Loading...

మీరు క్రీస్తులో స్థిరముగా కట్టబడినవారై ఉండండి!

Stella Ramola
09 Apr
నా ప్రియ స్నేహితులారా, నేడు మన మధ్యలో దేవుని మందిరమును అనగా, ఆయన సన్నిధిని ఉంచాలని మన పట్ల కోరుచున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ మధ్య దేవుడు తన మందిరమును ఉంచి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి, నేడు బైబిల్ నుండి దేవుని వాక్యంగా లేవీయకాండము 26:11వ వచనమును మీతో పంచుకోవడము నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ వచనమేమనగా, " నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీ యందు నా మనస్సు అసహ్యపడదు '' అన్న వచనము యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానం ఇది. దేవుడు తన ప్రజలలో నివసిస్తున్నందున, వారు వారి కోసం పోరాడుతున్నందున వారికి ఎటువంటి హాని జరగదని వారు దేవుని వాగ్దానాన్ని పొందుకున్నారు. అవును, నా ప్రియ స్నేహితులారా,ఈ వాగ్దానం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ఈ వాగ్దానం ఇప్పుడు మీ కోసం. దేవుడు ఇప్పుడు మీలో నివసిస్తున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, 2 కొరింథీయులకు 6:16 వ వచనములో మనం పై వాక్యమునే చూస్తున్నాము. ఎందుకంటే, " దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు '' అన్న వచనము ప్రకారము నేడు దేవుడు మన మధ్యలో నివసించి, సంచరించాలని మీ పట్ల కోరుచున్నాడు. కాబట్టి, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, మనం దేవుని ఆలయం, ఆయన మనలో నివసిస్తాడు. మన హృదయాలలో జీవించే దేవుడుగా యేసుప్రభువుగా మన మధ్యలో సజీవంగా జీవించుచున్నాడు. ఈ రోజు, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును, ఓహ్! ఇంత గొప్ప విశ్వంను సృష్టించిన గొప్ప దేవుడు నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు మరియు నన్ను ఎలా గుర్తుంచుకుంటాడు? ఆయనకు ఇంకా ఎన్నో పనులు ఉంటాయి, అయితే, ఆయన నా ప్రార్థనలను కూడా వింటాడా? అని తలంచుచుండవచ్చును. కానీ, నా స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు యేసును విశ్వసించినప్పుడు, మీరు దేవుని ఆలయంగా మార్చబడెదరు మరియు సజీవముగల ప్రభువైన యేసుక్రీస్తుఈ రోజు మీలో నివసిస్తాడు. బైబిలు ఇలా చెబుతోంది, " ఆయనలో మీరు కూడ ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు '' (ఎఫెసీయులకు 2:22) అన్న వచనము ప్రకారము మీరు దేవునికి నివాస స్థలమై యుండునట్లు కట్టబడుచున్నారని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. కాబట్టి, దేనిని నిమిత్తము భయపడకండి.
కాబట్టి, నా ప్రియులారా, దేవుడు నడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని తనలోనే నిర్మించుకున్నందున, మిమ్మల్ని దేవుని నుండి ఎవ్వరు మరియు ఎటువంటి సమస్యలు, సాతాను కూడ మిమ్మల్ని వేరు చేయలేవు. నేడు ఈ సందేశము చదువుచున్న మీ ఆత్మ మరియు దేవుని ఆత్మతో ఏకము కావచ్చును. కాబట్టి, చింతించకండి. దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీ మాట వింటున్నాడా అని ఆశ్చర్యపోకండి. ఆయన మీలో నివసిస్తున్నాడు. అందుకే ఆయన లోకములోనికి మానవునిగా దిగివచ్చాడు. మీలో నివసించడానికి, మీతో నడవడానికి మరియు మీతో సంబంధం కలిగి ఉండటానికి ఆయన మీకు మార్గదర్శకుడుగాను, మీకు బోధకుడుగాను ఉండి మరియు మీరు నడవవలసిన మార్గాన్ని ఆయన మీకు బోధిస్తాడు. కాబట్టి, ఆయనలో సంతోషించి, ఆయన మీలో నివసిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి. నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఆయన నుండి ప్రత్యేకంగా వేరుపరచలేదు. కాబట్టి, భయపడవద్దు. మీరందరు ఉత్సాహంగా ఉండండి. నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని మీరు దేవుని హస్తాలకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన మందిరమును మీ మధ్యలో ఉంచి, మీ యందు ఆయన మనస్సు అసహ్యపడకుండా, ఆయన మీ ఆలయముగా ఉండి, ఆయన మీలో నివసించి సంచరిస్తాడు, ఆయన మీకు దేవుడై యుంటూ, మిమ్మల్ని ఆయన ప్రజలనుగా చేసికొని, మిమ్మల్ని పరవశింపజేస్తాడు.
Prayer:
ప్రశస్తమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించుచున్నాము. నీ ప్రేమ ఎంత గొప్పది! మమ్మల్ని రక్షించడానికే నీవు సిలువపై మరణించావు. ఈ సత్యాన్ని గ్రహిస్తూ, మేము మా పాపాలన్నీ నీ యెదుట ఒప్పుకుంటున్నాము. దేవా, ఎటువంటి సమస్యలు, అపవాది నీ నుండి మమ్మల్ని వేరు చేయనందుకై నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. నేడు నీ ప్రశస్తమైన రక్తంతో మమ్మును కడిగి పవిత్రపరచుము. నీవలె మేము పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించడానికి మాతో జీవించి మమ్మును బలపరచుము. దేవా, నీకు మా పట్ల ఉన్న ప్రేమ ద్వారా మాలోనికి మరియు మా హృదయములోనికి, కుటుంబములోనికి రమ్మని ఆహ్వానించుచున్నాము. ప్రభువా, నీవు మాలోనికి వచ్చి నివసించి మా భయాలన్నిటిని తొలగించుము. యేసయ్యా, మేము నీతో నడవడానికి మరియు నీతో మాట్లాడటానికి మరియు మాలో నీ సన్నిధిని గుర్తించడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీవు మాలోనికి వచ్చి, మా మధ్య నివాసమును లేక నీ మందిరమును మా మధ్య ఉంచి, మమ్మును ఈలోక మరియు పరలోకపు దీవెనలతో సమృద్ధిగా దీవించుము. దేవా, నీవు మాతో ఉండి మరియు ఈ మా జీవితములో జరగబోయే ప్రతి చిన్న సంఘటనలలో కూడా మాతో నీ సన్నిధిని మా పట్ల కనుపరచుము. దేవా, నీ స్వరాన్ని వినడానికి మరియు నీకు విధేయత చూపించడానికి నీ కృపను దయచేయుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000