Loading...
Stella ramola

దేవుడు కలిగియున్నదంతయు మీ స్వాస్థ్యమే!

Stella Ramola
27 Sep
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీకు దేవుడు తన స్వాస్థ్యమును ఇవ్వాలని మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. అందుకే నేడు వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 94:14వ వచనము ఎన్నుకొనబడినది. ఆ వచనము, " యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు '' అనే వాగ్దాన వచనమును మనం నేడు ధ్యానించుకుందాము. ఈ స్వాస్థ్యము ఎవరు? నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవుని బిడ్డలు. కాబట్టి, ఆ స్వాస్థ్యము మీరే! ఈ వచనములో చెప్పబడినట్లుగా, దేవుడు మీ తండ్రి; మీరు ఆయనకు ప్రశస్తమైన బిడ్డలు. కాబట్టి, ప్రభువు తన యొద్ద కలిగియున్న స్వాస్థ్యమంతయు మీ సొంతమే. కాబట్టి, దేనిని గూర్చియు చింతించకండి. మీరు దేవుని యందు ఆనందించండి.

అవును, నా ప్రియులారా, ఈ రోజు, ఈ సందేశము చదువుచున్న మీకు స్వస్థత ఎంతో అవసరం అని చెబుతున్నారా? లేదా మీ కుటుంబాన్ని, మీ వ్యాపారాన్ని నడపడానికి లేదా మీ పనిని తెలివిగా చేయడానికి మీరు జ్ఞానం కోసం వాంఛతో ఎదురు చూస్తున్నారా? లేక మిమ్మును ప్రేమించడానికి ఎవరు లేరని చెప్పి చింతించుచున్నారా? నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అందరి చేత తృణీకరించబడినట్లుగాను లేదా ఎవరు లేకుండా ఒంటరిగాను ఉన్నారా? మీరు మీ కుటుంబంలో మరియు మీ సంబంధాలలో శాంతి సమాధానమును కోరుకుంటున్నారా? లేదా మీ భవిష్యత్తు పట్ల మీ కోసం ఏమి జరుగుతుందో అని మీరు భయపడి ఉండ వచ్చును. మీరు సరైన వ్యక్తిని వివాహం చేసుకుంటారా? లేదా మీరు కోరుకున్న ప్రమోషన్ లేదా కోరుకున్న ప్రవేశాన్ని లేక ఉద్యోగమును పొందగలమా? మీరు మీ జీవితంలో విజయం సాధించగలరా? అని తలంచుచున్నారా? మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉండ వచ్చును మరియు మీ జీవితంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. కాబట్టి, నిరుత్సాహపడకండి స్నేహితులారా. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ జీవితంలో వెదకుచున్న సమస్తమును దేవుని యందు గుప్తములై యున్నది. కాబట్టి, దిగులుపడకండి.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ దగ్గర ఏమి లేదనియు మరియు పై చెప్పబడిన సమస్యలన్నిటిని తలంచి మీరు దిగులుపడుచుండవచ్చును. అందుకే దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును చూచి, " నా బిడ్డా, నాది అంతా నీదే '' అని ప్రభువు మీతో అంటున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి; దేవునిలో దృఢంగా ఉండండి. నేడు ప్రభువు తన స్వస్థతా శక్తితో మీ గాయాలను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే, ఆయన సమాధాన కర్త, కాబట్టి, ఆయన నేడు ఈ సందేశము చదువుచున్న మీ హృదయాన్ని ఓదారుస్తాడు. ఆయన తన ఎడతెగని ప్రేమతో మిమ్మును కప్పుతాడు. ఆయన మీకు తన బలాన్ని ఇచ్చి, మిమ్మల్ని స్థిరంగా ఉండేలా చేస్తాడు. ఆయన మీకు అద్భుతమైన ఆలోచనలను ఇచ్చి, మీలో జ్ఞానాన్ని నింపుతాడు. ఎంత ఆనందం కదా! అవును, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువు యొక్క స్వాస్థ్యము. ఈరోజు మీకు కావలసిన వన్నీ, ఆయన తన హృదయం యొక్క సంపూర్ణత నుండి మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. సర్వశక్తిమంతుడైన మీ తండ్రి తాను కలిగియున్నదంతయు మీకు ఇవ్వాలని మీ పట్ల కోరుకుంటున్నాడు; ఆయన తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఈ రోజంతా ఆయనను స్తుతించండి; ఈ దీవెనను పొందుకొనండి. దేవుడు మిమ్మును దీవించును గాక.
Prayer:
ప్రేమా నమ్మకమైన మా పరలోకమందున్న తండ్రీ,

నీ అద్భుతమైన వాగ్దానానికి మేము నిన్ను స్తుతించుచున్నాము. దేవా, మమ్మును నీ బిడ్డగా అంగీకరించినందుకై నీకు వందనాలు. దేవా, మమ్మును నీ స్వాస్థ్యముగా ఎన్నుకున్నందుకై మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మును విడనాడనందుకై మేము నిన్ను స్తుతించుచున్నాము. ప్రభువా, నీ వాక్యము చెప్పినట్లుగానే, నీ స్వాస్థ్యముగా మమ్మును ఏర్పరచుకొనుటకు మా హృదయాలను నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, నీవు కలిగియున్నదంతయు మా సొంతమని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, మేము ప్రార్థిస్తున్నప్పుడు నీ అద్భుతం చేయు శక్తి ఇప్పుడు కూడా మా జీవితంలో బయలుపరచబడునట్లు చేయుము. దేవా, ఈ రోజు మా జీవితంలో నీ ఆదరణ, నీ జ్ఞానం, నీ యొక్క ఆశీర్వాదాలు మరియు నీ స్వస్థతను మేము స్వాస్థ్యముగా పొందుకొనుటకు సహాయము చేయుము. దేవా, నేడు నీవు నీ కోసం నీ ఉద్దేశములను చేయడానికి మాకు నీ శక్తిని మరియు మనశ్శాంతిని దయచేయుము. ప్రభువా, నీవు కలిగియున్న స్వాస్థ్యమును మాకు అనుగ్రహించి, మమ్మును దీవించుము. ప్రభువా, మా జీవితంలో ఎటువంటి లోటు రాకుండా పరిపూర్ణతను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000