Loading...

లెక్కకు విస్తారమైన దీవెనలు!

Stella Ramola
28 Oct
నా ప్రియ స్నేహితులారా,ఈరోజు ఈ సందేశము చదువుచున్న మీకు వ్రాయడం నేను దీవెనగా భావిస్తున్నాను. నేటికి దేవుని వాక్యం యెషయా 61:6 వ వచనము బైబిల్ నుండి ఎన్నుకొనబడినది. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు " జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు.'' అవును, ప్రియులారా, దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు మరియు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోవు చున్నాడు. అయితే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఇలా అనవచ్చును, ' ఇదంతా చాలా బాగున్నది! కానీ, నేను అప్పుల్లో మునిగిపో యాను. నేను నా అప్పును ఎలా తిరిగి చెల్లించబోతున్నానో నాకు తెలియదు. నేను తీసుకున్న ఈఎంఐని ఎలా చెల్లించాలో నాకు తెలియదు. ' ఇంకను మీరు మీ పిల్లలను ఎలా చదివించబోతున్నారు లేదా ఆసుపత్రి బిల్లును ఎలా చెల్లించబోతున్నారు అని కూడా మీరు ఆశ్చర్యపోవచ్చును.

నా ప్రియులారా,ఈ భారాలన్నియు మీరు నిద్రపోలేనంతగా మీ తలంచుకుంటూ ఉండవచ్చును. ఇంకను మీరు కళ్ళు మూసుకున్న ప్రతిసారీ, అవి మీ ముందుకు వచ్చి మిమ్మల్ని భయపెట్టవచ్చును. మీరు ఆశ్చర్యపోవచ్చును, ' నేను ఎలా బ్రతకాలి? ' కానీ నా ప్రియ స్నేహితులారా,ఈ రోజు దేవుడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని మీ పట్ల వాగ్దానం చేయుచున్నాడు. బైబిల్ నుండి కీర్తన 66:12లో చెప్పినట్లుగా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఉండే ప్రదేశానికి తీసుకువస్తాడు: " నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించి యున్నావు.'' కాబట్టి, నేడు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిని చూచి భయపడకండి, దేవుని యందు నమ్మకంగా ఉండండి. ధైర్యంగా ఉండండి.
నా ప్రియులారా, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడో మరియు జీవితంలో మిమ్మల్ని ఎంతగా అభివృద్ధి పరచాడో అని మీరు ప్రజలకు సాక్ష్యమిస్తారు. అవును, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ ఆశీర్వాదాలను చూచి దేవుని మహిమపరుస్తారు. కాబట్టి ఈరోజు ఈ సందేశము చదువుచున్న మీ కన్నీళ్లు తుడవండి. దేవుడు మీకు తగిన సమయంలో సమస్తమును సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అంతమాత్రమే కాదు, డబ్బు ఎక్కడి నుండి వస్తుందో మీకు తెలియదు, కానీ మీరు దానిని పొందుకుంటారు. అవును, దేవుడు నేడు ఈ సందేశము చదువుచున్న మీకు సరైన సమయంలో డబ్బు వచ్చేలా చేస్తాడు మరియు మీరు అదనముగా మరి ఎక్కువగా కలిగి ఉంటారు. ఆలాగుననే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు, ఆయన మిమ్ములను సమృద్ధిగా దీవిస్తాడు. అది కొంచెమైనా కాదు. కాబట్టి ఉత్సాహంగా ఉండండి మరియు ప్రభువులో ఆనందించండి. మీరు దేవునికి ఎంతో అమూల్యమైనవారు. మీరు ఆయన పరిచారకులు మరియు యాజకులు. కాబట్టి ఆయన నేడు ఈ సందేశము చదువుచున్న మీకు అద్భుతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు మరియు తక్కువ ఏమీ లేదు. కాబట్టి, నేడు ఈ సందేశము చదువుచున్న పరిస్థితులు మారబోవుచున్నాయి. పట్టుకోండి మరియు నమ్మకంగా ఉండండి, అప్పుడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రతి కష్టాన్ని సుళువుగా జయిస్తారు!
Prayer:
ప్రేమా నమ్మకమైన పరలోకమందున్న తండ్రీ,

నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, నీకు వందనములు. ఈ రోజు నీవు మాకిచ్చిన వాగ్దానానికై నీకు వందనములు. దేవా, నేడు మా అవసరాలన్నీ తీర్చి, మమ్మల్ని అభివృద్ధి చేస్తావని మేము నమ్ముచున్నాము. ప్రభువా, నీవు మమ్మును అత్యధికంగా మరియు సమృద్ధిగా అనుగ్రహిస్తావని మాకు తెలుసు. దేవా, మా పట్ల నీ మంచితనం మరియు మేలులను చూచి, నిన్ను మహిమపరిచేలా చేయుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000