Loading...
Dr. Paul Dhinakaran

గొప్ప కార్యములను ఆశించండి!

Dr. Paul Dhinakaran
03 Sep
మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు మరియు సర్వాంతర్యామి. ఆయన గొప్పవాడు మరియు శక్తిమంతుడు. దేవుని యొక్క గొప్ప కార్యములను చూసి ప్రజలు భయపడ్డారని మనము చదివియున్నాము. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి (న్యాయాధిపతులు 2:7). పాత నిబంధన  గ్రంథములో, ప్రభువు చేసిన గొప్ప కార్యములను ప్రజలందరూ చూశారు. ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు ఐగుప్తీయుల మీదికి తెగుళ్ళు రప్పించెను. ఇశ్రాయేలీయులను ఆరిన నేల మీద నడిపించునట్లుగా ఆయన ఎఱ్ఱ సముద్రమును రెండు పాయలుగా చీల్చెను. అదేవిధంగా నడుచుటకు ప్రయత్నించిన ఐగుప్తీయులను దేవుడు నీటిలో ముంచివేసాడు, తద్వారా వారిని బెదిరించిన ఐగుప్తీయులు కనిపించకుండా పోయారు. దేవుడు వారికి విజయాల తరువాత విజయాలను అనుగ్రహించాడు. దేవుడు యెరికో గోడలు కూలిపోవునట్లు చేసెను. వారు యొర్దాను నదిని దాటునట్లుగా దేవుడు దానిని చీల్చెను. పగలు మేఘ స్తంభం మరియు రాత్రి అగ్ని స్తంభం ద్వారా దేవుడు వారిని నడిపించెను. ప్రభువు చేసిన ఈ అద్భుత కార్యములన్నిటిని చూసి, ప్రజలు తమ జీవిత కాలమంతయు దేవుని యందు నమ్మకం ఉంచారు. అవును, దేవుడు గొప్ప కార్యములను చేసినప్పుడు, వాటిలో ఆయన యొక్క శక్తిని మనం చూస్తాము మరియు మనం ఆయనను విస్మయంతో ఆరాధిస్తాము.

ఒకసారి నేను అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి చదివాను, ఆయన చాలా నగరాలను జయించాడు. ఆయన ఏదైనా నగరాన్ని జయించిన ప్రతిసారీ, తన విగ్రహాన్ని నగరం మధ్యలో నిర్మించమని ఆ పట్టణ అధికారులకు చెప్పేవాడు. ఒకసారి, ఆయన వారు ఏవిధముగా నిర్మించారో తెలుసుకోవాలనే ఆసక్తితో ఆ నగరాలను సందర్శించాడు. ఆయన ఒక నగరం నుండి మరొక నగరానికి వెళ్ళేటప్పుడు ప్రతి నగరం మధ్యలో తన విగ్రహాన్ని చూసుకొని చాలా ఆనందించాడు. కానీ, ఒక నగరంలో, ఆయన విగ్రహం లేనందున అది అతనికి చాలా కోపం తెప్పించింది. వెంటనే, అతను నగరంలోని పెద్దలందరినీ పిలిచి, “నా విగ్రహం ఎక్కడ? ఇక్కడ ఎందుకు ఉంచలేదు? ” అని అరిచాడు. వారు శాంతంగా, “అయ్యా, దయచేసి మాకు ఒక్క క్షణం ఇవ్వండి” అని సమాధానం ఇచ్చారు. ఆపై వారు గట్టిగా  “అలెగ్జాండర్” అని అరిచారు. వెంటనే, నగరం మధ్యలో అందరూ నిలబడి ఉన్న స్థలము వద్దకు బాలుర సమూహం పరిగెత్తుకు వచ్చింది. మరియు పెద్దలు అలెగ్జాండర్ వైపు చూస్తూ, “అయ్యా, మేము మీ విగ్రహాన్ని నిర్మించలేదు, కానీ మేము మా మగ పిల్లలకు మీ పేరు పెట్టాము మరియు మిమ్మల్ని సజీవ సాక్షిగా మార్చాము” అని చెప్పారు. ఆయన గెలిచిన గొప్ప విజయాల కారణంగా “అలెగ్జాండర్ ది గ్రేట్ ” అని పిలువబడ్డాడు మరియు అతను ప్రజలచే ఆరాధించబడ్డాడు.
దేవుడు ఆయనను గొప్పగా చేసాడు మరియు దేవుడు మీ కోసం కూడా గొప్ప కార్యములను చేయును. క్రొత్త నిబంధనలో, దేవుడు ప్రభువైన యేసు ద్వారా అద్భుతాలు చేశాడు. సముద్రము చీల్చడం లేక గోడలను కూల్చడం వంటి వాటికి భిన్నంగా, ప్రభువైన యేసు ప్రజలను స్వస్థపరచుచు, విడిపించుచు మరియు ఆశీర్వదించుచు సంచరించెను. దేవుడు చేసిన గొప్ప కార్యమేదనగా, ప్రభువైన యేసు ద్వారా ప్రజలను రక్షించెను. ప్రభువైన యేసు మన విమోచన కొరకు సిలువపై చనిపోయి, మూల్యం చెల్లించెను. ప్రేమ అన్నిటికంటే శక్తివంతమైనది అని మనము చదివెదము. "కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే" (1 కొరింథీయులకు 13:13). ప్రపంచం చూసిన గొప్ప ప్రేమ ఏదనగా యేసు ప్రేమ. తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు (యోహాను 15:13). మీ పట్ల దేవుని ప్రేమ చాలా గొప్పది మరియు మీ కోసం తన జీవితాన్ని సహితం ఇచ్చిన ఆయన మీ కొరకు సమస్త కార్యములను మరియు గొప్ప కార్యములను చేయడా? మీ జీవితకాలమంతయు మీరు ఆయన నామాన్ని విశ్వసించేలా ఆయన మీ కోసం నిశ్చయముగా అద్భుత కార్యాలను  చేస్తాడు.
Prayer:
ప్రేమగల ప్రభువా,

ఈ ఆశీర్వాద సందేశం ద్వారా నాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నీవు నీ ప్రజల కోసం గొప్ప కార్యములు చేసినట్లే, నా కోసం కూడా గొప్ప కార్యములు చేస్తానని నీవు చేసిన వాగ్దానము నిమిత్తం స్తోత్రములు. నా పరిస్థితిని మార్చుటకు మరియు నన్ను గొప్పగా చేయుటకు నీ నుండి వచ్చే ఒక్క మాట చాలు ప్రభువా. నా జీవితంలో నీవు చేయు అద్భుతాల ద్వారా నీ నామము మహిమపడును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000