Loading...
Stella ramola

సంపూర్ణమైన విమోచన!

Sis. Stella Dhinakaran
26 Sep
నా ప్రియమైన స్నేహితులారా, మన ప్రభువును మరియు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితము శత్రువుల పోరాటముతో వున్నదా? మీ శత్రువులు మిమ్మును అణగద్రొక్కుతున్నారని మీ హృదయములో ఎంతో దుఃఖించుచున్నారా? కలవరపడకండి? మన దేవుడు మీ శత్రువులను అణగద్రొక్కుతాడని వాగ్దానము చేయుచున్నాడు. ఈ రోజు, దేవుడు ఒక చక్కటి వాగ్దానం అనుగ్రహించియున్నాడు, అది కీర్తన 60:12 నుండి, " దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగ ద్రొక్కువాడు ఆయనే.'' ఇది ఎంత చక్కటి వాగ్దానం మరియు అన్ని పరిస్థితులలోనూ గట్టిగా పట్టుకొనుమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న మీతో దేవుడు ఉన్నప్పుడు, ఇంకా ఏమి కావాలి? అన్ని ఆశీర్వాదాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి.

బైబిల్ నుండి నహూము 1:7 ఇలా చెబుతోంది, " యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును. అవును, తనపై నమ్మకం ఉంచేవారు ప్రభువుకు తెలుసు. కీర్తన 60:11 లో దావీదు ఇలా అంటున్నాడు, " మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము '' అన్న వచనము ప్రకారము దావీదు కష్టంలో ఉన్నప్పుడు, ' ప్రభువా నాకు సహాయం చేయి ' అని దావీదు నిత్యము ప్రభువును ప్రార్థించేవాడు. దావీదు కోరిక ఏమిటి? అతను ఎన్నో కష్టాలు మరియు భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు. కానీ, అతను ఎల్లప్పుడూ దేవుని విశ్వసించాడు. కాబట్టి, ఈ సందేశము చదువుచున్న మీరు మీ శత్రువులను చూచి పారిపోకండి, వారిని చూచి నేడు ధైర్యంగా వుండడం నేర్చుకొనండి. మీ శత్రువులు మరియు అపవాది కల్పించిన అవరోధాలను కష్టాలను దేవుని పాదాల ముందుంచడం నేర్చుకొనండి. ఇటువంటి కష్ట సమయాలలో ఎంత ఎక్కువగా దేవునిపై ఆధారపడితే అంత ఘనమైన విజయాలను మీరు పొందుతారు. ప్రార్థన లేని జీవితం శూన్యమైన జీవితం. ఇది మీకు ఆశీర్వాదాలను తీసుకురాదు. ఇది మీ జీవితంలో భయాలను, బాధలను కలిగిస్తుంది. కావుననే, దావీదు వలె నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎప్పుడైతే దేవుని పాదాలను పట్టుకుంటారో, అప్పుడు దేవుడు మీ శత్రువులను అణగద్రొక్కి, మీ శత్రువుల యెదుట మీకు భోజనము సిద్ధపరచి నూనెతో మీ తల అంటి మీ గిన్నె నిండి పొర్లునట్లు చేస్తాడు.
నా ప్రియులారా, ఇంకను కీర్తన 71: 5 ఇలా చెబుతోంది, " నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే '' అన్న వచనము ప్రకారము బాల్యము నుండి దేవుని ఆశ్రయముగా చేసికొనియున్నాడని చెబుతున్నాడు. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, 2 సమూయేలు 4:9 వచనములో దావీదు ఇలా అంటున్నాడు, ' ప్రభువు నన్ను ప్రతి కష్టాల నుండి విడిపించాడు.' అవును, ప్రియమైన స్నేహితులారా, ప్రభువును నమ్మండి మరియు ఆయన మీ సమస్యలన్నిటి నుండి మిమ్మల్ని కూడా రక్షిస్తాడు. కీర్తన 34:19 ఇలాగున చెబుతోంది, " నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును '' అన్న వచనము ప్రకారము ఆయనే మీ నిరీక్షణ, మీ విశ్వాసం, మీ నమ్మకం మరియు మీ కోటగా చేసుకోండి. ఇంకను మీ పూర్తి విశ్వాసం ఆయనపై ఉంచండి. మీరు కష్టాలలో ఉన్నప్పుడు మీ స్నేహితులు లేదా కేవలం మనుష్యుల సహాయం కోసం ఎక్కడకు వెళ్లకండి, బదులుగా దేవుడిని వెదకండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. ఆయనను విశ్వసించి, సంపూర్ణమైన విమోచనను అనుభవించండి. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా హెచ్చిస్తాడు.
Prayer:
పరాక్రమశాలియైన మా ప్రియ పరలోకపు తండ్రీ,

నేటి వాగ్దానాను సారంగా మా శత్రువులను అణగద్రొక్కుము. నేడు మాకు విజయవంతమైన జీవితాన్ని ఇచ్చినందుకు మేము నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము నీ శక్తివంతమైన నామమును మరియు నీ వాగ్దానాలను నమ్ముతున్నాము. మేము చేసే ప్రతి పనిలో మాకు ధైర్యము దయచేయుము. ఎందుకంటే, నీవు లేకుండా మేము ఏమీ చేయలేము. ఈ రోజు, మా జీవితంలో ప్రతి రంగంలోనూ మేము విజయాన్ని పొందుకొనుటకు సహాయము చేయుము. నిత్యము, మేము నీ పాదాల ముందు నీకు దాసుడినై/దాసురాలనై నిన్ను నమ్మి మా అనుదిన జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాము. దేవా, మా కుటుంబము పట్ల మరియు మమ్మల్ని చుట్టు ముట్టియున్న మా శత్రువులను నీవు అణగద్రొక్కుము. దావీదు వలె మేము ఎల్లప్పుడు నీ యందు భయభక్తులు కలిగి జీవించుచు మా శత్రువుల నిమిత్తము నీ సన్నిధిలో నిత్యము ప్రార్థించుటకు మాకు సహాయము చేయుము. దేవా, దావీదువలె మా శ్రమలలో కూడ నీ పాదములను హత్తుకొని జీవించే కృపను మాకిచ్చి, మా శత్రువుల యెదుట నీవు మాకు భోజనమును సిద్ధపరచుము. నీకు ఇష్టమైన జీవితమును జీవించుటకు మాకు నీ కృపను, ధైర్యమును దయచేసి, మా శ్రమలపై మరియు శత్రువులపై విజయమును మాకు దయచేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000