Loading...
Samuel Paul Dhinakaran

నిబంధన ఆశీర్వాదాలు!

Samuel Dhinakaran
25 May
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని అత్యధికముగా అభివృద్ధి పొందించాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు. నేడు మిమ్మల్ని అత్యధికముగా అభివృద్ధి పొందించాలని ప్రభువు మీ పట్ల గొప్ప వాగ్దానం చేయుచున్నాడు. ఈ రోజు, దేవుని వాగ్దానం బైబిల్ నుండి ఆదికాండము 17:2 వ వచనము ఎన్నుకొనబడినది. ఆ వచనమేమనగా," నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను...'' అన్న వచనము ప్రకారము ఆయన అబ్రాహామునకు మరియు దేవునికి మధ్య ఒక నిబంధనను చేశాడు. అదేమనగా, అతనిని అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని అతనితో చెప్పెను. ఇది ప్రభువు అబ్రామునకు ఇచ్చిన వాగ్దానం మరియు దేవుడు ఆ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాడో మరియు అతనిని ఎలాగున అభివృద్ధి పొందునట్లు చేశాడో మనకు బాగా తెలుసు. ఈ వచనము దేవునితో నిబంధన చేసే శక్తిని గురించి స్పష్టంగా చెబుతుంది. దేవుని యొక్క దీనత్వమును ఇక్కడ మనము చూడగలము! దేవుడు మీతో ఒక నిబంధన చేయుచున్నాడని మీకు తెలియజేయుచున్నాడు. ఆయన మిమ్మల్ని ఎక్కువ కాలము వెదకడానికి మరియు మిమ్మల్ని ఎంతో సమయము వేచి ఉండనివ్వడు. అబ్రాహామును వృద్ధిపొందించిన దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని వెతుక్కుంటూ మీ యొద్దకు వస్తాడు మరియు ఆయన ఈ రోజు మీ పక్షాన ఉన్న కారణముగానే, మీతో ఒక నిబంధన చేయుచున్నాడు. అదేమనగా, అబ్రాహాము వలె ఆయన మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాడు.

దేవుడు మా తాతగారితో ఒక నిబంధన చేశాడు మరియు ఈ రోజు వరకు, ఆయన ఆ నిబంధనకు లోబడి యున్నాడు. అదేమనగా, ఆయన మా కుటుంబాన్ని నిబంధన నుండి దూరం చేయనివ్వలేదు. తరతరాలుగా, మేము కూడ ఆ నిబంధనకు లోబడి, దేవునికి విధేయత కలిగి జీవించుచున్నాము. ఎందుకో మీకు తెలుసా? దేవుడే దానిని స్థాపించి, మనలో ఉంచినందువలన మాత్రమే. ఈ రోజు, మా కుటుంబంను అత్యధికముగా అభివృద్ధి పొందించి, గొప్ప విస్తరణను మరియు అద్భుతమైన ఆశీర్వాదాలను చూస్తున్నాము. అందునిమిత్తము మేము దేవునికి ఎంతగానో కృతజ్ఞులమైయున్నాము. దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని మరియు విస్తరింపజేయాలని మీ పట్ల కోరుచున్నాడు. ఇది ఎంత ఆనందం! మీరు ఈ ఆశీర్వాదం పొందడానికి సిద్ధంగా ఉన్నారా? మీతో తన నిబంధనను స్థాపించడం ద్వారా, ప్రభువు మీ జీవితంలో ఒక చక్కటి అద్భుతకార్యమును జరిగిస్తాడు. అయితే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు చేయవలసిన మొట్టమొదటి కార్యమేదనగా,ఈ రోజు నుండి, మీరు ప్రభువుతో సన్నిహితంగా నడిచినట్లయితే మరియు ఆయన నిబంధనకు లోబడి అబ్రాహాము వలె జీవించినట్లయితే, దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్లుగానే, ఆయన మహిమ కోసం మీరు గొప్ప కార్యాలు చేయునట్లుగా మిమ్మల్ని మారుస్తాడు మరియు ఈ నిబంధన ఆశీర్వాదంను మీరు పొందుకొనుటయే కాకుండా, మీరు అత్యధికముగా అభివృద్ధి పొంది తరతరములు మీరు అనేకులకు ఆశీర్వదకరముగా ఉండునట్లుగా మిమ్మల్ని మారుస్తాడు.
Prayer:
సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. దేవా, మా పట్ల నీవు చేసిన నీ శక్తివంతమైన నిబంధనకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ప్రభువా, నీకు మరియు మాకును మధ్య ఇవ్వబడిన ఈ వాగ్దానం నిబంధనకు మేము లోబడి జీవించునట్లుగాను మరియు మా హృదయ పూర్వకంగాను, మా జీవితకాలమంతయు నీకు సేవ చేయడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితాలను నీకు సంపూర్ణంగా సమర్పించుకొనుచున్నాము. దేవా, నీవు మా పట్ల సంపూర్ణ బాధ్యత కలిగి మమ్మల్ని ఈ లోక సమస్యల నుండి విడిపించుము. సంతానములేని, ఆర్థికంగాను, రోగములు మరియు తెగుళ్ళు మధ్యను నీవు మాకు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని, మా జీవితాన్ని అబ్రాహాము వలె అత్యధికముగా అభివృద్ధి చెందునట్లు చేసి, అనేక తరాలకు ఆశీర్వాదకరముగా జీవించునట్లుగా మమ్మల్ని ఆశీర్వదించుము.ఈ రోజు నుండి దేవా, మేము నీతో సన్నిహితంగా నడుచుకొనుటకును మరియు లెక్కకు మించిన నీ యొక్క ఆశీర్వాదాలను మేము అనుభవించునట్లు మాకు సహాయము చేయుము. దేవా, మేము నీ మహిమ కొరకు మమ్మల్ని మరియు మా కుటుంబాన్ని ఆశీర్వదించుము. మా జీవితంలో మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రతి ఆశీర్వాదం నెరవేర్చబోతున్నందులకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. ఈనాటి మా జీవితములో అద్భుతమైన కార్యాలను జరిగించి, మమ్మల్ని అబ్రాహాము వలె ఇతరులకు ఆశీర్వాదకరముగా మార్చుమని యేసు క్రీస్తు అతిశ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000