Loading...
Stella dhinakaran

విశ్వాసమే, విజయం!

Sis. Stella Dhinakaran
14 Jan
నా అమూల్యమైన స్నేహితులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు నేను శుభములు తెలియజేయుచున్నాను. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు సమస్తమును జయించుటకు దేవుడు మీకు సహాయము చేస్తానని వాగ్దానము చేయుచున్నాడు. బైబిల్ నుండి కీర్తనలు 18:29వ వచనమును మనము ధ్యానించుకుందాము. " నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును '' అని నేటి వాగ్దాన వచనమును మనము చదివియున్నాము. అదేమనగా, దేవుని సహాయంతో దావీదు ఒక సైన్యమును జయిస్తాడనియు మరియు ప్రాకారమును దాటునని కీర్తనాకారుడు సెలవిచ్చుచున్నాడు. కారణము, దావీదు దేవుని పట్ల ప్రేమకలిగినవాడు. కాబట్టి, అతడు దేవుని హృదయానుసారుడగా మారెను. అతని జీవితములో అసాధారణమైన నమ్మకమును దేవుని మీద కలిగియుండెను. అదేవిధంగా, మత్తయి 15 వ అధ్యాయములోని ఒక కనానీయుల విశ్వాసం గురించి మనం చదవగలము. ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను. ఆమె తన కుమార్తెను స్వస్థపరచమని యేసు యొద్దకు వచ్చెను. అయినను ఆమె వచ్చి, ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను. ఆమె దేవుని యందు స్థిరమైన నమ్మకమును కలిగియుండెను. " అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ కనానీయ స్త్రీ యేసునందు విశ్వాసముంచెను గనుకనే, ఆమె ఆశీర్వాదం పొందుకున్నందుకై సంతోషంగా తిరిగి వెళ్ళింది '' (మత్తయి 15:21-28). కనుకనే, ఆమెను గురించి బైబిల్‌లో ప్రస్తావించబడినది.

ఇంకను బైబిల్‌లో లూకా సువార్త 7వ అధ్యాయములో మరొక సంఘటన గురించి మనం చదవగలము. అక్కడ పాపాత్మురాలైన స్త్రీ, తన పాపపు అలవాట్ల వలన తనలో శాంతి సమాధానములేనిదై, యేసు వద్దకు వచ్చి, తన పాపపు అలవాట్ల నుండి మరియు సమస్యల నుండి విడుదల పొందుటకు సహాయం చేయుమని యేసు వద్దకు కన్నీటితో వచ్చెను. ఆమె తన కన్నీళ్లతో యేసు పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను. అంతమాత్రమే కాదు, ఈమె ఆయన పాదములకు అత్తరు పూసెను. కాబట్టి, యేసు ప్రభువు నుండి ఆమెకు క్షమాపణ మరియు సమాధానము కూడా లభించాయి. కనుకనే, యేసు ఆ స్త్రీతో, " అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్లుమని ఆ స్త్రీతో చెప్పెను '' (లూకా 7:50). అవును, ఆమె సమాధానమును పొందుకొని తిరిగి వెళ్లెను.
అదేవిధముగా, పాత నిబంధన గ్రంథములో, ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి ఇశ్రాయేలీయులపై యుద్ధానికి వచ్చినప్పుడు, దావీదు గాతువాడైన గొల్యాతు అను శూరుడొకనితో పోరాడవలసి వచ్చింది. గొల్యాతు తన తల నుండి కాలి వరకు ఆయుధాలను ధరించి యుండెను. మరియు అతడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు కూడా. కానీ, దావీదు ఒక సాధారణమైన గొర్రెల కాపరి అయినప్పటికీ, యుద్ధం చేయుటకు అతడు ఎటువంటి యుద్ధాభ్యాసము పొందలేదు, అతను ధైర్యంగా గొల్యాతుతో ఇలా ప్రకటించాడు, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను.ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగవేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండు వారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. అప్పుడు ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి, తన సంచిలో చెయ్యివేసి అందులో నుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందున వాడు నేలను బోర్లపడెను (1 సమూయేలు 17: 45-49). అవును దావీదు దేవునిపై స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నందున, దేవుడు అతని పక్షమున ఉన్నందున, అతడు గొల్యాతుపై విజయమును సాధించాడు మరియు అతడు ఈటెతోను, కత్తులతో కాకుండా సాధారణమైన గులకరాళ్లతో గొల్యాతును చంపెను.

నా ప్రశస్తమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడా ఎన్నో పోరాటాలను మరియు శ్రమలను ఎదుర్కొంటున్నారా? కానీ, వాటిని చూచి మీరు భయపడకండి. నేడు మీరు దావీదు వలె కదల్చబడలేని విశ్వాసాన్ని ప్రభువుపై ఉంచండి. ఆయన మీ పక్షాన ఉన్నప్పుడు, మీరు బలమైన వ్యక్తులు అవుతారు. అంతమాత్రమే కాదు, దావీదు వంటి గొప్ప కార్యాలు చేయగలరు. మీరు దేవుని అభిషేకాన్ని పొందుకున్నప్పుడు, మీ శత్రువులందరితో పోరాడటానికి మరియు వారిని జయించడానికి మీరు సన్నద్ధమవుతారు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నను సరే, భయపడకుండా, దావీదు వలె మీరు దేవుని యందు స్థిరమైన విశ్వాసమును కలిగియున్నప్పుడు నిశ్చయముగా, దేవుడు మీ పక్షమున ఉండి, వాటన్నిటిని జయించుటకు మీకు సహాయము చేసి, మీ శత్రువుల యెదుట మిమ్మల్ని హెచ్చించి, ఘనపరుస్తాడు.
Prayer:
సర్వశక్తిమంతుడవైన మా పరలోకమందున్న తండ్రీ,

నీవు మా పట్ల చేసిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాము. నీవు మా పట్ల చేయుచున్న సహాయమును బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. పై చెప్పబడిన వారి వలె మేము నీ స్థిరమైన కదల్చబడని విశ్వాసమును కలిగియుండుటకు మా హృదయములను ఆయత్తపరచుము. దేవా, నీ నామమున ద్వారా మాకు కలుగు గొప్ప ఆశీర్వాదములు, అవి ఏవైనా సరే, మా పోరాటాలను ఎదుర్కోవడానికి మాకు సహాయపడుతుంది. దావీదు యుద్ధంలో శత్రువైన గొల్యాతును జయించి, చంపగలిగాడు, అటువంటి గొప్ప ఈ కృపను నేడు మాకు అనుగ్రహించి, మా కష్టాల నుండి, వ్యతిరేకతల నుండి మేము విడుదల పొందుకొనుటకు నీ సహాయమును మాకు అందించుము. విజయం తరువాత విజయం చూడటానికి మమ్మల్ని శక్తివంతులనుగా మార్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000