కృపను దయచేసి, మిమ్మును కాచి కాపాడును. ఈ కృప దిగివచ్చినప్పుడు మిమ్మును కాపాడి ఈ లోకము నుండి ఆయన మిమ్మును వేరుపరచును. సాతాను మిమ్మును చేరకుండునట్లు చేయును. బదులుగా మీరు దేవుని స్వరమును విందురు. అప్పుడు మన కన్నులు యేసు వైపునకు త్రిప్పబడును. మనము ఆయన స్వరమును వినెదము. మనము లోతైన నీటిలో నున్నను, దేవుడు మనకు దానిని చూచుటకు సహాయము చేయును. దీనిని చూచుటకు ఆయన మనకు మంచి అద్ధమును అనుగ్రహించును. ' ఇక్కడ ఒక మంచి జత కళ్లజోడు ఉన్నాయి - దేవుని వాగ్దానం ద్వారా మంచి దేవుడిని స్పష్టంగా చూడవచ్చును, ' అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు'' (యెషయా 43:2) అన్న వచనము ప్రకారము నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఆయన నాశనము చేయడానికి అనుమతించడు. ఈ ప్రక్రియలో మిమ్మల్ని ఆవరించడానికి మరియు మిమ్మల్ని రక్షించడానికి ఆయన తన కృపను మీపైకి పంపుతాడు. నేడు మీరు మునిగిపోతున్న సమస్యల మధ్య, దేవుని స్వరాన్ని వింటారు. ఆయన కృప అపవాది యొక్క కుతంత్రాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు కూడా, మీ కళ్ళు యేసు వైపు త్రిప్పండి. మీ సందేహాలు మరియు ఆందోళనలన్నింటిని ఈ మంచి దేవునికి తెలియజేయండి మరియు ఆయన కృపను పొందుకొనండి. బైబిలు ఈ విధంగా వాగ్దానము చేయుచున్నది, " నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును '' (యెషయా 41:10) అన్న వచనము ప్రకారము నేడు మీరు ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నను సరే, మీరు యోనా వలె ఆయనకు మొఱ్ఱపెట్టినప్పుడు, ఆయన కృప మిమ్మల్ని ఆవరించునట్లు చేసి, ఆయన యొక్క నీతి అను తన దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకొని, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు పోరాడే ప్రతి పోరాటములలో మరియు ప్రతి సమస్యలలోను దేవుడు మీకు తప్పకుండ విజయమును అనుగ్రహిస్తాడు. ఎందుకనగా, ఆయన మీతో ఉన్నాడు. కనుకనే భయపడకండి.
Prayer:
ఘనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నిన్ను స్తుతించుచున్నాము. నీ నామము ఎంత గొప్పదైయున్నదని మాకు తెలియజేసినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, నేడు మేము పోరాడుచున్న పోరాటాల మధ్యలో యోనా వలె నీకు మొఱ్ఱపెట్టుటకు మాకు సహాయము చేయుము. మా పోరాటాలలో మాకు విజయము దయచేయుము. మా సమస్యల మధ్యలో ఈదుకొని వచ్చుటకు మా స్వబలముపై ఆధారపడకుండా, నీ కృపను మాకు అనుగ్రహించుము. ఇంకను మేము జలములలో బడి వెళ్లునప్పుడు, మాకు తోడైయున్నానని వాగ్దానము చేసిన దేవుని యందు మేము నమ్మకముంచుచున్నాము. మా నమ్మకాన్ని బలపరచుము. యోనాను మత్స్యము కడుపులో నుండి కాపాడిన దేవుడవు నేడు నీవు, మా కష్టకాలము నుండి మమ్మును విడిపించి, నీ నీతియను తన దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకొని, నీ నామమునకు ఘనత తెచ్చుకొనుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000