Loading...
Stella dhinakaran

విశ్వాసముతో అడిగిన మీ మనవిని ఆలకించే దేవుడు !

Sis. Stella Dhinakaran
27 Mar
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీ మనవిని ఆలకిస్తాడని మీరు నమ్మండి. కాబట్టి, మన ప్రభువును ఈనాడు మీరు ఏమి అడిగినను అవన్నియు మీకు కలిగినవన్ని విశ్వసించండి. నిశ్చయముగా వాటన్నిటిని మీరు పొందుకుంటారు. మీరు అడిగినవాటిని పొందుకోవాలంటే, దేవునితో సన్నిహితంగా నడవడానికి మరియు ఆయన మీ మధ్య నిలిచియుండే కుటుంబముగా ఎదుగుటకు విశ్వాసం ఎంతో అవసరమై యున్నది. మీరు కొన్ని ఆశీర్వాదములు పొందుకొనుటకు ఆలస్యముగా ఉన్నప్పుడు చింతించుటగానీ, నిరుత్సాహపడుటగానీ వద్దు, ఎంతో కాలము వేచియుండుట ద్వారా సొమ్మసిల్లిపోకండి. అయితే, అద్భుతములు జరిగించు దేవుని మీద మీ దృష్టిని ఉంచి, ఆయన యందు మీరు నమ్మకము కలిగియుండండి. ఎందుకంటే, ఆయనకు అసాధ్యమైనదేదీయు లేదు. ఆయన మీ హృదయ కోరికలను నెరవేరుస్తాడు. విశ్వాసములో ఎదుగుటకు ఎంచుకొనండి, తగిన సమయములో దేవుడు మీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలమును అనుగ్రహిస్తాడని నమ్మండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు.

యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జెకర్యా అను ఒక యాజకుడుండెనని బైబిల్‌లో లూకా1వ అధ్యాయంలో మనము చూడగలము. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి. ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహుకాలము గడచిన (వృద్ధులైరి). కానీ, వారికి సంతానము లేకపోయెను. కానీ, జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవుని యెదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. వారు ఆలాగున తమ జీవితంలో వారి లోపమును గురించి ప్రార్థించుచుండెను. దేవుడు వారి ప్రార్థనలను విన్నాడు మరియు వారిని ఆశీర్వదించాలని అనుకున్నాడు. కాబట్టి, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జెకర్యా అతని చూచి, తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడా దూత అతనితో జెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువని చెప్పెను.ఈ సమయంలో, మరొక అద్భుతం జరిగింది!ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జెకర్యా యింటిలో ప్రవేశించి, ఎలీసబెతుకు వందనము చేసెను. ఎలీసబెతు మరియ యొక్క వందన వచనము వినగానే, ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని చెప్పెను. రక్షకుడైన యేసును ఈ లోకంలోకి తీసుకురావడానికి యేసుక్రీస్తు తల్లియైన మరియ ప్రత్యేకమైన ఆధిక్యతను పొందియుండెను. అవును, ఎలీసబెతుకు మరియు మరియ అను వారిద్దరు పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించారు. వారిద్దరు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు, ఎలీసబెతు మరియను ఆశీర్వదించి, ప్రభువు వారికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడని నమ్మిన వారు ధన్యురాళ్లుగా ఉండెను!
నా ప్రియులారా, నేడు ఈ ఇద్దరు స్త్రీల యొక్క విశ్వాసాన్ని చూడండి. ఎలీసబెతు చాలా వృద్ధురాలు. అయినప్పటికి, దేవుడు ఆమెను ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె విశ్వాసంతో దేవుని ఆశీర్వాదమును పొందుకొనెను. కాబట్టి, ఆమె జీవితంలో దేవుని ఉద్దేశము నెరవేర్చబడినది. అదేవిధంగా, మరియ కూడ తన గర్భంలో రక్షకుడైన యేసును మోయడం ద్వారా తన జీవితంలో దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చింది. అదేవిధంగా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ మీ జీవితంలో దేవుని పిలుపుని నెరవేర్చువారుగా ఉండండి. ఈ ఇద్దరు విశ్వాసపు స్త్రీలు కావడంతో, వారు అత్యున్నత ప్రత్యేకమైన ఆశీర్వాదాలను పొందుకున్నారు. వారు,' ధన్యత పొందిన స్త్రీలుగా ' మార్చబడ్డారు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ దేవునిపై విశ్వాసంతో మీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే, " మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము '' (1 యోహాను 5:4) అన్న వచనము ప్రకారము మీకివ్వబడిన వాగ్దానము ప్రకారము మీ కొరతలను మరియు సమస్యలను మీరు జయిస్తారు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని వాగ్దానాలపై విశ్వాసముంచినట్లయితే, నిశ్చయముగా, మీరు ప్రార్థనలో ఏవి అడిగినను, వాటన్నిటిని దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు.
Prayer:
విశ్వాసమునకు కర్తయైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

మాలో ఉన్న లోపాలను నీవు సరిచేసుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీకు సన్నిహితంగా నడవడానికి మరియు నీవు మా మధ్యలో నివసించే కుటుంబముగా ఎదుగుటకు మాకు విశ్వాసమును దయచేయుము. ప్రభువా, పై చెప్పబడిన ఇద్దరు స్త్రీల వలె మేము ఈ భూమి మీద నీ ఉద్దేశమును నెరవేర్చుటకు మాకు సహాయము చేయుము. నీ యందు విశ్వాసంతో స్థిరముగా నిలిచియుండుటకు మాకు సహాయము చేయుము. మా భవిష్యత్తులో విశ్వాసములో ఎదుగుటకు మాకు నీ కృపను దయచేయుము. మేము చేయు ప్రయత్నాలన్నిటిని ఆశీర్వదించుము. ప్రభువా నీ ఉద్దేశమును నెరవేర్చుటకు మరియ వలె మా జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకొనుచున్నాము. నీ మాటల యందు మా విశ్వాసాన్ని పెంచుకొనుటకు సహాయము చేయుము. మాలో ఉన్న అవిశ్వాసమును తొలగించి మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చుము. ప్రభువా, విశ్వాసముతో ఏది అడిగినను దానిని మా జీవితములో జరిగించుము. ఈనాడు మా వ్యాధులను ముట్టి స్వస్థతను దయచేయుము మరియు అవసరతలను తీర్చుమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000