Loading...
Stella ramola

సమృద్ధిగా ఆశీర్వదించబడండి!

Sis. Stella Dhinakaran
15 Sep
నా ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను మీకు వందనములు తెలియజేయుచున్నాను. ఈ రోజు, వాగ్దాన వచనముగా, కీర్తన 4:7, " వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. '' ఇది మనం ప్రభువు నుండి పొందిన సమృద్ధియైన దీవెనను సూచిస్తుంది. ప్రతిచోటా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఆశీర్వాదాలు ఉంటాయి. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఇలా అనవచ్చు, ' నా జీవితంలో అలా కాదు. నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను. నా జీవితంలో ఏమీ లేదు. అన్నియు కొరతగానే ఉన్నది ' అని చెప్పుచుండవచ్చును.

మనము కీర్తన 4:1 చదివినట్లయితే, " నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము. '' చాలా సార్లు మనం కష్టాలను ఎదుర్కొంటాం. అయితే, మనము, ' మా ఇబ్బందులను భరించలేకపోతున్నాము మరియు ఓ ప్రభువా, మాకు సహాయం చేయుమని దేవునికి మొరపెడతాము.' అందుకే బైబిల్‌లో మీరు కీర్తన 34:19 చదివినట్లయితే, " నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును '' అని చెప్పబడియున్నది. అవును, ప్రియమైన స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు నీతివంతమైన జీవితాన్ని గడిపినప్పుడు ప్రభువు మీతో సంతోషించి, మీ అవసరాలను తీరుస్తాడు మరియు అన్ని సమస్యల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. మీ కష్టాలను గురించి మీరు ఇకపై విచారించకండి. ఎందుకంటే, దేవుడు మీ నీతివంతమైన జీవితాన్ని చూసి మిమ్మల్ని తప్పించగలడు.
ఇంకను బైబిల్‌లో యోహాను 16:24 ఇలాగున చెబుతోంది, " ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును'' అన్న వచనము చెప్పినట్లుగానే మీరు మీ ఆశీర్వాదాలను దేవుని యొద్ద అడిగి పొందుకొనండి. అందుకే బైబిల్‌లో చూచినట్లయితే, " నిన్ను వెదకు వారందరు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురు గాక '' (కీర్తన 40:16) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రభువును వెదకవలసియున్నది. అప్పుడు మీరు దేవుని గూర్చి ఉత్సహించి సంతోషించుదురు. ఈ రోజు ఈ సందేశము చదువుచున్న మీరు ఆ విధంగా ఆశీర్వదించబడతారు. నేటి వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోవుతున్నాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మీరు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి మరియు మీకు అవసరమైన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడి ఆశీర్వాదాలను నమ్మండి మరియు పొందుకొనండి.
Prayer:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ,

ఈ చక్కటి వాగ్దానానికై వందనాలు. ప్రభువా, మా సమస్యలన్నింటిని నీ చేతులకు అప్పగిస్తున్నాము. దేవా, మా కష్టాల నుండి మమ్మల్ని విడిపించుము. దేవా, మేము నిన్ను వెదకడానికి మాకు కృపను అనుగ్రహించుము మరియు నీ ఆనందంతో నిండిపోయేలా మాకు సమృద్ధిగాను మరియు అంతకంటే ఎక్కువ ఆశీర్వదించడం ద్వారా సంతోషించునట్లు చేయుము. దేవా, మేము ఎదుర్కొంటున్న ఆపదలు అనేకముగా ఉన్నను, నీవు మమ్మల్ని వాటన్నిటి నుండి తప్పించుము. దేవా, నేటి నుండి మా దుఃఖాన్ని మార్చి, మాకు అధికమైన సంతోషాన్ని కలుగజేయుమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

For Prayer Help (24x7) - 044 45 999 000