Loading...
Dr. Paul Dhinakaran

మీరు దేవునికి ఇచ్చి ప్రతిఫలమును పొందుకొనండి!

Dr. Paul Dhinakaran
23 Feb
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు దేవునికిచ్చి ఆయన యొద్ద నుండి విస్తారమైన దీవెనలు పొందాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అప్పుడు మీరు దేవునికి ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని మరియు ఆయన ఆజ్ఞల నేరవేర్పును మీరు గ్రహిస్తారు. దేవుడు ఎటువంటి వారి పట్ల సంతోషంగా ఉంటాడని వాక్యము సెలవిచ్చుచున్నదో చూడండి, " సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును '' (2 కొరింథీయులు 9:7) అన్న వచనము ప్రకారము అవును, దేవుడు సంతోషంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. మీరు దేవునికి ఇవ్వండి, తగిన ప్రతిఫలమును పొందండి. మనము ఆయనకు ఇచ్చినప్పుడు, దేవుడు తిరిగి మనకు ధారాళముగా అనుగ్రహిస్తాడని వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. " ...ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు... '' (లూకా 6:38) అన్న వచనము మనకు కలిగిన దానిలో నుండి దేవునికివ్వాలని ఆయన ఆశించుచున్నాడు. ఇది డబ్బు మాత్రమే కాదు, ఒక విధంగా, మీ యొక్క ప్రోత్సహకరమైన మాటల ద్వారా కూడా; ఇతరులను ఆశీర్వదించడానికి మీ తలాంతులను మరియు మీ అధికారాన్ని ఉపయోగించి చుట్టుప్రక్కల నివసించే ప్రజలకు మరియు దేశానికి మేలు లేక మంచి కార్యాలు చేయడానికి ప్రయోజనకరముగా ఉండండి. మీరు చేయుచున్న ప్రతిపనిలోను ఆయన మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. ఈ రోజు మీకు కలిగిన దానిలో నుండి దేవునికివ్వండి. బైబిల్‌లో, యోహాను 6:1-14వ వచనములలో మనము చూచినట్లయితే, ఒక చిన్న పిల్లవాడు తన యొద్ద ఉన్న ఐదు రొట్టెలు మరియు రెండు చిన్న చేపలను యేసునకు ఇచ్చి, ఒక గొప్ప జనసమూహాన్ని పోషించాడు.

విలియం కోల్గేట్ సుదీర్ఘమైన విజయవంతమైన వ్యాపార చరిత్రలో అధికముగా దశమ భాగమును ఇచ్చేవాడు. ఆయనకు దశమ భాగమును తప్పక చెల్లించే అలవాటు ఉండేది. తన కోల్గేట్ సోపు సంస్థ ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయముతో దశమ భాగమును మాత్రమే గాక, రెండు దశమ భాగములు, ఆ తరువాత మూడు దశమ భాగములు అని ఈ విధంగా పెంచుకొంటూ పోవుచు, చివరికి ఆయన ప్రపంచమంతట జరుగుచున్న దేవుని పరిచర్య కొరకు తన యొక్క ఆదాయములోని 9 దశమ భాగములను ఇచ్చాడు. ఆయన జీవితపు చివరి దశలో, ఆయన చెల్లించిన కానుకల రహస్యమును ఈ విధంగా తెలియజేశారు. ఆయన 16 సంవత్సరముల వయస్సులో, యౌవనస్థునిగా ఉన్నప్పుడు, ఉద్యోగము చేయుచున్న సోపు ఉత్పత్తి చేయు సంస్థ నుండి బయటకు వచ్చి, క్రొత్త ఉద్యోగమును వెదకుట కొరకు న్యూయార్క్ పట్టణమునకు అతడు ఒక చిన్న పడవ మీద వెళ్లుచున్నారు. అప్పుడు ఆ పడవ అధిపతి కోల్గేట్‌ను గూర్చి తెలుసుకొన్నారు. సోపు వ్యాపారమును ప్రారంభించుటకు న్యూయార్క్ పట్టణమునకు వెళ్లుచున్నట్లుగా కోల్గేట్ ఆయనతో చెప్పారు. అందుకు ఆ పడవ అధిపతి, " న్యూయార్క్ పట్టణము త్వరలో సోవు వ్యాపారంలో ఒకరు ఉన్నత స్థానమునకు ఎదగబోవుచున్నాడు. అది నీవు కూడ అయ్యుండవచ్చును. కానీ, నీవు తయారు చేయు ఈ సోపు దేవుడు నీకు అనుగ్రహించిన ఆధాయములోనే దశమ భాగమును దేవునికి ఇవ్వు, '' అని సూచించాడు. అదేవిధంగా, విలియం కోల్గేట్ తన సంస్థ తయారు చేయు సరుకులతో సహా సమస్తమును దేవుడే ఆయనకు ఇచ్చుచున్నాడని విశ్వసించాడు. తాను వ్యాపారమును ప్రారంభించిన మొదటి దినము నుండియే ఆయనకు వచ్చిన కొంచెం లాభములో నుండి ఆయన దశమ భాగమును ఇచ్చుటకు ప్రారంభించారు. అనుదినము యథార్థముగా ఆయన దశమ భాగమును చెల్లించగా ఆయన వ్యాపారము వృద్ధి పొందినది. ఆయన వ్యాపారము వృద్ధి పొందగా, పొందగా, ఇంకా అధికముగా దశమ భాగమును చెల్లించారు. చివరికి కోటీశ్వరుడయ్యాడు.
నా ప్రియులారా, దేవునివి దేవునికే చెల్లించెదము. ఆయన మనకు ఇచ్చిన దానిలో నుండి యథార్థముగా దశమ భాగమును చెల్లించెదము. " నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును '' (సామెతలు 16:3) అన్న వచనము ప్రకారము నేడు మీ మార్గములను దేవునికి సమర్పించి, ఆయన మీ జీవితములో చేసిన మేలుల నిమిత్తము ఆయనకు కృతజ్ఞలై యున్నప్పుడు ఆయన మీ ఉద్దేశములను సఫలపరచును. అంతమాత్రమే కాదు, " మీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక మీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము '' (సామెతలు 3:5) అన్న వచనము ప్రకారము అప్పుడు ప్రభువు మీ జీవితములో క్రియ జరిగించుచు, అనేకులకు మిమ్మల్ని ఆశీర్వాదకరముగా మార్చును. అనుదినము, ప్రతినెల, ప్రతి సంవత్సరములు దేవునికి చెల్లించవలసిన దాని యందు యథార్థముగా ఉండుట ఎంతో ప్రాముఖ్యము.

నా ప్రియులారా, తన యొక్క అందం మరియు అద్భుతాలతో ఆకాశాన్ని, భూమిని నింపిన ప్రభువు తన గొప్ప ఆలోచనలు, జ్ఞానం, తలాంతులతోను మరియు ప్రజలతో నేడు మిమ్మల్ని కూడ నింపుతాడు. అప్పుడు మీకు ఏ మేలు కొదువై యుండదు. మీరు మీ స్వబుద్ధిని ఆధారము చేసికొనకుండా, మీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మకముంచండి. మీరు అలా చేసినప్పుడు, మీరు అడుగు పెట్టిన దేశానికి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదకరంగా మారుస్తాడు. దేవుని ప్రజలకు మరియు ఆయన రాజ్యాన్ని కట్టడానికి మీరు మీ చేతులు చాపినప్పుడు, మీ జీవితంలో నిలువజేయబడిన నీటి బుగ్గల వంటి ఆశీర్వాదములను మీరు చూస్తారు. బైబిల్ వాగ్దానం చేస్తుంది, " ఔదార్యముగలవారు పుష్టినొందుదురు. నీళ్లు పోయువారికి నీళ్లు పోయబడును '' (సామెతలు 11:25) అన్న వచనము ప్రకారము ఈనాడు దేవుని రాజ్యము కట్టుటకు మీరు విత్తిన దానిని నూరంతలుగా ప్రతిఫలమును పంటగా కోస్తారని నేను మీకు వాగ్దానము చేయుచున్నాను. మీరు ప్రభువునకు ఇచ్చు సమయము లేక డబ్బు కానీ, ఏదైన సరే, మీరు దేవునికి ఇచ్చిన దానిని రెండంతలుగా విస్తరింపబడుతుంది. కాబట్టి, దేవునికి ఇవ్వండి నూరంతల పంటను తిరిగి పొందుకొని ప్రభువునందు సంతోషించండి. దేవుడు మిమ్మును నూరంతలుగా నిండుకొలతతో దీవించును గాక!
Prayer:
కృపాకనిరకములు గల దేవా, దీవెనలకు పాత్రుడవైన మా తండ్రీ,

దేవా! నీవు మా జీవితములో చేసిన మేలులకు మేము నీకు కృతజ్ఞులముగా ఉండుటకు మాకు కృపను దయచేయుము. నీ ప్రసన్నత ఎల్లవేళల యందు మేము పొందునట్లు మా లోనికి రమ్ము. మేము నీకు కానుకలిచ్చుటకు మా హృదయములను మరియు మా గుప్పిళ్లును తెరువుము. మాకు కలిగిన లేమిలోను, కలిమిలోను ధారాళముగా నీకిచ్చుటకు మాకు నేర్పుము. పై చెప్పబడిన గొప్ప వ్యక్తివలె మేము కూడ మా లేమిలో నీ రాజ్యము విస్తరించుటకు దశమ భాగమును ఇచ్చుటకు మాకు సహాయము చేయుము. నీలో గుప్తములై యున్న మంచి యీవులను మాకు అనుగ్రహించుమని అతి మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. మేము నీకిచ్చుట ద్వారా మా హృదయములను పూర్ణ ఆశీర్వాదములతో నింపుము. మా జీవితములోని అవసర త లను తీర్చి మా విన్నపములకు చెవియొగ్గి, మాకు రక్షణానందమును దయచేయుమని మా రక్షకుడును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000