Loading...
DGS Dhinakaran

మీకు మంచి యీవులనిచ్చే పరలోకపు తండ్రి!

Bro. D.G.S Dhinakaran
13 Feb
నా ప్రియులారా, నేడు మన పరలోకపు తండ్రి, ఆయన తన బిడ్డలు అడిగే ప్రతిఒక్కరికి మంచి యీవులను ఇవ్వాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. భారతదేశం బ్రిటిష్ పరిపాలన నుండి స్వాత్రంత్యం పొందిన తరువాత, నూతన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు, మహాత్మా గాంధీ, మీరు రాజ్యాంగ చట్టం వ్రాస్తున్నప్పుడు, ఏదైనా వ్రాయండి. కానీ, నాకు ఒక విషయం తప్పకుండా వ్రాయాలి, అదేమనగా, ' ప్రతి భారతీయుడి కన్నీరు తుడవబడాలని ' నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. అదే గాంధీగారి హృదయం! అదేవిధంగా, మన సర్వశక్తిమంతుడు దేవుడైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్పబిందువులను తుడిచివేయాలని కూడ మన పట్ల ప్రేమతో కోరుచున్నాడు. అందుకే దేవుని వాక్యము ఏమంటుందో చూడండి, " అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన యెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యావుల నియ్యనెరిగి యుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచి యావుల నిచ్చును '' (మత్తయి 7: 9-11) అన్న వచనముల ప్రకారము దేవుడు మనకు మంచి యీవులనిస్తాడని వాగ్దానము చేయుచున్నాడు. కాబట్టి, మీరు దేనిని గూర్చి చింతించకండి.

ఆలాగుననే, ఈనాడు పరలోకంలో ఉన్న మంచి తండ్రి మానవాళికి తన అద్భుతమైన మరియు విలువైన ప్రేమను కనుపరచడానికి ఏ మంచి యీవిని ఈ లోకమునకు మన కొరకు పంపాడు? మన కొరకు చనిపోవడానికి ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును శరీరధారిగా ఈ లోకానికి పంపాడు. యేసు మానవుని స్వరూపంలో ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు? ఒక బోధకుడు ఈ విధంగా వివరించాడు - అతను వీధిలో నడుస్తున్నప్పుడు అక్కడ చీమల సమూహం ఒక వరుసలో వెళ్లుచున్నట్లు అతను గమనించాడు. చీమలు ఈ బోధకుని యొక్క కాలును చూసిన వెంటనే, అతడు వాటిని ఏదో కష్టపెట్టబోవుచున్నాడని ఆ చీమల గుంపు తలంచుకొనెను. అందు వలన, అతడు వాటికి చెప్పే దయగల మాటలతో సంబంధం లేకుండా, ఆ చీమలు ఇక్కడకు మరియు అక్కడకు చెల్లాచెదరై పోవుచుండెను. ఆ సమయంలో, ఆ బోధకుడు దానిని గ్రహించాడు. కానీ, తాను ఏమి చేయలేక, నేనుగానీ చీమని అయితే, నేను వాటికి ఎటువంటి హాని కల్పించనని చెప్పబోయే నా సందేశాన్ని సులభంగా తెలియజేయగలిగి యుంటాను కదా! అని తలంచుకున్నాడంటా!
నా ప్రియులారా, యేసు ప్రభువు కూడ ఈ లోకంలోనికి శరీరధారిగా మానవ స్వరూపమును ధరించి మన కొరకు వచ్చాడు. తద్వారా, ఆయన మహిమను మనం చూస్తున్నాము! పాపం, అనారోగ్యం, శాపం, అవమానము, పేదరికము నుండి మనల్ని విడిపించి లేక రక్షించి, మనము పొందుకొనవలసిన ప్రతి ఆశీర్వాదం దాని సహజ రూపంలో మీకు మరల ఇవ్వాలనునదియే మీ పట్ల దేవుని యొక్క హృదయ స్పందనయై మరియు ఉద్దేశమై యున్నది. అందుకే బైబిలేమంటుందో చూడండి, " తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? '' (రోమీయులకు 8:32) అన్న వచనము ప్రకారము కాబట్టి, ఈ రోజు మీ అవసరం ఏమైయున్నదో? ఏదైనను సరే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ధైర్యంగా దేవుని అడగండి. అప్పుడు ఆయన సన్నిధిలో మీ కోసం దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నిటిని మీ సొంతం చేసుకొనండి. అప్పుడు దేవుడు మీకు కొలతలేకుండా మరియు ఊహించలేని రీతిలో మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ కొరకు కనిపెట్టుకొని ఉన్నందున మీకు ఏ మేలు కొదువై ఉండదు. అంతేకాక, మీ దుఃఖం మహిమాన్వితమైన రీతిలో సమాప్తమగును. మీ కన్నీళ్లకు కారణం ఏమైనప్పటికిని, యేసు మీ ముఖము మీది ప్రతి బాష్పబిందువును తుడిచివేస్తాడు.

నేడు ఈ సందేశము చదువుచున్న మీకు మంచి యీవులను ఇవ్వాలని కోరుచున్నాడు, మీ చదువుల విషయములోను, మీ వ్యాపారములోను, మీ ఉద్యోగములోను, మీ కుటుంబ కార్యాలలోను, మంచి యీవులను మీకు ఇస్తాడు. నేడే అటువంటి మీ కొరతలను తీర్చే దేవుని యొద్ద నుండి మంచి మేలులను పొందాలని కోరినట్లయితే, ఈ రోజు మీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని, ఆయనను వెదకినట్లయితే, మీరు ఏది అడిగిన దేవుడు మీకు అది దయచేసి మీ కొరతలన్నిటిని తీర్చి మీకు మంచి యీవులనిచ్చి మిమ్మును దీవించును. మంచి యీవులనిచ్చే దేవుని యొద్దనుండి గొప్ప వాటిని ఎదురు చూచినప్పుడు దేవుడు మీకు నిత్యమైన తండ్రిగా వుండి మీకు మంచి యీవులనిచ్చి విస్తారమైన ఆశీర్వాద ములతో మిమ్మును దీవిస్తాడు.
Prayer:
ప్రేమా కనికరముగల మా ప్రియపరలోకపు తండ్రీ,

మా జీవితములోని ప్రతి అవసరమును నీ గాయపడిన హస్తములకు సమర్పించు కొనుచున్నాము. దేవా, జ్ఞానము కొదువగా వున్న యెడల అడుగుడి మీకు దయచేయునని నీ లేఖనము చెప్పిన విధంగా, మా చదువులలోను, మా ఉద్యోగములోను, వ్యాపారములోను, కుటుంబములోను మాకు తగిన జ్ఞానమును దయచేయుము. మా జీవితములో వున్న కొరతలన్నిటిని దేవా, క్రీస్తు యేసులో నెరవేర్చుము. నీ కృప ద్వారా నీ యొద్ద ఉన్న మంచి యీవులను, జ్ఞానమును మాకు అనుగ్రహించి మా ద్వారా ఇతరులకు అనేక అద్భుత కార్యములను జరిగించుము. అపవాది చేతిలో నుండి మమ్ములను కాపాడి మా చుట్టు వున్న బంధకాల నుండి విడిపించి నీ మంచి యీవులతో మమ్మును నింపుమని కోరుచున్నాము. ఆయా సమయాలకు తగిన జ్ఞానమును మాకు దయచేయుము. ప్రభువా, మనుష్యుల సహాయము కోరక, లేక వారిని నమ్మక నీ యందు విశ్వాసము కలిగి జీవించునట్లు మాకు సహాయము చేయుము. నీవనుగ్రహించు జ్ఞానము ద్వారా మా యిల్లు కట్టబడునట్లు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000