Loading...
Stella dhinakaran

దేవుని వాగ్దానమును హత్తుకొనండి

Sis. Stella Dhinakaran
04 Sep
‘అయ్యో, నేను తలనొప్పితో బాధపడుచున్నాను’, లేక ‘నాకు ఈ భయంకరమైన వ్యాధి ఉన్నది’ అని అనుకొనుచు వేదన అనుభవించుచున్నారా? దేవుని వాగ్దానములు మీ కొరకే ఉన్నవని విశ్వసించి వాటిని గట్టిగా హత్తుకోండి. సామెతలు 4:22లో, ‘‘దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును’’ అని చెప్పబడిన ప్రకారము, దేవుని వాక్యము మిమ్మల్ని స్వస్థపరచును. ‘‘మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కులుగును ఆయన సత్యము, కేడెమును డాలునైయున్నది. చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు’’ (కీర్తన 91:1,4,6). అవును, సర్వశక్తుని నీడ మీ మీదికి వచ్చును; ఆయన తన రెక్కలతో మిమ్మును కప్పును; ఆయన బలమైన రెక్కల క్రింద మీకు ఆశ్రయము కలుగును, ఎటువంటి రోగమునైనను ధైర్యముగా ఎదుర్కొనే కృపను ఆయన మీకు అనుగ్రహించును.

‘‘ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను’’ (హెబ్రీయులకు 13:6; కీర్తన 118:6) అనియు, ‘‘దేవుని యందు నమ్మికయుంచియున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?’’ (కీర్తన 56:4) అనియు మనము ధైర్యముగా చెప్పవచ్చును. దావీదు వలె మీరు దేవుని స్థిరముగా హత్తుకొనినప్పుడు, ఆయన మీ భయాలన్నిటిని తొలగించును. ఆయన మీకు విడుదలను, స్వస్థతను మరియు ఆరోగ్యమును అనుగ్రహించును. అనేక సంవత్సరముల క్రితం, ఒక దైవ సేవకుని భార్య తీవ్రమైన రక్తస్రావముతో బాధపడేది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు, గర్భసంచిని తీసివేయుటకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. అది క్యాన్సర్‌కు దారితీస్తుందేమో అనే భయముతో, ఆ కుటుంబ సభ్యులు కూడ దానికి అంగీకరించారు. కానీ ఆమె మాత్రమే యేసు ప్రేమతో నింపబడి, విశ్వాసముతో, ‘‘నన్ను స్వస్థపరచుటకు శక్తి కలిగిన దేవుని మీదే నేను నా పూర్తి విశ్వాసమును ఉంచాను. కనుక నేను భయపడను. నిశ్చయముగా ఆయన నన్ను స్వస్థపరుస్తాడు. ఆయన నాకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించును’’ అని చెప్పింది. ఆమె యొక్క స్థిరమైన విశ్వాసము ప్రకారం, దేవుడు ఆమెను పరిపూర్ణముగా స్వస్థపరిచాడు. అనేక సంవత్సరముల తరువాత, పరిపూర్ణ ఆరోగ్యముతో ఉన్న ఆమెను చూసి డాక్టర్లు సహితం చాలా ఆశ్చర్యపడ్డారు.
‘‘నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచెదను’’ (యిర్మీయా 33:6). దేవుని వాగ్దానము ఎంత వాస్తవమైనదో చూడండి! అవును, డాక్టర్లు ఆశ్చర్యపడునట్లుగా దేవుడే ఆమెను ఎంతో అద్భుతరీతిగా స్వస్థపరిచాడు. ‘‘భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును’’ (యెషయా 41:10) అని ప్రభువు మనకు వాగ్దానము చేసియున్నాడు. ఆయన వాగ్దానమును స్థిరముగా హత్తుకోండి. అప్పుడు మీరు విడుదలతోను మరియు మంచి ఆరోగ్యముతోను జీవించెదరు. ‘‘దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైయున్నవి’’ (2 కొరింథీయులకు 1:20).
Prayer:
ప్రేమగల ప్రభువా,

నా జీవితము కొరకు నీవు అనుగ్రహించిన వాగ్దానములను నేను విశ్వసించుచున్నాను. నేను నీ యందు నమ్మికయుంచియున్నాను. ఈ అనారోగ్యము నుండి నన్ను విడిపించుము. నా బాధలన్నిటి నుండి నాకు విడుదల దయచేయుము. నాకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించి, స్వస్థపరచుము. నీవు నాకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన ఆశీర్వాదకరమైన జీవితమును ఆనందించుటకు నన్ను బలపరచుము. నీవు నన్ను ఎన్నడు విడువనని చేసిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రములు. నీ యొక్క బలమైన హస్తముతో నన్ను ఆదుకొనుమని ప్రభువైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రీ, ఆమేన్‌.

For Prayer Help (24x7) - 044 45 999 000