Loading...
Stella dhinakaran

ఏర్పరచబడిన వారు!

Sis. Stella Dhinakaran
08 Sep
ప్రభువు ఎవరిని తన ప్రజలనుగా ఏర్పరచుకొనును? ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మన కొరకు అర్పించుకొనెను (తీతుకు 2:14; మత్తయి 1:21). ఆవిధంగా, ఆయన వారిని తన ప్రజలనుగా విమోచించి, వారితో కలిసి నివసించుచు, వారిని బలపరచి, అత్యధికమైన ఆశీర్వాదములతో వారిని నడిపించును. ‘‘అయితే మీరు చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు’’ (1 పేతురు 2:9). మనము దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలము. పూర్వకాలమందు దేవుడు అబ్రాహామును మరియు అతని వంశమును ఏర్పరచుకొని వారిని ఆయన యొక్క ప్రత్యేకమైన ప్రజలనుగా విశేషపరచుకొనిన ప్రకారముగా నేడు, దేవుడు మనలను తన యొక్క ఏర్పరచబడిన వంశముగా ఎంపిక చేసుకొనెను. ఇశ్రాయేలుకు మరియు అబ్రాహాము ఇంటికి చెందిన ఆశీర్వాదములన్నియు మనకు కూడ చెందినవే.

దేవుని గూర్చి ఎరుగని ఒక కుటుంబ సభ్యులు ఒకరి తరువాత ఒకరుగా అనారోగ్యము పాలయ్యారు. వారు తమ వద్దనున్న డబ్బంతటిని వైద్య ఖర్చులకు ఉపయోగించినను, వారు స్వస్థతపొందుకోలేదు. కనుక, ఈ కుటుంబము సంతోషమును సమాధానమును కోల్పోయి, ఏమి చేయాలో తెలియక వేదన అనుభవించారు. ఆ పరిస్థితులలో, ఒక సహోదరి, వారిని ‘‘యేసు పిలుచుచున్నాడు’’ ప్రార్థన గోపురమునకు తీసుకొని వెళ్లింది. ప్రార్థన యోధులు చూపించిన ప్రేమయు మరియు చేసిన ప్రార్థన ద్వారా వారు చాలా ఆనందించారు. వారు యేసు ప్రేమను అర్థము చేసుకొని, కుటుంబముగా వారి జీవితములను దేవునికి సమర్పించుకొని, ఆయన యొక్క ఏర్పరచబడిన ప్రజలుగా మారారు. వారి అనారోగ్యము తొలగిపోయినది మరియు దేవుని ప్రేమ వారి కుటుంబమును ఏకము చేసి, వారిని దైవీక ఆనందముతో నింపినది.
ప్రియమైనవారలారా! ప్రభువైన యేసు, మిమ్మును కూడ ఇదేవిధంగా ప్రేమించి, ఆయన యొక్క సొంత ప్రజలనుగా ఏర్పరచుకొనుచున్నాడు. మీరు యేసు యొద్దకు వచ్చినట్లయితే, ఆయన మిమ్మును ఆ పరిస్థితిలోనే విడిచిపెట్టడు. ఆయన మీ హృదయములో క్రియ చేయును. ఆయన మీ పరిస్థితులను మార్చును. యేసు ద్వారా మాత్రమే మార్పు ఏర్పడును. మిమ్మును ఇతరుల కంటె పై స్థానములో ఉంచుటకును మరియు మీ సమస్య నుండి విడిపించుటకును ఆయన మిమ్మును తన సొంత పిల్లలనుగా చేసుకొనును. ఇప్పుడు కూడ, మీ రోగము నుండి మిమ్మును స్వస్థపరచుటకును మరియు మిమ్మును బలపరచుటకును మన ప్రభువు శక్తిమంతుడైయున్నాడు. కనుక నేటి నుండి, మీరు కూడ దేవుని గూర్చి తొలుసుకొని, ఆయనను వెదకవలెను. ‘‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.  నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి’’ అని ఆయన సెలవిచ్చుచున్నాడు. మీకు ఎటువంటి సమస్య ఎదురైనను, దానిని ఆయన పాదముల చెంత ఉంచండి. మీ కొరకు సిలువను మోసిన దేవుడు, మీ భారమును మోసి, మీ బంధకములన్నిటి నుండి మిమ్మును విడిపించడా? నిశ్చయముగా ఆయన మిమ్మును విడిపించును!
Prayer:
"ప్రభువులకు ప్రభువా! 

నేను విమోచింపబడుటకు సిలువ మీద నిన్ను నీవు అర్పించుకొనినందుకై నీకు స్తోత్రములు చెల్లించుచున్నాను. సిలువపై నీవు నా శారీరక శ్రమను మరియు రోగమును భరించియున్నావు గనుక, నన్ను వాటి నుండి విడిపించి, నీ యొక్క పరిపూర్ణ ఆశీర్వాదమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను. దయతో నా భారమును మోసి, నా జీవితమును సుళువుగా మార్చుము. ఈ ప్రపంచములో నేను నీ చేత ఏర్పరచబడిన బిడ్డగా గుర్తింపబడుదును గాక. ఆమేన్‌.

For Prayer Help (24x7) - 044 45 999 000