Loading...
DGS Dhinakaran

మనఃపూర్వకముగా చేయుడి

Bro. D.G.S Dhinakaran
09 Sep
మనము ఏమి చేసినను, మన హృదయపూర్వకముగా  చేయవలెను. దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా, దాసులు తమ యజమానిని ఏవిధంగా సేవించవలెనో, మనము కూడ అదేవిధంగా మనఃపూర్వకముగా దేవుని సేవించవలెను. పరిశుద్ధ గ్రంథము నందు దావీదు అన్ని విధాలుగా దేవుని సేవించుటను మనము ఉదాహరణగా చూసెదము. దావీదు వీణ ఎంతో చక్కగా వాయించును గనుక, ఇశ్రాయేలు రాజును సేవించుటకు అతను పిలువబడ్డాడు. దావీదు వీణ వాయించినప్పుడు సౌలు యొక్క ఆత్మ నెమ్మదించును. దేవుడు దావీదుకు సమస్త విషయములలో తోడైయుండెను గనుక, అతను గొప్ప విజయము పొందుకొనెను (1 సమూయేలు 18:14). దావీదు తాను చేయు సమస్త కార్యములలోను సుబుద్ధి కలిగియన్నందున, అతను గొల్యాతును జయించెను. అతను సమస్త విషయములలోను దేవుని సేవించెను. అతను చేయు కార్యములన్నిటిలోను దేవుని సంప్రదించేవాడు కనుక అతను దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు (అపొ.కా. 13:22).

ఒకసారి నేను విదేశముల నుండి వచ్చిన ఒక దైవ సేవకుని కలిశాను. ఆయన నన్ను, ‘‘మీరు ఎల్లప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు?’’ అని అడిగారు. అందుకు నేను దేవుని సందేశము అందించుటకు సిద్ధపడుచున్నాను అని చెప్పాను. ఆయన గట్టిగా నవ్వి, వారి బైబిల్‌ను చూడమని నాకు ఇచ్చారు. ఆ పేజీల మధ్య అనేక దైవ సందేశములకు సంబంధించిన నోట్సు ఉండుట నేను చూశాను. ఆయన, ‘‘నేను వేదిక మీదికి వెళ్లినప్పుడు, ‘ప్రభువా’ అని చెప్పి, బైబిల్‌ తెరిచి, ఆ పేజీలో ఏ సందేశము ఉంటే, దాని మీదనే దేవుని సందేశమును అందించెదను’’ అని చెప్పారు. నా కెంతో ప్రియమైనవారలారా, ‘‘యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక’’ (యిర్మీయా 48:10) అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కనుక మనము ఏమి చేసినను, దేవుని పాదముల చెంత కనిపెట్టుకొనియుండి, దేవునికి మహిమ తెచ్చునట్లుగా హృదయపూర్వకముగా చేయవలెను (1 కొరింథీయులకు 10:31; కొలొస్సయులకు 3:24).
.‘‘క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది’’ (2 కొరింథీయులకు 5:14) అని అపొస్తలుడైన పౌలు తన అనుభవముతో చెప్పిన ప్రకారం, మనము కూడ మనఃపూర్వకముగా దేవుని సేవించవలెను. మీరు ఒక్క నిమిషము ప్రార్థన చేసినను, ఆ ప్రార్థన మీ హృదయాంతరంగము నుండి రావలెను. ఎంత పెద్ద జనసమూహమైనను, మీరు వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేసెదరు మరియు మీరు ప్రజల కొరకు చేసిన ప్రార్థనను ప్రభువు ఆలకించి, జవాబిచ్చును. మనము హృదయపూర్వకముగాను మరియు దేవుని భయముతోను చేయు సేవయే తండ్రికి కుమారుడు చేయు నిజమైన సేవ. మనము ఏమి బోధించినను, ప్రార్థించినను లేక ఉపవాసమున్నను, ఏమి చేసినను, మన హృదయపూర్వకముగా చేయవలెను. మీరు నిజమైన ప్రేమ మరియు దేవుని యందు భయభక్తులతో దేవుని సేవించినప్పుడు, ప్రభువు నిశ్చయముగా మిమ్మును ఘనపరచును (యోహాను 12:26).
Prayer:
నా ప్రభువా, 
నేను చేయు ప్రతి పనిలోను నీ ప్రేమ చేత నడిపించబడుటకు కృపననుగ్రహించుము. నేను ఎల్లప్పుడు నీ సన్నిధిలో ఆనందించుచు, సమస్త విషయములలో సుబుద్ధి కలిగియుండుటకు సహాయము చేయుము. నేను నిన్ను నిజాయితీతోను మరియు నిజమైన ప్రేమ మరియు భక్తితోను  సేవించాలని ఆశించుచున్నాను. ఎటువంటి మందగింపు లేక మోసము లేకుండా నా హృదయాంతరంగముల నుండి నిన్ను ప్రేమించుటకు నాకు సహాయము చేయుము తండ్రీ, ఆమేన్‌.

For Prayer Help (24x7) - 044 45 999 000